Jagadhatri Serial January 29th: చెల్లెలికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధాత్రి.. నిషిక చేసిన పనికి షాక్ లో కౌషికి!
Jagadhatri Serial Today Episode: బయటి వాళ్ల ముందు నిషిక కౌషికిని ఆస్తులలో వాటి గురించి నిలదీయడంతో అందరూ ఒక్కసారి గా షాక్ అవడంతో కధ లో కీలక మలుపులు ఏర్పడతాయి
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కాళ్ళు నొప్పితో బాధపడుతున్న కౌషికి కి సేవచేస్తుంది ధాత్రి.
ధాత్రి: అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తిని డోర్ దగ్గర ఎందుకు ఆడుకుంటున్నావు అని అడుగుతుంది.
కీర్తి: నేను స్టెప్స్ దగ్గర ఆడుకుంటుంటే నిషిక అత్త వెళ్లి స్నానం చేయమంది, వెళ్లిపోయాను అంతేకానీ నేను డోర్ దగ్గర ఆడుకోలేదు అంటుంది.
ధాత్రి : స్టెప్స్ దగ్గర ఉండవలసిన గోళీలు డోర్ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతుంది.
నిషిక : మాకెలా తెలుస్తుంది మేమేదో కావాలని చేసినట్లు అడుగుతున్నావు అని కోప్పడుతుంది.
వైజయంతి: ఏంటమ్మి నువ్వు వచ్చిన దానివి వచ్చినట్లు ఉండటం మానేసి మా మధ్యలో గొడవలు పెడుతున్నావు అంటుంది.
కౌషికి: తన ఆఫీసులో వాళ్ళకి ఫోన్ చేసి న్యూస్ రేపు టెలికాస్ట్ చేద్దామని చెప్తుంది.
అందుకు వైజయంతి వాళ్ళు ఆనందపడతారు. తర్వాత ధాత్రి కౌషికి ని తీసుకొని తన రూమ్ కి వెళ్తుంది.
కౌశికి : దాత్రి చేయి పట్టుకొని థాంక్స్ చెప్తుంది ఎందుకు వదిన అంటే కుటుంబ సభ్యులు రెండు అడుగులు వెనక్కి వేస్తే నువ్వు మాత్రం దగ్గరకు వచ్చి సేవ చేసావు అని ఎమోషనల్ అవుతుంది.
ధాత్రి: మీరు నన్ను ఊరికే పొగిడేస్తున్నారు, ఈ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు అంటు టీ తీసుకురావడానికి వెళుతుంది.
మరోవైపు నిషిక మొట్టమొదటిసారి ఈ ఇంట్లో నేను అనుకున్నది జరిగింది అని ఆనందపడుతుంది.
వైజయంతి : కౌషికి బాధతో విలవిలలాడుతుంటే చూడలేకపోయాను ఎంతైనా చిన్నప్పటినుంచి పెంచాను కదా అంటుంది.
నిషిక: అలా జరగబట్టే న్యూస్ టెలికాస్ట్ పోస్ట్ పోన్ అయింది. దానిని పట్టుకొని వెళ్లి దివ్యాంకకి ఇస్తే మీ కోడలు సీఈఓ పోస్ట్ లో ఉంటుంది అంటుంది. ఆ తర్వాత దివ్యాంక కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది.
దివ్యాంక: నిషిక ని పొగిడేస్తూ ఇంకొన్ని రోజుల్లో సీఈవో కాబోతున్నావు అని చెప్తుంది. న్యూస్ టెలికాస్ట్ చేస్తానని చెప్పి కాళ్లు విరగ్గొట్టుకుని కూర్చుంది అని కౌషికి గురించి వెటకారంగా మాట్లాడుతుంది.
ఆ మాటలకి నిషిత, వైజయంతి నవ్వుతారు అది బయట నుంచి విన్న ధాత్రి కోపంతో రగిలిపోతుంది. కోపంగా నిషిక దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ లాక్కుంటుంది.
ధాత్రి: మా వదినకి దెబ్బ తగిలిందని ఆనందపడుతున్నట్లు ఉన్నావు అది ఎక్కువ సేపు సాగదు. రేపు మా వదిన ఛానల్ కి వెళుతుంది న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది అంటుంది.
దివ్యాంక : రేపు ఆ న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో నేను చూస్తాను అని అరుస్తుంది.
ధాత్రి : నీ ముచ్చట నేనెందుకు కాదనాలి. న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో అలా చూస్తూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
వైజయంతి : పక్క వాళ్ళ దగ్గర అలా ఫోన్ లాక్కోవడం మర్యాదేనా అని అడుగుతుంది.
ధాత్రి : తను చేస్తున్నది తప్పు మీరు సర్ది చెప్పటం మానేసి తనని సపోర్ట్ చేస్తున్నారు ఇది కరెక్టేనా అని వైజయంతిని నిలదీస్తుంది. ఇంట్లో మనకి మనకి ఎన్ని ఉన్నా బయట వాళ్ళు వచ్చేసరికి అందరం ఒకటవ్వాలి అలా కాదని వదినకు వ్యతిరేకంగా ఏమైనా చేశావంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెల్లెలికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
కోపంతో రగిలిపోతారు నిషిక, వైజయంతి.
ఆ తర్వాత ఇంటికి కొందరు గెస్ట్ లు వస్తారు. సుధాకర్ వాళ్ళకి కౌషికి వాళ్లని పరిచయం చేస్తుంది. వాళ్లు షాపింగ్ మాల్ పెట్టి వర్కర్స్ కోసం క్వార్టర్స్ కట్టి చిన్న ఏరియా ఫామ్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఉరవతల వున్న మన సైట్ ని ఇద్దామనుకుంటున్నాను మీరందరూ సంతకాలు పెట్టాలి అంటుంది.
ఇది మంచి డీలింగ్ అని చెప్పి సుధాకర్ ఫైల్ మీద సంతకం పెడతాడు.
నిషిక :ఇలా సంతకం పెట్టడం వల్ల మనకి ఎంత ఆస్తి వస్తుంది అని అత్తగారిని అడుగుతుంది.
వైజయంతి: అక్కడ 150 ఎకరాలు ఉన్నాయి 70% కౌశిక్ ఇది కాబట్టి తనకి 100 ఎకరాలు మనకి 50 ఎకరాలు అని చెప్తుంది.
ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాత ఫైల్ నిషిక దగ్గరికి వచ్చేసరికి నేను సంతకం పెట్టను అంటుంది. ఇలా సంతకం పెట్టడం వల్ల మాకు వచ్చే లాభమేమిటి మా వాటా ఎంత అంటూ కౌషికిని నిలదీస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Read Also: తొమ్మిది మంది బాలీవుడ్ స్టార్స్‌తో సచిన్ టెండూల్కర్ యాడ్ - డబ్బుల కోసం కాదు, మరి ఎందుకో తెలుసా?