చై - సామ్ 'మజిలీ' నుంచి 'ఆయ్' వరకు... హీరో అవ్వక ముందు అంకిత్ కొయ్య చేసిన సినిమాలు తెల్సా?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంకిత్ కెరీర్ స్టార్ట్ చేశాడు. 'బ్యూటీ'తో ప్రోపర్ హీరో అయ్యాడు. మరి ముందు? అతడి సినిమాలు తెలుసుకోండి

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' మూవీలో మస్తాన్ రోల్ చేశాడు అంకిత్. అతడి సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అది.

'మజిలీ' తర్వాత 'అల' చేశాడు గానీ అది ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత నాగశౌర్య 'అశ్వత్థామ'లో నటించాడు.

యాంథాలజీ ఫిలిం 'జోహార్' చేశాడు. అందులో 'దృశ్యం' ఫేమ్ ఎస్తర్ అనిల్ జోడీగా నటించాడు.

సత్యదేవ్ 'తిమ్మరుసు'లో రోల్ అంకిత్ కొయ్యకు మంచి పేరు తెచ్చింది. 'ఊరికి ఉత్తరాన' సినిమాలోనూ నటించాడు.

నాని 'శ్యామ్ సింగ రాయ్', కాజల్ అగర్వాల్ 'సత్యభామ', 'అల్లరి' నరేష్ 'బచ్చలమల్లి' సినిమాల్లోనూ కీలక పాత్రలు చేశాడు.

'ఆయ్' సినిమాలో హీరో స్నేహితుడిగా ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ రోల్ చేశాడు. తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించాడు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ కొడుకుగా నటించాడు. ఆ మూవీకి హీరో అని చెప్పాలి.

కరోనా నేపథ్యంలో తెరకెక్కిన కాన్సెప్ట్ బేస్డ్ మూవీ '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' అంకిత్ హీరో.

'నాగబంధం', 'గరివిడి లక్ష్మి'తో పాటు అంకిత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు కొన్ని విడుదల కావాల్సి ఉంది.