Jagadhatri Serial January 27th: 'జగద్ధాత్రి' సీరియల్: కౌషికి ముందు అడ్డంగా దొరికిపోయిన ధాత్రి, కేదార్.. దివ్యాంక ప్లాన్ ఫాలో అయిన అత్త, కోడళ్ళు!
Jagadhatri Serial Today Episode: దివ్యాంక ఇచ్చిన ప్లాన్ ప్రకారం కౌషికి కాలుజారి పడిపోయేలాగా చేస్తారు అత్తా,కోడళ్ళు. ఆపై కౌషికి పరిస్థితి ఏంటి అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కౌషికి మాటలు విన్న యువరాజ్ ఇంట్లో ఆడవాళ్ళ చేతులు పరిశీలిస్తాడు. కానీ అతనికి ఎలాంటి క్లూ దొరకదు.
నిషిక : చెప్తే వినలేదు, ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అదృష్టం బాగుంది కాబట్టి ఇంట్లో ఎవరికీ ఏమీ జరగలేదు అంటుంది.
సుధాకర్ దంపతులు కూడా మినిస్టర్ తో పెట్టుకుంటే ప్రమాదం. ఆ పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంచుకోవద్దు అని చెప్తారు.
నిషిక: మీకు కావాల్సింది నిజం బయటికి రావటమే కదా ఆ పెన్ డ్రైవ్ దివ్యాంక కి ఇచ్చేస్తే తనే టెలికాస్ట్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏవో తనే పడుతుంది అంటుంది.
ధాత్రి : ఆ పెన్ డ్రైవ్ దివ్యాంక చేతిలో పెడితే తను ఏం చేస్తుందో అందరికీ తెలుసు అంటుంది.
నిషిక : దివ్యాంకని గాని నా చానల్ ని గాని ఏమైనా అన్నావంటే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తుంది.
కౌషికి: ధాత్రి అన్న దాంట్లో తప్పేముంది. దివ్యాంక ఎలాంటిదో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అయినా ఆ మినిస్టర్ ఇంతవరకు వస్తాడు అనుకోలేదు. వచ్చి తప్పు చేశాడు. వాడి బండారం బయట పెట్టకుండా ఉండను. అవసరమైతే ఇంట్లో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. అంతేగాని నిజం బయట పెట్టకుండా ఉండడం అనేది జరగదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దివ్యాంక నిషికకి ఫోన్ చేస్తుంది. కౌషికి దగ్గర నుంచి ఆ పెన్ డ్రైవ్ తీసుకున్నావా అని అడుగుతుంది.
నిషిక : లేదు ఎంత ప్రయత్నించినా ఆమె దగ్గర నుంచి తీసుకోవడం కుదరలేదు ఎలా అయినా నిజాన్ని బయట పెడతానంటుంది అంటుంది.
దివ్యాంక : అలా జరగడానికి వీల్లేదు ఆ పెన్ డ్రైవ్ మనం క్యాష్ చేసుకుంటే బోల్డంత మనీ వస్తుంది అలాగే పెద్ద వాళ్లతో పరిచయాలు కూడా పెరుగుతాయి అంటుంది.
నిషిక : మీరు చెప్పింది అంతా నిజమే కానీ ఆమె ఎవరి మాట వినటం లేదు టెలికాస్ట్ చేసి తీరుతాను అంటుంది అని చెప్తుంది.
దివ్యాంక : సరే ఆమెని ఇల్లు కదలనివ్వకుండా చేయండి కుదరకపోతే కాలు కదపకుండా ఉండేలా చేయండి ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటుంది.
నిషిక: అర్థం కాలేదు అంటుంది.
వైజయంతి: నాకు అర్థమైంది లే అమ్మి ఇక మేమిద్దరం చూసుకుంటాంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ధాత్రి దంపతులిద్దరూ మినిస్టర్ చేయబోయే అటాక్స్ గురించి మాట్లాడుకుంటూ బయటికి వస్తారు. అప్పటికే కౌషికి సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది.
ధాత్రి: సెక్యూరిటీ చీఫ్ ని చూసి ఈయనని ఎక్కడో చూశాను అంటుంది.
కేదార్: ఆయన మహేంద్ర సింగ్ మనల్ని చూశారంటే గుర్తుపడతారు అని లోపలికి వెళ్ళిపోతుంటే మహేంద్ర సింగ్ వాళ్ళని చూడనే చూస్తాడు. ధాత్రి వాళ్ళని పలకరిస్తాడు.
ఒక్కసారిగా ధాత్రి దంపతులు షాక్ అవుతారు.
ధాత్రి : అతను ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంది. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు అంటుంది.
ఆవిడ ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది కౌషికి.
మహేంద్ర సింగ్: తెలియకపోవడమేమిటి, తను నేను ఓకే బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకున్నాము అంటాడు.
ధాత్రి: నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏమిటి నేను స్కూల్ టీచర్ గా పని చేస్తున్నాను అంటూ నిజం చెప్పొద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేయడంతో అర్థం చేసుకుంటాడు మహేంద్ర సింగ్.వేరే ఆవిడ పేరు చెప్పి మీరు ఆవిడ కాదా అని అడుగుతాడు. కాదు అని చెప్పటంతో ఆ మాటలు నమ్మిన కౌషికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
యువరాజ్: ఇదంతా పైనుంచి చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు.
ఆ తర్వాత ధాత్రి దంపతులు మహేంద్ర సింగ్ దగ్గరికి వెళ్లి పలకరించి మేము సీక్రెట్ మిషన్ లో ఉన్నాము ఈ ఫ్యామిలీ మా ఫ్యామిలీ యే కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్తారు.
మహేంద్ర సింగ్ : మీ ఇల్లు అని తెలిశాక కూడా చూడకుండా ఎలా ఉంటాను మేడం జాగ్రత్తగా చూస్తాము అని చెప్తాడు.
ఇంతలో కీర్తి గోలీలతో ఆడుకుంటుంటే ఆమె దగ్గర గోళీలు తీసుకుని కీర్తిని స్నానానికి పంపిస్తుంది నిషిక. ఆ తర్వాత ఆ గోళీలు డోర్ మేట్ కింద వేస్తుంది. లోపలికి వస్తున్న కౌషికి డోర్ మేట్ మీద కాలు వేసి జారీ కింద పడిపోతుంది.
ధాత్రి ఇదంతా అత్త కోడలు చేసిన పని అని గ్రహిస్తుంది. కౌషికి కాలికి వేడినీళ్లతో కాపడం పెడుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.