Nindu Manasulu Serial Today September 22nd: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల కేసులో ట్విస్ట్! విశ్వనాథ్ సాక్ష్యం చెల్లుతుందా? కోర్టులో ఏం జరిగిందంటే!
Nindu Manasulu Serial Today Episode September 22nd విశ్వనాథ్ కోర్టులో ప్రేరణ, సిద్ధూలకు సపోర్ట్‌గా సాక్ష్యం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణల కేసు కోర్టుకి వెళ్తుంది. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ చైనులు దొంగతనం చేస్తున్నారని లాయర్ చెప్తారు. ఇదంతా కావాలనే మా మీద చేస్తున్న కుట్ర అని సిద్ధూ, ప్రేరణలు అంటారు. దానికి సాక్ష్యం ఉందా.. కానీ మీరు పెద్దావిడ దగ్గర దొంగతనం చేశారు. ఆ పెద్దావిడ చనిపోయింది అని జడ్జి గారి ముందు సాక్ష్యాలు ఇస్తారు.
ప్రేరణ, సిద్ధూ దొంగతనం చేసినట్లు ఉన్న వీడియో అందరి ముందు ప్లే చేస్తారు. కోర్టులో అందరూ ప్రేరణ, సిద్ధూలే అని నమ్మేస్తారు. అయితే సిద్ధూ వాళ్ల తరఫు లాయర్ అదంతా పథకం ప్రకారమే చేశారని ఆ టైంలో సిద్ధూ, ప్రేరణలు రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో కోచింగ్ తీసుకుంటున్నారని చెప్తారు. సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి అడిగితే సాక్ష్యాలు లేవు కానీ మనసు పెట్టి ఆలోచించండి.. నా క్లైంట్స్ ఎప్పుడూ అదే ఏరియాలో కోచింగ్‌కి వస్తుంటారు. అయితే ఒక చోట సీసీ కెమెరా పని చేసి మరో చోట పని చేయకపోవడానికి కారణమేంటి సార్ అని అంటారు.
సిద్ధూ, ప్రేరణలు ఆ టైంలో విశ్వనాథ్ గారి ఇంట్లో ఉన్నారు అనడానికి విశ్వనాథ్‌గారే సాక్ష్యం అనడంతో నేనే సాక్ష్యం అని విశ్వనాథ్ వస్తారు. సిద్ధూ, ప్రేరణలు 10 గంటలకు మా ఇంటికి వచ్చారు. నిన్న వాళ్లకి పరీక్ష పెట్టాను 10 నుంచి 11 వరకు మా ఇంట్లోనే పరీక్ష రాశారని అంటాడు. ఇక తన కోచింగ్ గురించి చెప్పి పట్టుదలతో ఈ ఇద్దరూ సెలక్ట్ అయ్యారని విశ్వనాథ్ తన రూల్ బ్రేక్ చేసుకొని ఇద్దరికీ సీట్ ఇచ్చానని.. సమాజానికి ఏదో మంచి చేయాలనే సంకల్పంతో ఉన్నారని సిద్ధూ వాళ్ల గురించి చెప్తారు. ఇంత కంటే సాక్ష్యం కావాలా మీరే పెద్ద మనషుతో ఆలోచించండి అని లాయర్ అంటారు.
గణ తరఫు లాయర్ విశ్వనాథ్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్లు పరీక్ష రాసినంత సేపు మీరు అక్కడే ఉన్నారా అని అడిగితే లేదని బయటకు వెళ్లానని విశ్వనాథ్ చెప్తారు. సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు కాదు అలాంటిది మీరు వాళ్లని వదిలేసి వెళ్లారు అంటే అర్థమేంటి అని లాయర్ అడిగితే ఇద్దరూ నిజాయితీగా ఉంటారు వాళ్ల మీద నాకు నమ్మకం ఉందని విశ్వనాథ్ చెప్తారు. విశ్వనాథ్ చెప్పేదంతా అబద్ధం అని లాయర్ అంటాడు. వాళ్లు నిజంగా నిజాయితీ పరులు అయితే మీరు వచ్చే వరకు అక్కడే ఉండాలి కదా.. బయటకు వెళ్లి ఈ దారుణం చేస్తారా అని ప్రశ్నిస్తారు. వాళ్లు అలా చేయరు అని విశ్వనాథ్ అంటాడు. విశ్వనాథ్ గారి సాక్ష్యం చెల్లదు అని లాయర్ అంటే సిద్ధూ వాళ్ల లాయర్ జడ్జితో సాక్ష్యం చెప్పింది దారిన పోయే దానయ్య కాదు సార్ ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన సాక్ష్యం కూడా చెల్లదు అంటే ఎలా అని అడుగుతాడు. నిరూపించుకోవడానికి కాస్త టైంతో పాటు బెయిల్ ఇవ్వమని కోరుతాడు. గణ వాళ్ల లాయర్ వద్దని అంటాడు. జడ్జి గంట బ్రేక్ ఇస్తారు.
అందరూ బయటకు వెళ్తారు. ఇందిర చాలా ఏడుస్తుంది. ప్రేరణ దగ్గరకు వెళ్తాను అంటే సుధాకర్ ఆపుతాడు. లాయర్ రాగానే ఇందిర ఇదేంటిసార్ అని అడుగుతుంది. నా ఆశ అంతా విశ్వనాథ్ గారి సాక్ష్యం మీదే ఉన్న ఒక్క సాక్ష్యం ఉన్నా ఏదో ఒకటి చేసేవాడిని అయినా నా శాయశక్తులా ప్రయత్నిస్తా అని అంటారు. గణ ప్రేరణ వాళ్ల దగ్గరకు వెళ్లి ఈ గంట చల్లగాలి పీల్చుకోవాలి అనుకుంటున్నారా. జైలులో ఎలాగూ ఉండదు. మిమల్ని చూస్తుంటే జాలేస్తుంది. మీ నిజాయితే మిమల్ని కాపాడుతుందని నేను అనుకున్నా కానీ పాపం గంటలో మీకు శిక్ష పడుతుంది పాపం అంటాడు. సిద్ధూ కోపంగా ఏదో సాధించేశాను అనుకోకు అబద్ధానికి తొందర ఎక్కువ నిజాయితీకి ధైర్యం ఎక్కువ అని అంటాడు. గణ సిద్ధూ వాళ్లతో మీరు నిజాయితీకి మారు పేరు కాబట్టి తప్పు చేశాం అని ఒప్పుకోండి శిక్ష తక్కువ పడుతుంది. త్వరగా బయటకు వచ్చేయొచ్చు.. లేదంటే మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















