Jagadhatri Serial Today September 22nd: జగద్ధాత్రి సీరియల్: విక్కీని మీనన్ దగ్గర దాచేసిన తాయారు! జేడీ, కేడీలు విక్కీని ఎన్‌కౌంటర్ చేస్తారా?
Jagadhatri Serial Today Episode September 22nd విక్కీని జేడీ అరెస్ట్ చేయడానికి వెళ్లడం విక్కీని దుండగులు తీసుకెళ్లిపోయారని తాయరు చెప్పి కొడుకుని కాపాడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode విక్కీని నడిరోడ్డు మీద కాల్చి చంపేస్తా అని జేడీ సంధ్యకి మాటిస్తుంది. వాడి చావు ఇలాంటి అఘాయిత్యాలు చేయాలి అనుకునే వాడికి భయం పుట్టించాలి అని చెప్తూ సంధ్య చనిపోతుంది. అందరూ ఎమోషనల్ అయిపోతారు.
కేథార్ కోపంతో రగిలిపోతూ ఆ నా కొడుకుకి అరెస్ట్ వారెంటీ తీసుకో జేడీ వాడికి చావు అంటే ఏంటో నేను చూపిస్తా అని అంటాడు. సీన్ కట్ చేస్తే సాధుసార్ తాయారు ఇంట్లో ఉంటారు. జేడీ, కేడీలు చాలా ఆవేశంగా తాయారు ఇంటికి విక్కీ అరెస్ట్ వారెంటీతో వెళ్తారు. ఏంటి నేను పిలవకుండా వచ్చారు అంటే మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్‌తో వచ్చాం అని జేడీ అంటుంది. రేయ్ విక్కీ అని కేడీ అరుస్తాడు. ఏయ్ అరవకు ముందు అంత తప్పు నా కొడుకు ఏం చేశాడో చెప్పండి అని తాయారు అంటుంది. మనిషి జన్మ ఎత్తానని కూడా మర్చిపోయి మృగం కంటే ఘోరంగా ప్రవర్తించాడు. నిన్న మాధురితో పాటు మా టీమ్ మెంబర్ సంధ్యని కూడా కిడ్నాప్ చేసి తన మీద అత్యాచారం చేసి.. దారుణంగా హింసించి నరక యాతన చూపించాడు. మాధురిని కూడా అలాగే చేయబోయాడు. మమల్ని చూసి పారిపోయాడు. ఇదే మేం మీ రక్తం చేసింది. అసలు దాన్ని తలుచుకుంటే మా రక్తం మరిగిపోతుంది. కానీ కేవలం అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్ట్ మాత్రమే చేస్తాం అని జేడీ అంటుంది.
తాయారు ధీమాగా.. విన్నారా సాధుసార్ నా కొడుకు తప్పు చేశాడంటా.. అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటుంది. మీ అబ్బాయి ఎక్కడ మేడం అని కేడీ అంటే అదే నేను అడుగుతున్నా మా అబ్బాయి ఎక్కడ? వాడు నిన్నటి నుంచి కనిపించడంలేదు అని జేడీ, కేడీలతో చెప్తుంది. నిన్న గెస్ట్‌హౌస్‌లో దుండగులు మా అబ్బాయిని ఎత్తుకుపోయారు. ఆ విషయమే సాధుసార్‌కి చెప్తున్నా.. కంప్లైంట్ కూడా ఇచ్చా.. మీరేమో అసలు అక్కడ లేని నా కొడుకు మీద నింద వేస్తున్నారు. నా కొడుకు అలాంటి వాడు కాదు.. వాడి బుద్ధే అది కాదు.. అదంతా దుండగులు చేసుంటారు.. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అవి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అని తాయారు అంటుంది. నా కొడుకు మీద నిందలు వేయకండి ఆ దుండగుల్ని పట్టుకోండి.. ఆ అమ్మాయిని పాడు చేసిన దుండగులన్ని ఎన్‌కౌంటర్ చేయండి అని మొసలి కన్నీరు కాల్చుతుంది.
తాయారు యాక్టింగ్ తాయరు విక్కీని తప్పించడం మొత్తం జేడీ, కేడీలకు బాగా అర్థమవుతుంది. కేడీ కోపంగా కథ బాగా అల్లారు మేడం.. ఓ మహిళా పోలీసుని అతి కిరాతకంగా చంపిన నీ కొడుకుని భలే కాపాడాలి అనుకుంటున్నారు.. అలాంటి కషాయి వాడిని కాపాడి అనుకుంటున్నారు అని కేడీ అంటే తాయరు కేడీ కాలర్ పట్టుకొని నన్ను అంత మాట అంటావా అని అంటుంది. షర్ట్ వదలండీ అని జేడీ అరుస్తుంది. సాధు సార్ తాయారుతో కోపంలో అలా అన్నారు అని అంటాడు. కేడీ, జేడీ మీరు అనుకున్నది నిజం కాదు ఆ దృష్టిని మీ మైండ్ నుంచి తీసేయండి.. మేడం గారి అబ్బాయి కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి విక్కీని ఎక్కడున్నా తీసుకురండి.. ఆ నేరం చేసిన ఆ దుండగున్ని ఏరిపారేయండి.. అర్థమైందిగా.. ఆ దుండగుల్ని ఎన్‌కౌంటర్ చేసి పారేయండి అని అంటారు.
సాధుసార్ ఇన్‌డైరెక్ట్‌గా విక్కీని ఎన్‌కౌంటర్ చేయమని చెప్తారు. జేడీ, కేడీలకు ఆ విషయం అర్థమై ఒకే సార్ ఇక మా లక్ష్యం విక్కీ బాబుని కాపాడటమే అని అంటారు. విక్కీని త్వరగా విడిపించండి అని తాయరు అంటుంది. జేడీ మేం విక్కీ బాబుని కనిపెట్టేలోపు ఆ దుండగులు విక్కీ బాబుని చంపేస్తే అని జేడీ అంటుంది. వాళ్ల అసలే దుండగలు ఏమైనా చేయొచ్చు అని జేడీ అంటుంది. తాయారుకి బెంగ పట్టేస్తుంది. సాధుసార్ జేడీ, కేడీలతో బయట మాట్లాడుతాడు. సొసైటీలో కలుపు మొక్కని మనం పీకి పారేయాలి.. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా.. మొక్కని పీకి పారేయండి అని ఇన్‌డైరెక్ట్‌గా విక్కీని చంపేయమని చెప్తారు. తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను అని అంటాడు.
జేడీ, కేడీలు విక్కీని చంపేసి ఆ నింద దుండగుల మీద వేస్తారని భయంతో మీనన్‌కి కాల్ చేసి విక్కీ జాగ్రత్తగా ఉన్నాడా అని అడుగుతుంది. జేడీ, కేడీలకు అంత సీన్ లేదు.. నా ప్రాణం అడ్డు పెట్టి విక్కీని కాపాడుకుంటానని మీనన్ చెప్తాడు. వీక్కీ కూడా తల్లికి టెన్షన్ పడొద్దని చెప్తాడు. మీనన్ తన మనుషులతో జాగ్రత్తగా ఉండండి.. పోలీసులు వస్తే చంపేయండి అని అంటాడు. విక్కీ నువ్వు ఇక్కడ ఉన్నావ్ అని జేడీకి తెలీదు.. నీ చేతికి బేడీలు వేయలేదు అని అంటాడు. జేడీ రమ్యకి కాల్ చేసి తాయారు నెంబరు ట్రాప్ చేయమని అంటుంది. తాయారు మీనన్‌తో మాట్లాడిందని రమ్య చెప్పగానే.. జేడీ కేడీతో విక్కీని మినిస్టర్ మీనన్ దగ్గర దాచిందని బెయిల్ వచ్చే వరకు అక్కడే ఉంచుతుందని కేడీతో అంటుంది. మీనన్ ఉన్న ఏరియా ట్రేస్ చేసి అక్కడ పవర్ కట్ చేయించమని జేడీ రమ్యతో చెప్తుంది. నిన్ను వదలనురా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















