Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి ఫ్యామిలీ రామాపురం వెళ్తుందా! లక్ష్మీ వెళ్లను అని చెప్పడానికి కారణమేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode Sep 19th పోచమ్మ, ఊరి పెద్దలు లక్ష్మీ సాయంతో విహారి వాళ్ల ఇంటికి వచ్చి విషయం చెప్పి ఊరు రమ్మని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పోచమ్మకి యాక్సిడెంట్ కాకుండా లక్ష్మీ కాపాడుతుంది. పోచమ్మ వాళ్లని రెస్ట్ తీసుకోమని అంటే పోచమ్మ వద్దని ఓ అర్జెంట్ పని మీద వచ్చాం అని చెప్తుంది. దాంతో లక్ష్మీ అమ్మ మీరు మా ఇంటికి రండి.. రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మీకు సాయం చేస్తా అంటుంది. పోచమ్మ వాళ్లు సరే అని విహారి వాళ్ల ఇంటికి వస్తారు.
పోచమ్మ వాళ్లు వచ్చి హాల్‌లో కూర్చొంటారు. పద్మాక్షి వాళ్లని చూసి గతం గుర్తు చేసుకొని అలాగే ఉండిపోతుంది. సహస్ర వచ్చి ఏమైంది అమ్మా అని అడిగితే పద్మాక్షి ఏం మాట్లాడకుండా అలా చూస్తుండి పోతుంది. ఇంతలో పోచమ్మ గోడకు ఉన్న హరికృష్ణ ఫొటో చూసి షాక్ అయిపోతుంది. లేచి నిల్చొని సూర్యవంశ హరికృష్ణ గారు పరమపదించారా అనుకుంటుంది. యమునని చూసి ఊరుని వదిలి వచ్చారు అనుకున్నా కానీ ఇలా నీసంతోషం కూడా వదిలేశారా అని కన్నీరు పెట్టుకుంటుంది.
విహారి ఫ్యామిలీ మొత్తం బయటకు వస్తారు. విహారి తాతయ్య చూసి పోచమ్మ మీరేంటి ఇలా అంటే రావాల్సి వచ్చింది అమ్మవారే పంపింది అని అంటుంది. ఎవరు వీళ్లు అని సహస్ర అడిగితే మన ఊరువాళ్లు అని పద్మాక్షి అంటుంది. మన ఊరా అని విహారి షాక్ అవుతాడు. మన ఊరు ఇది కాదు.. మనది రామాపురం అని పద్మాక్షి చెప్తుంది. పోచమ్మ ఊరు ఎలా ఉంది అని పద్మాక్షి అడిగితే మీరు ఊరు వదిలేసి వెళ్లినప్పటి నుంచి కరువులో ఉందని విషయం చెప్తుంది పోచమ్మ. దీనంటకి కారణం ఏంటని అమ్మని అడిగితే రెండు పుష్కరాల నుంచి ఆగిన సారె మీ ఇంటి నుంచి వస్తేనే శాంతిస్తాను అని చెప్పిందని చెప్తుంది. కానీ ఇక్కడికి వస్తే తెలిసింది సారె ఇచ్చే చేతులు లేవని మీ ఇంటి వారసుడు లేడని అని సుబ్బయ్య ఏడుస్తాడు.
నా వారసుడు మరణించాడు సుబ్బయ్యా కానీ ఈ ఇంటి వారసుడు ఉన్నాడు అదిగో విష్ణువిహారి అని పెద్దాయన చూపిస్తాడు. మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడని మేం చాలా అవమానించాం దాంతో ఆయన ఊరు వదిలేశారు ఇప్పుడు అందరి ముందు క్షమాపణ చెప్తున్నాం అని అంటారు. క్షమాపణలు వద్దు అని యమున అంటుంది. పోచమ్మ దసరాకి వారసుడని తీసుకొని వచ్చి సారె ఇవ్వండి అని చెప్తుంది. అందరం వెళ్దామని పద్మాక్షి చెప్తుంది. పద్మాక్షి అంబికను కూడా ఊరు వెళ్దాం అని పిలుస్తుంది. అంబిక రాను అనేస్తుంది. మనసులో మీరు ఊరు వెళ్లండి ఇక్కడ నేను ఏం చేయాలో అది చేస్తా అనుకుంటుంది.
ఇంట్లో అందరికీ పద్మాక్షి పట్టు చీరలు ఇస్తుంది. ఊరిలో డ్రస్సులు వేయొద్దు చీరలు కట్టుకో అని చెప్తుంది. వసుధ లక్ష్మీని నువ్వు మాతో వస్తున్నావా అంటే నేను రాను అని లక్ష్మీ అంటుంది. విహారి చాటుగా వింటాడు. తనకు ఇష్టం లేదు వదిలేయండి అని వసుధ అంటుంది. విహారి లక్ష్మీ దగ్గరకు వచ్చి నా ఊరు నా ఫ్యామిలీతో కలిసి నేను వెళ్లాలి అనుకుంటే నువ్వు రావా అని అంటాడు. నేను మీ ఫ్యామిలీ కాదు నేను రాను అని లక్ష్మీ అంటుంది.
పండు, లక్ష్మీ పెద్దాయన దగ్గరకు వెళ్లి ఊరు వాళ్లు యమునమ్మని హరికృష్ణ సార్‌ని ఎందుకు వెళ్లగొట్టారు అనిఅడుగుతారు. హరికృష్ణ కుండమార్పిడి చేసుకుంటాడని ఊరి సమక్షంలో పెళ్లి ఫిక్స్ చేస్తాం అనుకున్నాం కానీ వాడు యమునను పెళ్లి చేసుకొచ్చాడు.. ఊరు అందరూ తిట్టడంతో అమ్మవారికి సారె పెట్టకుండా వచ్చేశాడు. అమ్మవారి శాపమో ఇంకేంటో తెలీదు కానీ నా కొడుకు చనిపోయాడు అని పెద్దాయన ఏడుస్తారు. ఆ శాపమే నా మనవడిని కూడా వెంటాడుతున్నట్లు ఉందిరా అని పెద్దాయన అంటారు. విహారి భార్యతో కలిసి పూజ చేసి అమ్మవారికి సారె ఇవ్వాలి అలా చేయలేదు అనే ఈ గండాలు అన్నీ అని పెద్దాయన చెప్తాడు. ఎలాగూ వెళ్తున్నాం కదా నా మనవడు మనవరాలి చేత పూజ చేయిస్తా అని అంటారు.
లక్ష్మీ పండుతో నేను వాళ్లతో పాటు వెళ్లాలి అని అంటుంది. రాను అనేశావ్ ఇప్పుడు ఎలా అని పండు అంటే లక్ష్మీ ఆలోచిస్తుంది. ఉదయం అందరూ రెడీ అయి కిందకి వస్తారు. పండుని సహస్ర పిలుస్తుంది. పండు వస్తూ కింద పడిపోతాడు. కాలికి దెబ్బ తగులుతుంది. దాంతో ఊరిలో పనులకు లక్ష్మీని తీసుకెళ్దాం అని కాదాంబరి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















