Jagadhatri Serial January 10th: రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ధాత్రి, కేదార్.. కుటుంబంలో రచ్చరచ్చ!
Jagadhatri Serial Today Episode: కుటుంబ సభ్యులకు కేదార్ దంపతులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో యువరాజ్ లో అనుమానం బాగా బలపడుతుంది. నిజం తెలుసుకోవడం కోసం యువరాజ్ ఏం చేస్తాడు అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో సాక్షాలు ఏమైనా ఉన్నాయేమో అని కేదార్ గదిలో వెతుకుతూ ఉంటుంది వైజయంతి. ఆమెకి కాపలాగా నిషిక వాళ్ళు బయట ఉంటారు. కిచెన్ లో ఉన్న ధాత్రి కేదార్ కోసం పళ్ళు పాలు తీసుకొని వస్తుంది. అది గమనిస్తుంది నిషిక.
నిషిక: ధాత్రి వచ్చేస్తుంది అత్తయ్య లోపల ఉండటం చూసిందంటే కౌషికి వదినకి చెప్పేస్తుంది అని కంగారు పడుతుంది.
బూచి: పాపం అత్తయ్య సాక్షాధారాలు దొరుకుతాయని లోపలికి వెళ్ళింది ఇప్పుడు ధాత్రి వచ్చి దొంగతనం నేరం మోపినా మోపేస్తుంది అంటాడు.
మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ధాత్రికి అడ్డంగా వెళుతుంది.
నిషిక: నిన్ను చూస్తే జాలేస్తుంది, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా నీకు చాకిరి తప్పడం లేదు. మీ ఆయనని నోరు మూసుకొని ఉండమనొచ్చు కదా లేకపోతే మళ్లీ ఇలాగే మంచానపడతాడు నీకు మళ్ళీ చాకిరి తప్పదు అని వెటకారంగా మాట్లాడుతుంది.
ఆమెకి సమాధానం చెప్పి ముందుకు వెళుతుంది ధాత్రి. ఆమెకి కాచి అడ్డుగా వస్తుంది.
కాచి: దెబ్బలతో మంచాన ఉన్న వ్యక్తికి బలం రావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి వెళ్లి తీసుకొని రా అని చెప్తుంది.
ధాత్రి : ముందు పాలు తాగి పళ్ళు తిననివ్వండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకు వస్తాను అని చెప్పి ముందుకు వెళుతుంది. ఆపై బూచి కూడా ఎదురొచ్చి ధాత్రి గదిలోకి వెళ్లకుండా ఉండేలా ఏదో ఒకటి మాట్లాడుతాడు.
ఈ లోపు వైజయంతి గదిలో వెతుకుతుండగా ఆమెకి గన్ దొరుకుతుంది. ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది వైజయంతి. అదే సమయంలో ధాత్రి గదిలోకి వస్తుంది. వైజయంతి చేతిలో గన్ చూసి ధాత్రి కూడా షాక్ అవుతుంది.
వైజయంతి: ఈ గన్ మీ దగ్గర ఎందుకు ఉంది? ఈ విషయం ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి గన్ తీసుకొని కిందికి వెళుతుంది. ఇంట్లో అందరినీ పిలిచి అందరికీ కనిపించేలాగా టేబుల్ మీద గన్ పెడుతుంది. ఇది ధాత్రి వాళ్ళ రూమ్ లో దొరికింది ఎందుకు ఉందో అడగండి అంటుంది.
గన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ భయపడతారు, వీళ్లేనా పోలీసులు అని యువరాజ్ అనుమాన పడతాడు.
నిషిక: మీ దగ్గర గన్ ఎందుకు ఉంది అసలు మీరు ఏం చేస్తున్నారు నిజం చెప్పండి మీరు పోలీసులు కదా అని నిలదీస్తుంది.
కౌశికి : ఇంట్లో ఉండనిచ్చాను అని గన్ పెట్టుకొని ఇంట్లో తిరుగుతాం అంటే మిమ్మల్ని ఇంట్లో ఉంచేది లేదు అని కోప్పడుతుంది.
యువరాజ్: ఇది పోలీసులు వాడే గన్నే. వాళ్లు ఇంట్లో ఉండి డ్యూటీ చేస్తున్నారు అంటాడు.
ధాత్రి: అంత కచ్చితంగా నీకు ఎలా తెలుసు నువ్వు ఎప్పుడైనా వాడవా లేకపోతే నీ మీద ఎవరైనా వాడరా అని అడుగుతుంది.
నిషిక: అటు తిరిగి ఇటు తిరిగి నా మొగుడి మీద పడతావేంటి నువ్వు కూడా మీ అమ్మలాగే పోలీసా నిజం చెప్పు ఇప్పుడే అమ్మ వాళ్లకి ఫోన్ చేసి చెప్తాను అంటుంది.
ధాత్రి: నిషికని ఆగమని చెప్పి ఆ గన్ మేము ఆత్మరక్షణ కోసమే తెచ్చుకున్నాము అంటుంది.
నిషిక: మీరేమైనా విఐపిలా అడగ్గానే గన్ ఇచ్చేయటానికి అంటుంది.
ధాత్రి: కేధర్ కి తెలిసిన పోలీసు ఉన్నారు కదా ఆయనే మా పరిస్థితిని డీజీపీ గారికి చెప్పి స్పెషల్ పర్మిషన్ తో గన్ ఇప్పించారు అంటుంది.
కౌషికి : తొందరపడ్డావు పిన్ని గన్ దొరకగానే వాళ్ళిద్దర్నీ అడిగి ఉంటే బాగుండేది అందరి మధ్యలో పడకుండా ఉండాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నేను తొందర పడ్డానా అని కోపంతో రగిలిపోతుంది వైజయంతి.
మరోవైపు కేదార్ దంపతులిద్దరూ మంచి ఉపాయంతో బయటపడ్డాం లేదంటే దొరికిపోయే వాళ్ళం అని ఆనందపడుతూ ఉంటారు అంతలో యువరాజ్ రావడం చూసి భార్యాభర్తల్లాగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు.
యువరాజ్: అసలు వీళ్ళిద్దరూ పోలీసులేనా, కాదా అని అనుకుంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Trinayani Serial Today January 10th: నయని, హాసిని ప్రాణాలు తీసేస్తున్న తల్లీకొడుకులు!