Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 22nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారికి కరెంట్ షాక్.. బతకడం కష్టం! వీర్రాజు కుట్ర ఫలించిందా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 22nd వీర్రాజు విహారికి షాక్ కొట్టేలా చేయడం విహారి పరిస్థితి విషయంగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode వీర్రాజు విహారి వాళ్లని ఊరు నుంచి పంపేయాలని విహారికి ప్రమాదం తల పెట్టాలని అనుకుంటాడు. విహారి చేత ఊరి జనం రైసు మిల్లులో చేయనున్న ఆయుధ పూజలో ప్రమాదం సృష్టించాలని అనుకుంటాడు. అందుకు ఎలక్ట్రీషియన్‌ని పిలిపించి మిల్లు దగ్గరకు వెళ్తారు.
లక్ష్మీ అమ్మవారితో విహారికి ఏం ప్రమాదం జరగకుండా క్షేమంగా ఉండేలా చూసుకోమని వేడుకుంటుంది. విహారి ఫ్యామిలీ మొత్తం రైసు మిల్లు దగ్గరకు వెళ్లాలని బయల్దేరుతారు. విహారి దగ్గరకు యమున వెళ్లి పిలుస్తుంది. అప్పుడే విహారి మీద బల్లి పడుతుంది. యమున కంగారుగా విహారిని మళ్లీ స్నానం చేసి రమ్మని చెప్తుంది. ఏం కాదని విహారి చెప్పినా యమున ఒప్పుకోదు. మరోవైపు వీర్రాజు ఎలక్ట్రీషియన్‌తో విహారి రైసు మిల్లు దగ్గర స్విచ్ వేయగానే షాక్ కొట్టేలా చేస్తాడు. విహారి మళ్లీ రెడీ అయి వస్తే అందరూ కలిసి రైస్ మిల్లు దగ్గరకు వెళ్తారు.
ఊరి జనం మొత్తం రైసుమిల్లు దగ్గర విహారి ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీర్రాజు కూడా వస్తాడు. పానకాలు వీర్రాజుతో వాళ్లకి అందరూ ఒంగి ఒంగి దండం పెడుతున్నారు మీకు ఎవరైనా పెట్టారా అని అంటాడు. ఇక ఊరి జనం మొత్తం మా కష్టాలు చూసి మీ నాన్న గారు కట్టించారు అని అంటారు. వీర్రాజు కావాలనే హరికృష్ణ గారికి అన్నీ ఆదర్శభావాలు ఉన్నాయి కాబట్టే అనాథని పెళ్లి చేసుకున్నాడు. వాడి వల్లే ఊరికి ఈ పరిస్థితి వచ్చిందని అంటాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని విహారి వీర్రాజు కాలర్ పట్టుకొంటాడు. పద్మాక్షి కోపంగా నీకు మేం జాలితో వదిలేశాం కాబట్టి ఇలా అవుతున్నావ్ అంటుంది. పెద్దాయన కోపంగా నువ్వు మీ తాత లాగే తయారయ్యావ్.. మేం మీలాగే చేస్తే నీకేం మిగలదు జాగ్రత్త అని అంటారు.
విహారి వాళ్లు లోపలికి వెళ్తారు. విహారి, సహస్ర పూజ చేస్తారు. లక్ష్మీ అక్కడే ఉన్న చిన్న బాబుని ఆడిస్తుంది. ఇక ఎలక్ట్రీషియన్ బయట కనెక్షన్ ఇస్తుంటాడు. లక్ష్మీకి ఫోన్ రావడంతో బయటకు వెళ్తుంది. అందరూ కలిసి మెషిన్ ఆన్ చేసే కంట్రోల్ ప్యానెల్ దగ్గరకు వెళ్లి పూజ చేస్తారు. ఇక బయట ఎలక్ట్రీషియన్ తన ఫ్రెండ్‌తో విహారి స్విచ్ వేయగానే పోతాడు అని చెప్పడం లక్ష్మీ వింటుంది. విహారి గారు అని పరుగులు తీస్తుంది.
విహారి పూజ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయగానే షాక్ కొడుతుంది. సహస్ర పట్టుకోవడానికి వెళ్తుంది. అందరూ ఆపుతారు. విహారి విహారి అని అందరూ అరుస్తూ ఏడుస్తారు. ఇంతలో లక్ష్మీ వచ్చి చూసి అమ్మవారి దగ్గర ఉన్న క్లాత్ తీసుకొని విహారి మెడలో వేసిలో లాగుతుంది. విహారి కింద పడిన తర్వాత అందరూ విహారిని లేపాలని ప్రయత్నిస్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి హైఓల్టేజ్ షాక్ కొట్టడం వల్ల పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. సిటీ నుంచి స్పెషలిస్ట్‌లను పిలిపిస్తున్నాం అని చెప్తారు. ఊరి మొత్తం విహారి కోసం మొక్కుకుంటారు.
వీర్రాజు, ప్రకాశ్ వాళ్లు నవ్వుకుంటారు. వీర్రాజు ఎలక్ట్రీషియన్‌కి డబ్బు ఇస్తాడు. వారసుడు ఉండడు ఇక నా మాటే శాసనం అని వీర్రాజు విర్రవీగుతాడు. స్పెషలిస్ట్ వచ్చి చూసి విహారి పరిస్థితి హోప్ లెస్ అని చెప్పేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















