Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఊరిని దత్తత తీసుకున్న విహారి! వీర్రాజుతో చేతులు కలిపిందెవరు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 20th విహారి ఫ్యామిలీ రామాపురం రావడం విహారి ఊరిని దత్తత తీసుకుంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫ్యామిలీ మొత్తం రామాపురం బయల్దేరుతారు. పండు కాళికి గాయం కావడంతో లక్ష్మీని రమ్మని కాదాంబరి చెప్తుంది. లక్ష్మీ బయల్దేరుతుంది. విహారి వాళ్ల కోసం ఊరు మొత్తం పొలిమేరలో ఎదురు చూస్తుంటుంది. అందరూ ఊరు చేరుకుంటారు. పోచమ్మ ఊరి పెద్దలు స్వాగతం పలుకుతారు.
విహారికి బాబాయ్ అయిన వీర్రాజు కూడా అక్కడే ఉంటాడు. దూరం నుంచి మొత్తం చూస్తూ ఓరేయ్ పానకాలు వాళ్లు వస్తే ఊరి బాగుపడిపోతుందా అంటే వీర్రాజు పనోడు పానకాలు ఊరేమో కానీ అయ్యా వాళ్ల తాతల ఆస్తులు అనుభవిస్తున్న మీ పని అయిపోతుంది అంటాడు. ఓరేయ్ పానకాలు ఇప్పుడు ఏదో ఒక అపశకునం ఎదురవ్వాలిరా.. వీళ్లు అడుగు పెట్టగానే ఊరు నాశనం అవుతుందని అందరూ అనుకొని వాళ్లని తరిమేయాలి అని ఆ ఏర్పాట్లు చూడమని అంటాడు.
విహారి వాళ్ల దగ్గరకు ఒకాయన వచ్చి స్కూల్ తగలబడిపోతుందని చెప్తాడు. అందరూ పరుగులు పెడతారు. స్కూల్ కాలిపోతుంది. మా పిల్లలు లోపల ఉన్నారని ఒకామె ఏడ్వడంతో లక్ష్మీ పరుగులు పెడుతుంది. వెనకాలే విహారి వెళ్తే లక్ష్మీ ఓ దూలం పడిపోతుంటే విహారిని వెళ్లిపోమని నెట్టేస్తుంది. విహారి మరో సారి వెళ్లకుండా సహస్ర పట్టుకుంటుంది. లక్ష్మీ మంటల్లోకి వెళ్లి ఇద్దరు పిల్లల్ని కాపాడి తీసుకొస్తుంది. లక్ష్మీ రాగానే విహారి లక్ష్మీ నీకు ఏం కాలేదు కదా అని వెళ్తాడు. పిల్లల్ని కాపాడినందుకు లక్ష్మీని అందరూ థ్యాంక్స్ చెప్తారు. ఊరిలో ఉన్న ఒక్క స్కూల్ కాలిపోయింది పిల్లలు ఎలా చదువుకుంటారు అని అందరూ ఏడిస్తే స్కూల్ నేను మళ్లీ కట్టిస్తా మీరేం బాధ పడకండి అని విహారి మాటిస్తాడు.
వీర్రాజు అందరితో వీళ్లు అడుగు పెట్టగానే ఇలా అయింది అని అంటాడు. రూపు రేఖలు మారాయి కానీ నోటి దూల మారలేదని పద్మాక్షి అంటుంది. విహారి కుటుంబ సహకారంతో ఊరిని దత్తత తీసుకుంటా అని చెప్తాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని విహారిని ఫ్యామిలీ పొగుడుతుంది. మీ ఆస్తులు తీసుకుంటాడయ్యా అని వీర్రాజుకి అంటాడు.
విహారి వాళ్లు ఇంటికి వెళ్తారు. పద్మాక్షి చూసి నేను పుట్టిన ఇల్లు అని ఎమోషనల్ అవుతుంది. విహారి ఇళ్లంతా చూసి గుమ్మం దగ్గరకు వెళ్తాడు. వెనకాలే లక్ష్మీ వెళ్లడంతో పని వాళ్లు ఇద్దరూ భార్యాభర్తలు అనుకొని హారతి పట్టుకొని వెళ్తారు. మీ ఈడు జోడు బాగుంది మీ ఆవిడ బాగుంది అని హారతి ఇస్తుంటే పద్మాక్షి చూసి హారతి పళ్లెం విసిరి కొట్టి పనామెకి కొడుతుంది. ఎవరు ఎవరికి ఏమవుతారో తెలుసుకోకుండా హారతి ఇచ్చేయడమేనా అని అంటుంది. లక్ష్మీకి ఒక్కటి పీకి నువ్వేంటే విహారి పక్కన నిల్చొంటావేంటే అని అంటుంది. విహారి భార్య నా కూతురు. తను మీలాగే ఇంటి పనిమనిషి అంటుంది. సహస్ర, విహారికి హారతి ఇచ్చి ఆహ్వానించమని అంటుంది. మళ్లీ సహస్ర, విహారిలకు హారతి ఇస్తారు.
సుబ్బయ్య వాళ్లు వచ్చి రేపు మీ అబ్బాయి కట్టిచ్చిన రైసుమిల్లులోఆయుధ పూజ ఉంది అందరూ రావాలి అని పిలుస్తాడు. లక్ష్మీ ఓ చోట ఉంటే విహారి వెళ్లి ఊరు చూస్తే మీ ఊరు గుర్తొస్తుందా నాకు మాత్రం నిన్ను మొదటి సారి చూడటం గుర్తొస్తుందని అంటాడు. లక్ష్మీ విహారితో ఎవరైనా చూస్తే బాగోదు వెళ్లిపోండి అని చెప్తుంది. చూడని ఇలా అయినా నిజం తెలుస్తుందని విహారి అనడంతో లక్ష్మీ వెళ్లిపోవాలని అనుకొని ముందు అడుగులు వేస్తే విహారి పట్టుకొని ఆపుతాడు. చేయి వదలమని లక్ష్మీ అంటే పట్టుకుంది వదలడానికి కాదు అని లక్ష్మీ చేతికి అయిన గాయానికి మందు పెడతాడు. నీలా నేను ప్రేమని దాచుకోలేను అని అంటాడు.
వీర్రాజు తన ప్లాన్ బెడిసికొట్టినందుకు తెగ రగిలిపోతాడు. విహారి దత్తత తీసుకున్నంత మాత్రానా నన్ను కాదని ఏం చేయగలడు అని వీర్రాజు అంటాడు. ఇంతలో ప్రకాశ్ వీర్రాజు దగ్గరకు వెళ్తాడు. నువ్వు ఎవరు అంటే శత్రువుకి శత్రువు ఏమవుతాడు అంటే వీర్రాజు అజాత శత్రువు అంటే పానకాలు మిత్రుడు సార్ అంటాడు. ప్రకాశ్ వీర్రాజుతో మీరు స్కూల్ తగలబెట్టారని నాకు తెలుసు వాళ్లు వెళ్లిపోవాలి అనుకుంటే మీరు విహారికి ప్రమాదం కలిగించండి అప్పుడు అందరూ వెంటనే వెళ్లిపోతారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















