అన్వేషించండి

Gruhalakshmi Serial Today January 10Th: దివ్యను సేవ్ చేసిన తులసి – లాస్య వార్నింగ్ తో షాక్ అయిన తులసి

Gruhalakshmi Today Episode: స్టోర్ రూంలో ఉన్న దివ్యను తులసి సేవ్ చేసి రాజ్యలక్ష్మీకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది.

Gruhalakshmi Serial Today Episode: దివ్యను స్టోర్‌ రూంలో వేసిన తర్వాత రాజ్యలక్ష్మీ, బసవయ్యకు జాగ్రత్తలు చెబుతుంది. స్టోర్‌ రూం వైపు ఎవ్వరూ వెళ్లకుండా చూడాలని చెప్తుంది. దీంతో బయట గట్టిగ గొళ్లెం పెట్టామని ప్రసూనాంబ చెబుతుంది. అయినా స్టోర్ రూం దగ్గరకు వెళ్లి గొళ్లెం తీసే ధైర్యం ఎవరికుంది అంటాడు బసవయ్య దీంతో ధైర్యం లేకపోయినా మీ బావగారికి దివ్య మీద జాలి ఉంది కదా అంటుంది రాజ్యలక్ష్మీ. ఇంతలోనే కోపంగా తులసి వస్తుంది. తులసిని చూసిన బసవయ్య, రాజ్యలక్ష్మీ, ప్రసూనాంబ, సంజయ్‌ షాక్‌ అవుతారు. లోపలకి వచ్చిన తులసిని ఏమీ తెలియనట్లు చాలా కూల్‌గా చెప్పకుండా వచ్చావేంటి వదినా అంటూ పలకరిస్తుంది రాజ్యలక్ష్మీ. కోపంగా తులసి ఆపు అంటూ అరుస్తూ..

తులసి: నా కూతురు ఎక్కడ అని అడుగుతున్నాను.

రాజ్యలక్ష్మీ: విషయం తెలిసే వచ్చావా? తెలియకుండా వచ్చావా?

తులసి: నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. నా కూతురు ఎక్కడుందో చెప్తావా? లేదా?

  అని తులసి కోపంగా అడుగుతుండగానే లోపల నుంచి విక్రమ్‌ వాళ్ల నాన్న వచ్చి పైన లెఫ్ట్‌ సైడ్‌లో స్టోర్‌ రూం ఉంటుందని చెప్తాడు. తులసి చాలా స్పీడుగా స్టోర్‌ రూం వైపు వెళ్తుంటే.. రాజ్యలక్ష్మీ ఆపి మాట్లాడుకుందామని చెబుతుంటే కోపంగా రాజ్యలక్ష్మీని తోసేసి స్టోర్‌ రూం దగ్గరకు వెళ్లి లాక్ విరగ్గొట్టి  దివ్యను తీసుకుని కిందకు వస్తుంది. దివ్య తాను ఈ ఇంట్లో ఉండనని ఏడుస్తుంది. దీంతో బసవయ్య కోపంగా తులసి వచ్చి మన ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంటి అంటాడు. దీంతో అందరూ తులసిని తిడతారు.

తులసి: ఎవరు నాకూతురును పిచ్చిది అన్నది సమాధానం చెప్పండి.

అంటూ అడుగుతుండగానే విక్రమ్‌ వస్తాడు.

తులసి: రండి అల్లుడుగారు మీతో కూడా చాలా మాట్లాడాలి.

విక్రమ్‌: ఏం జరిగింది అత్తయ్య

తులసి: మీ ఇంట్లో ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాలా? మీరు నాకు చెప్పాలా?

అంటూ తులసి కోపంగా అడగ్గానే విక్రమ్‌ వాళ్ల అమ్మను ఏమైందని అడగ్గానే రాజ్యలక్ష్మీ జరిగిన విషయం చెబుతుంది. ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్స్‌ వేసుకోబోతుంటే నేనే ఆపి నువ్వు వచ్చే వరకు స్టోర్‌ రూంలో ఉంచాము. ఇంతలో మీ అత్తయ్య వచ్చి ఇలా రాదాంతం చేస్తుంది.

తులసి: రాదాంతం చేయడం ఏంటి? కన్నకూతురును రూంలో వేసి బంధింస్తే ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. మీరు కూడా నా కూతురుకు పిచ్చి అనుకుంటున్నారా? చెప్పండి అల్లుడు గారు. ఇంతసేపు అలోచిస్తున్నారు..

రాజ్యలక్ష్మీ: విక్రమ్‌ను ఎందుకు నిందిస్తున్నారు. దివ్య అంటే మీకే కాదు తను ఉన్న పరిస్థితికి మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం.

తులసి: ఏం చేస్తాం అంటే గదిలో వేసి తాళం వేయటమా మీరు చేసే పని. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమను అందించాలి. ధ్వేషాన్ని, నిర్లక్ష్యాన్ని కాదు. అయినా దివ్య బ్రమ పడుతోందని మీరు గుడ్డిగా నమ్మేస్తారా?

ప్రసూనాంబ: గుడ్డిగా నమ్మడమేంటండి అన్ని లక్షణాలు పరీక్షించాకే నమ్మాం.

  అంటూ అందరూ కలిసి ఇన్ని రోజులు దివ్య చేసిన యాక్సిడెంట్‌ నుంచి అన్ని విషయాలు చెప్తారు. అందుకే దివ్య బ్రమపడుతుందని అనుకున్నాం. పిచ్చి పట్టిందని కన్‌ఫం చేసుకున్నాం అని చెప్పగానే..తులసి కోపంగా బ్రమ అనుకోవడం కాదు నిజం అని నిరూపిస్తాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. మీరే బ్రమ పడుతున్నారని ప్రూవ్‌ చేస్తాను అంటూ చాలెంజ్‌ చేయడంతో అందరూ షాక్‌ అవుతారు. దివ్యకు జాగ్రత్తలు చెప్పి, ఎప్పుడు నీకు ఇక్కడ ప్రాబ్లమ్‌ అనిపించినా నాకు కాల్‌ చేయ్‌ అని తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  మరోవైపు ఇంట్లోకి వస్తున్న తులసిని లాస్య ఆపి ఎగతాళి చేస్తుంది. ఇక నీ పని అయిపోయిందని వార్నింగ్‌ ఇస్తుంది. ఇక్కడ నీకు పట్టిన గతే అక్కడ నీ కూతురుకు పడుతుందని చెప్తుంది. దీంతో కోపంగా పక్కనే ఉన్న కత్తి తీసుకొచ్చి లాస్య పీకమీద పెడుతుంది తులసి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

Also Read: Trinayani Serial Promo Today నయనిని చంపాలి అని తిలోత్తమ జ్యూస్‌లో విషం కలపగా ఆ జ్యూస్‌ని హాసిని, నయని తాగేయడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget