Nuvvunte Naa Jathaga Serial Today September 19th: నువ్వుంటే నా జతగా సీరియల్: నేత్ర ఫ్రాడ్ అని తెలిసినా దేవా ఎందుకు రిలీజ్ కాలేదు! భాను, మిథునల గొడవేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 19th నేత్ర కిలాడీ అని మిథున ఎస్‌ఐకి సాక్ష్యాలు చూపించడం అయినా దేవాని ఎస్‌ఐ విడిచిపెట్టకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode నేత్ర ఫ్రాడ్ అని గతంలోనూ ఒకరి మీద రేప్ కేసు పెట్టి దొరికిపోయి అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని వీడియోతో పాటు కొన్న సాక్ష్యాలు తీసుకొని పోలీస్ స్టేషన్‌కి బయల్దేరుతుంది. ఇంతలో మిథునకు ఆదిత్య కాల్ చేస్తాడు. నేత్ర ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిందని తెలిసింది 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ నేను లాయర్‌ని కదా నేను దేవాని బెయిల్ మీద తీసుకొస్తా.. ఏం జరిగినా నీకు తోడుగా ఈ ఆదిత్య ఉంటాడు అని చెప్తాడు.
మిథున ఆదిత్యతో థ్యాంక్స్ ఆదిత్య కానీ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.. ఏ లాయరూ అవసరం లేదు.. మేటర్ సింపుల్ ఆదిత్య దేవా ఏం తప్పు చేయలేదు.. నా నమ్మకమే నిజం అయింది. నేత్ర ఓ ఫ్రాడ్ ఆదిత్య. అబ్బాయిల్ని ట్రాప్ చేసి మనీ డిమాండ్ చేయడం తన వృత్తి అని మిథున చెప్పగానే నీకు ఎలా తెలిసింది అని ఆదిత్య షాక్ అయిపోతాడు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆదిత్య నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నా.. దేవాని రిలీజ్ చేశాక మాట్లాడుతా అని చెప్తుంది.
ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఎవరికో కాల్ చేసి నేను చెప్పినట్లు చేయ్ అని అంటాడు. పోలీస్ స్టేషన్ బయట భాను మిథున వల్లే దేవాకి ఈ పరిస్థితి అని తిట్టుకుంటుంది. ఇంతలో మిథున అక్కడికి వస్తే భాను మిథున దగ్గరకు వెళ్తుంది. నువ్వే ఏ ముహూర్తానా నా రాజా జీవితంలోకి వచ్చావో అప్పుడే వాడి జీవితం నాశనం అయిపోయింది. నువ్వు వచ్చిన తర్వాత వాడు మూడో సారి జైలుకి వచ్చాడు.. వాడి జీవితంలోకి వచ్చి నువ్వు ఏం సాధించావ్..నువ్వు కానీ రాకపోయి ఉంటే నేను వాడిని పెళ్లి చేసుకొని వాడి బిడ్డని కడుపులో మోస్తుండే దాన్ని.. కానీ ఇప్పుడు వాడి పరిస్థితి చూసు అని అంటుంది. దానికి మిథున నేను చాలా చిరాకులో అంత కంటే ఎక్కువ కోపంలో ఉన్నా పక్కకి తప్పుకో అని అంటుంది.
భాను కోపంతో అయినా వాడు నిన్ను కాకుండా నన్ను కాకుండా పోయి పోయి ఆ చెత్త ముఖాన్ని గోకాడు అని అంటుంది. దానికి మిథున నా భర్త ఏతప్పు చేయడు. ఇదంతా ఆయన మీద జరిగిన కుట్ర ఇంకోక్క సారి ఆయన తప్పు చేశాడని ఇలా మాట్లాడావు అంటే మొత్తం 32 పళ్లు నేల మీద ఉంటాయ్ అని అంటుంది. నా రాజా తప్పు చేశాడు అంటే నేను నీ లెక్క నమ్మలే ఎందుకు అంటే మనం ఇద్దరం వాడిని ప్రేమించి చచ్చాం కాబట్టి కానీ జనాలు, పోలీసులు మన లెక్క నమ్మి చావడం లేదు కదా అంటుంది. నా భర్త మీద పడిన నింద నేను నిరూపించుకుంటా.. ఏం తప్పు చేయలేదు అని అందరికీ నిరూపిస్తాను అంటుంది. అది కాదు మిథున దేవా కోసం మనిద్దరం కొట్టుకు చస్తుంటే మధ్యలో ఆ నేత్ర తన్నుకుపోయేలా ఉంది అని భాను అంటుంది. చంపేస్తాను.. చంపేస్తాను.. నా భర్త జీవితంలోకి ఎవరైనా రావాలి అని చూస్తే చంపేస్తా.. అంతెందుకు నువ్వు రావాలి అని చూస్తే నిన్ను రానిచ్చానా అని అంటుంది. దానికి భాను.. అది వేరు నేను వేరు.. నీ కంటే ముందు నేను దేవా జీవితంలో ఉన్నాను 13ఏళ్ల ప్రేమ మాది. మూడు ముళ్ల బంధంతో నేను ముడిపడ్డాను.. నువ్వు కూడా మా మధ్యలోకి వస్తే నిన్ను కూడా ఊతికి ఆరేస్తా అని అంటుంది. దేవా నిన్ను పరాయిదానిలా చూస్తున్నాడు.. నన్నుభార్యలా చూస్తూ నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు అని అంటుంది.
రంగం గదిలోకి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంటుంది. నగలు, డబ్బు కనిపించకపోయే సరికి దొంగలు ఎత్తుకుపోయారని గుండె పట్టుకొని కూర్చొండిపోతాడు. తీరా చూస్తే కాంతం అవన్నీ పెట్టుకొని వారాయ్ అంటూ చంద్రముఖి పాటకు డ్యాన్స్ చూస్తుంది. నగలు ఇంట్లో వాళ్లు చూస్తే ప్రాబ్లమే అని రంగం అన్నీ నగలు తీయించేస్తాడు. మిథున ఎస్‌ఐ దగ్గరకు వస్తుంది. నేత్ర పెద్ద చీటర్ అని చెప్పి వీడియో చూపిస్తుంది. వీడియో చూశారు కదా మీకు అర్థమైంది కదా నేత్ర గతంలోలా మా ఆయనను కూడా ఇరికించిందని అంటుంది. ఎస్‌ఐ మిథునతో వీడియో బాగుంది.. క్వాలిటీ బాగుంది జాగ్రత్తగా దాచి పెట్టుకో అని అంటాడు. తను చీటరే కావొచ్చు గతంలో అలా చేసుండొచ్చు కానీ ఇప్పుడు అలాగే చేసింది అనడానికి ఈ వీడియో సాక్ష్యం సరిపోదు అని అంటాడు.
మిథున ఐడీ కార్డుల గురించి కూడా చెప్తుంది. దేవాని రిలీజ్ చేయమని అంటుంది. దేవా రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి.. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకో అని అంటాడు. ఈ విషయం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతా అని మిథున ఎస్‌ఐతో చెప్తుంది. తర్వాత దేవా దగ్గరకు వెళ్తుంది. ఎస్ఐ నీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కానీ నేను ఉండగా నా భర్తకి ఏం కాదు.. నా భర్తని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలు పణంగా పెడతా.. దేవా పరిస్థితుల్ని మనుషుల్ని ఎదురించి అయినా సరే నిన్ను నిర్దోషిగా తీసుకొస్తా నువ్వు నా మీద నమ్మకం ఉంచు దేవా అని అంటుంది.
నన్ను రిలీజ్ చేయించమని నేను నిన్ను అడిగానా అని దేవా అంటాడు. నా భర్తని బయటకు తీసుకురావడం నా బాధ్యత కాదా అని మిథున అంటే ఆపు మిథున భర్త భర్త అని చంపుతున్నావ్ అంటాడు. ఇంతకు ముందు ఈ మాట నీ మనసు నుంచి వచ్చేది ఇప్పుడు నీ మనసులో నుంచి కాదు అంటుంది. నా చావు నేను చస్తాను నన్ను వదిలేసి వెళ్లిపో మిథున అని దేవా అంటాడు. నువ్వు వెళ్లిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను నన్ను వదిలేసి వెళ్లిపో మిథున అని దేవా ఏడుస్తాడు. సరే అదే మాట ఇటు తిరిగి నన్ను చూసి చెప్పు అని మిథున అంటుంది. దేవా తిరగడు. మనసులో ప్రేమ దాచుకోవడం కష్టం ఎంత దాచుకోవాలి అని చూసినా అది బయట పడుతుంది అని అంటుంది. నా మనసులో నీ మీద ఎలాంటి ప్రేమ లేదు.. వెళ్లిపో అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















