Chinni Serial Today September 22th: చిన్ని సీరియల్: మధుని కిడ్నాప్ చేసిందెవరు? దేవాకి మించిన శత్రువులు చిన్నికి ఉన్నారా! మిస్సింగ్ వెనక మిస్టరీ ఏంటి?
Chinni Serial Today Episode September 22th బాలరాజు కోసం చిన్ని రావడం చిన్నిని దేవా మనుషులు కాకుండా ఇంకెవరో కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని గురించి తెలుసుకోవాలని నాగవల్లి, దేవా కలిసి బాలరాజు దశదినకర్మ చేయిస్తున్నట్లు పేపర్‌లో యాడ్ ఇస్తారు. చందు వాళ్లు యాడ్ చూసి లొకేషన్‌కి బయల్దేరుతారు. మహి చిన్నిని వెతకడానికి వెళ్తాడు. మధుమిత బయట ముగ్గు పెడుతుంది. మధు తప్ప మిగతా ముగ్గురు గుడికి వెళ్తారు. అందుకు కోసం ఆటో వస్తుంది. ఆటో డ్రైవర్ పేపర్ చూస్తుంటాడు. ఆ పేపర్ కింద పడిపోవడంతో అందులో బాలరాజు దశదినకర్మ అనే యాడ్ మధు చూస్తుంది.
మధు ఆ యాడ్ చూసి షాక్ అయి నాన్న నాన్న అని ఏడుస్తుంది. వెంటనే అడ్రస్‌కి బయల్దేరుతుంది. మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో స్కూటీ పక్కన పెట్టేసి ఆటోలో బయల్దేరుతుంది. మరోవైపు చందు, సరళ లొకేషన్‌కి వస్తారు. రౌడీలు చూసి చందు వాళ్లతో మీరు ఆయనకు ఏం అవుతారు అని అడుగుతాడు. ఆయన మామయ్య మా మేనత్త కావేరికి భర్త అని చెప్తాడు. బాలరాజు తమతో పాటు జైలులో ఉండేవాడని చనిపోవడంతో ఇదంతా చేస్తున్నాం అని రౌడీ చందుతో చెప్తాడు.
మరోరౌడీ వెంటనే నాగవల్లికి కాల్ చేస్తాడు. ఎవరో సరళ, చందు అంట సార్ వాళ్ల బంధువులు అని చెప్పి వచ్చారు వీడియో పంపిస్తామని అంటాడు. సరళవాళ్ల ఇంకా చనిపోలేదా. వాళ్ల వచ్చారు అంటే ఆ చిన్ని కూడా వస్తుంది. మీరు వాళ్లని ఫాలో అవ్వండి..అక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరి గురించి నాకు తెలియాలి అని చెప్తాడు. వల్లి దేవాతో సరళ వచ్చింది అంటే దానితో వచ్చిన వాడు వాడి కొడుకే అయ్యింటాడు అంటుంది. చందు మామయ్య ఫొటోకి పువ్వులు వేసి నివాళులు అర్పిస్తాడు.
సరళ రౌడీలతో మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఆయన కోసం ఎవరూ రాలేదా.. అని అడుగుతుంది. లేదని రౌడీలు చెప్పడంతో మరి ఆస్తిపాస్తుల సంగతి ఏంటి నగనట్రా ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. లేదని రౌడీలు అనడంతో దారి ఖర్చులు కూడా దండగే అని అనుకుంటుంది. వెళ్లిపోదాం అని కొడుకుతో చెప్తే చందు ఆగమని చిన్ని వస్తుందని మనసు చెప్తుందని అంటాడు. నువ్వు మీ నాన్నలాగే చిన్ని అని అంటావా దాని వల్లే మన బతుకులు ఇలా తగలడ్డాయని అంటుంది.
లోహిత రెస్టారెంట్‌కి వెళ్లి ఫోన్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇంతలో మ్యాడీ అక్కడికి రావడం చూస్తుంది. మ్యాడీని చూసి దాక్కుంటుంది. మ్యాడీ రెస్టారెంట్‌లో స్కెచ్ వేసిన వాడి గురించి అడగటం చూస్తుంది. ఎందుకు సార అని అతను అడిగితే అతను నా స్కెచ్ వేశారు.. చిన్నప్పటి ఫొటో కూడా వేశారు. అతను తెలిస్తే నాకు కావాల్సిన అమ్మాయి ఫొటో వేస్తాడని అంటాడు. దాంతో ఆయన మా దగ్గర పని చేసే ఒకతను ఇక్కడే ఉన్నాడు అని చెప్తారు. అతన్ని మ్యాడీ తీసుకెళ్తాడు. లోహిత మరొకరికి అతని అడ్రస్ అడిగి వెంటనే తన రౌడీలకు ఫోన్ చేస్తుంది. అడ్రస్ చెప్పి స్కెచ్ గీసే వాడు అక్కడ ఉండకూడదు అని అంటుంది.
మధు అందర్నిఅడుగుతూ బాలరాజు కర్మ ఏర్పాటు చేసిన చోటుకి వస్తుంది. తండ్రి ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో రౌడీ మధుని చూసి తన మనషులకు అన్నా ఎవరో అమ్మాయి వచ్చింది అని అంటాడు. అక్కడే ఉన్న చందు లేచి అమ్మ చిన్ని వచ్చినట్లు ఉంది అని చెప్పి వెళ్తాడు. చిన్నిని చందు చూసే టైంకి మరికొందరు రౌడీలు చిన్నిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. చందు చిన్నిని వెతుకుదాం అని అంటే సరళ వద్దని కొడుకుని తిట్టి తీసుకెళ్లిపోతుంది. మరోరౌడీ దేవాకి కాల్ చేసి ఒకమ్మాయి వచ్చింది సార్ ఎవరో తనని తీసుకెళ్లిపోయారని అని అంటాడు. మన కంటే ముందు ఎవరు తీసుకెళ్లిపోయారు. అంటే ఎవరో దాన్ని కాపాడాలి అనుకున్నారు ఎవరు అని దేవా, వల్లి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















