Trinayani Serial Today January 10th: నయని, హాసిని ప్రాణాలు తీసేస్తున్న తల్లీకొడుకులు!
Trinayani Serial Today Episode:నయని ఇంట్లో అందరూ న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేస్తుంటారు. తిలోత్తమ అందరికీ ఫొటోలు తీస్తుంది. తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు.

Trinayani Today Episode : నయని ఇంట్లో అందరూ న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేస్తుంటారు. తిలోత్తమ అందరికీ ఫొటోలు తీస్తుంది. తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఇక అందరూ మందు తాగుతారు. డ్యాన్స్‌లు వేస్తారు. తిలోత్తమ ఫొటోలు తీస్తా అని నయని తాగే జ్యూస్‌లో విషం కలిపేశాను అని వల్లభతో చెప్తుంది. అది విన్న వల్లభ నువ్ సూపర్ అమ్మ అంటాడు. దీంతో ఏమైందని అందరూ అడిగితే అమ్మ డ్యాన్స్ చేస్తా అన్నదని కవర్ చేస్తాడు. దీంతో తిలోత్తమ డ్యాన్స్ చేస్తుంది. సూపర్ అంటూ అందరూ తిలోత్తమని మెచ్చుకుంటారు. ఇక హాసిని అయితే మా అత్తయ్యే అలా చేస్తే పెద్ద కోడల్ని నేను ఇంకా ఎలా చేయాలి అని తన భర్తని తీసుకొని వెళ్లి హాసిని కూడా డ్యాన్స్ వేస్తుంది.
వల్లభ: మమ్మీ పెద్ద మరదలు జ్యూస్ తాగడం లేదు ఏంటి.. డౌట్ వచ్చింది అంటావా..
తిలోత్తమ: రేయ్ ఎవరికీ ఆపద వచ్చినా పసిగట్టగలదు కానీ నయని తనకు మాత్రం ఏ ప్రమాదం వచ్చినా కనిపెట్టలేదురా. అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సరదాగా చూస్తుందే తప్ప జూస్ తాగాలి అనే ధ్యాస లేదు.
వల్లభ: మరి తాగమని చెప్పనా..
తిలోత్తమ: వెళ్లి తాగించరా పోయి.
వల్లభ: మరి విశాల్ ఊరుకోడు ఏమో..
తిలోత్తమ: ఇడియట్.. పట్టుకొని తంతారు నిన్ను. కచ్చితంగా తాగుతుంది అంత వరకు ఓపిక పట్టాలి.
హాసిని: చెప్పండి మా అత్తని డామినేట్ చేయలేదా..
ధురందర: సూపర్.. చేశావ్ లేవే నువ్వు సైలెంట్‌గా ఉండు.
విశాల్: ఇప్పుడు విక్రాంత్, సుమన వెళ్లండి..
సుమన: బుల్లి బావగారు డ్యాన్స్ వేసేటప్పుడు అయినా చేయి పట్టుకోండి.
విక్రాంత్: రొమాంటిక్ సాంగ్ ఏం కాదులే.. ఇక సుమన, విక్రాంత్‌లు డ్యాన్స్ వేస్తారు.
తిలోత్తమ: హాసిని నువ్వు తాగడమేనా నయనికి జ్యూస్ ఏమైనా ఇచ్చేది ఉందా లేదా..
హాసిని: స్టీల్ గ్లాస్‌లో బాబాయ్ పోసి పెట్టారు కదా అత్తయ్య. చెల్లి తాగు.
విశాల్: నయనికి ఎక్కిళ్లు రావడంతో.. ఎవరో తలచుకుంటున్నారు అనుకుంటా..
నయని: ఇంకెవరూ గాయత్రీ అమ్మగారే.. పసి బిడ్డలా నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు సంబరం చేసుకుంటున్నావా అనుకుంటుంటారు.
తిలోత్తమ: నయని జ్యూస్ తాగుతుంది అనేలోపు ఎక్కిళ్లు వచ్చి జ్యూస్ తాగింది రా..
వల్లభ: త్వరగా జ్యూస్ తాగితే బాగున్ను అమ్మ. తర్వాత నయని, విశాల్‌లు డ్యాన్స్ వేస్తారు. ఫెర్మామెన్స్ తర్వాత నయని జ్యూస్ తాగుతుంది. ఇక ఎంత సేపు తాగుతావు అని హాసిని కూడా ఆ జ్యూస్ తీసుకొని తాగేస్తుంది.
ధురందర: ఏయ్ హాసిని నయని నోరు పెట్టి తాగిందే నువ్వు తాగేశావ్.
హాసిని: మా అత్త తాగినది తాగితే ప్రాణం పోవచ్చు కానీ చెల్లి తాగిన తర్వాత తాగితే ఏం కాదు.
పావనా: ఓ తల్లి కడుపున పుట్టకపోయినా మీరిద్దరూ ఒకరు అంటే ఒకరు ప్రాణంగా బతుకుతారు అమ్మా.
వల్లభ: చస్తారు మామయ్య.
తిలోత్తమ: అదే ఒకరు అంటే ఒకరికి పడి చచ్చేంత అభిమానం ఉందని చెప్తున్నాడు వల్లభ.
ఇక ఇంట్లో వాళ్లు అందరూ మామా ఎక్ పెగ్‌లా అంటూ డ్యాన్స్ వేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేక్ కట్ చేసి సరదాగా గడుపుతారు. ఇంతలో నయని కడుపు నొప్పి అని నయని గట్టిగా అరుస్తుంది. అందరూ కంగారు పడతారు. ఇక కొద్ది సేపటికి హాసిని కూడా కడుపు నొప్పి అని గట్టిగా ఏడుస్తుంది. ఇద్దరూ జ్యూస్ తాగడం వల్లే ఇలా అయింది అంటే జ్యూస్‌లో ఏమైనా తేడా ఉంది అని విక్రాంత్ అడుగుతాడు. ఇక తిలోత్తమ టెన్షన్ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Trinayani Serial Promo Today January 10th: విషం కలిపిన జ్యూస్ తాగి విలవిల్లాడిపోయిన నయని, హాసిని!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

