Actress Karuna Bhushan: ఆ హీరో సినిమా లైఫ్ చేంజ్ చేసింది - నటి కరుణ భూషణ్
Karuna Bhushan: యువ సీరియల్ ద్వారా పరిచయమై శ్రావణ సమీరాలు సీరియల్ తో సక్సెస్ ని అందుకున్న సీరియల్ నటి కరుణ భూషణ్. తాజాగా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.
Actress Karuna Bhushan: ‘ఆహా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కరుణభూషణ్ తర్వాత చాలా సినిమాలలో నటించి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది. అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి అలాగే బిగ్ బాస్ హౌస్ గురించి.. ఇంకా ఎన్నో సంగతులు చెప్పుకొచ్చింది. ఆ సంగతులు ఏంటో చూద్దాం.
కరుణ భూషణ్ ‘ఆహా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుని ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘కాటమరాయుడు’ వంటి సినిమాలలో నటించింది. అలాగే యువ సీరియల్‌తో బుల్లితెరపై కూడా ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్ చేస్తున్న కరుణ భూషణ్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో మీరు అన్ని లాంగ్వేజెస్‌ను కవర్ చేసేసారు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘‘లేదండి ఇంకా హిందీ, ఇంగ్లీష్ భాషలు మిగిలిపోయాయి ఫ్యూచర్‌లో అవి కూడా చేస్తానేమో అని చెప్పుకొచ్చింది కరుణ. మీరు ఇన్ని సినిమాలు సీరియల్స్ చేశారు కదా మీ లైఫ్ టర్నింగ్ అయినా ఒక సినిమా ఏంటి? అని అడిగితే ఏం పేరు చెప్తారు అంటే వెంటనే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమా పేరు చెప్పింది కరుణ.
ఆ సినిమాతో తనకి చాలా గుర్తింపు వచ్చిందని సినిమా చేస్తున్నంతసేపు తమన్నాతో సిద్ధార్థ వాళ్లతో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ మీతో టచ్ లో ఉండే యాక్టర్స్ ఎవరు అని అడిగితే సిగ్గుపడుతూ నాగార్జున పేరు చెప్పింది కరుణ. ‘‘ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ని ఆయనతో మాస్ సినిమా చేసినప్పుడు ఆయననే అలా చూస్తూ ఉండిపోయేదాన్ని’’ అని తెలిపారు. ఆయన ముందు నటించాలంటే షివరింగ్ వచ్చేసేది అంటూ ఆనాటి జ్ఞాపకాలని చెప్పుకొచ్చింది కరుణ. ‘‘నాకు ‘బిగ్ బాస్’ సీజన్ 1, 2 కాల్ వచ్చింది. కానీ అప్పుడు నేను ఉండే బిజీలో ఆ షోలో పాల్గొలేకపోయాను. ఆఫర్ అయితే వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది కరుణ.
ఇక ప్రజలు మిమ్మల్ని బయట చూసినప్పుడు ఎలా ఫీలవుతారు. సీరియల్‌లో విలన్ కాబట్టి బయట కూడా మిమ్మల్ని విలన్ గానే చూస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘‘ఇంతకుముందు నన్ను చూసినప్పుడు ఎక్కడో చూశాను అనుకునేవారు కానీ ఇప్పుడు మీరు కరుణ కదా, మీరు ఊర్మిళ కదా అని గుర్తుపట్టి నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు. అలాగే విలన్ రోల్ అంటే అది పూర్తిగా విలన్ రోల్ కాదు. తనకి కావలసింది దక్కించుకోవడంలో ఆమె విలన్ గా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు నన్ను ఆ విధంగా ఎప్పుడు చూడలేదు’’ అని చెప్పుకొచ్చింది కరుణ.
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్ నాన్న’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?