Jagadhatri Serial Today November 6th: జగద్ధాత్రి సీరియల్: నిషిక సూసైడ్! నిషిక నోటికి అడ్డూ అదుపు ఉండదా! అక్క మీదకు వెళ్లిన యువరాజ్!
Jagadhatri Serial Today Episode November 6th నిషికని తన తల్లి అవమానించింది అని నిషి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నిషిక తల్లి రేఖ అందరినీ నోములకు పిలిచి నిషికకు బొట్టు పెట్టి మీరు మాత్రం రావొద్దు అని చెప్తుంది. మేం ఎందుకు రావొద్దు అమ్మా అని నిషిక అడిగితే చెప్పలేనే అర్థం చేసుకోండి.. సిరి అత్తమామలు కూడా వస్తారు అని రేఖ చెప్తుంది.
నిషిక కోపంతో ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్న కన్నదాన్ని ఒకలా కాని దాన్ని ఒకలా చూస్తున్నావు.. మమల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. తెలియక నా భర్త ఓ చిన్న తప్పు చేస్తే కరుడు కట్టిన క్రిమినల్‌లా చూస్తున్నారు. మేం వస్తే మీ ఇంటి పరువు పోతుందా.. మేం వస్తే దాని అత్తామామలు ఏమైనా అనేస్తారా.. మీరు చెప్పుకోలేరా.. ఇంత కంటే అవమానం మరొకటి లేదు. అది కూడా తల్లి చేస్తే అస్సలు బాలేదు అని నిషిక అంటుంది. అందరికీ మర్యాదలు వలకబోసి నన్ను అవమానిస్తావా అమ్మా నీకు నా కంటే ఆ జగద్ధాత్రి, కేథార్ ఎక్కువ అయిపోయారా.. దీని కంటే నేను మీ కూతురు కాదు.. నువ్వు నా తల్లి కాదు.. నేను చచ్చాను అనుకోండి.. ఈ అవమానం నేను తట్టకోలేను చచ్చిపోతా అని నిషిక ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు పెడుతుంది.
నిషికను ఆపడానికి అందరూ పరుగులు పెడతారు. నిషిక గదిలోకి వెళ్లి ట్యాబ్లెట్స్ ఎక్కువ పట్టుకొని మింగేయడానికి ప్రయత్నిస్తుంది. ఎంత మంది డోర్ తీయాలి అనుకున్నా తీయలేకపోతారు. కేథార్, యువరాజ్ ఇద్దరూ కలిసి డోర్ పగలగొడతారు. కరెక్ట్‌గా నిషిక మందులు మింగే టైంకి వచ్చి కాపాడుతారు. యువరాజ్ ట్యాబ్లెట్స్ విసిరేస్తాడు. నేను చస్తే మీకు ఈ అవమానాలు ఉండవు కదా అని నిషి అంటుంది.
జగద్ధాత్రి నిషితో యువరాజ్ నువ్వు వెళ్తే అవమానాలు పడతారు అనే కదా పిన్ని వద్దు అంది.. నీ భర్త మంచోడిగా మారితే మీకు పూర్వం రోజులు వస్తాయి. నీ భర్త మీద నమ్మకం లేదా నీకు అని అంటుంది. మా వల్ల మాత్రమే పరువు పోతుంది.. కేథార్ తండ్రి ఎవరో తెలీదు ఆ విషయం తెలిస్తే పరువు పోదా.. అలాగే ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డని కన్నారు ఆవిడ వ్ల పరువు పోదు.. ఆవిడ గురించి ఎవరూ మాట్లాడుకోరు.. ఇంత మంది వల్ల పోని పరువు నా భర్త ఒక్కడి వల్ల పోతుందా అని అంటుంది.
రేఖ వైజయంతి పెళ్లికి ముందు బిడ్డ కనడం ఏంటి అని షాక్ అయి అడుగుతారు. వైజయంతి తల దించుకుంటుంది. నిషి తండ్రి బిత్తరపోతారు. నాన్న నిషి ఏదో చెప్పింది అని మీరు ఏంటి అది నిజం కాదు అని జగద్ధాత్రి చెప్తుంది. నిషికతో వద్దు అని తలూపుతుంది. మరి నిషి ఎందుకు అలా చెప్పింది అని రేఖ అడుగుతుంది. దాంతో జగద్ధాత్రి కేథార్ తల్లి గురించి అంది అని కవర్ చేస్తుంది. అవును అని నిషి తలూపుతుంది. యువరాజ్, నిషిక కూడా వస్తాడు.. ఇక్కడిలాగే గదిలో ఉంటాడు అని అంటుంది జగద్ధాత్రి. మాకు రాకూడదు అని ఉంటుందా రండి అని రేఖ అంటుంది. ఇక జగద్ధాత్రి తండ్రి అన్ని పనులు మీరే చూసుకోవాలి అని కేథార్‌కి చెప్తాడు.
జగద్ధాత్రి, కేథార్ రేఖ వాళ్లని డ్రాప్ చేయడానికి కిందకి వస్తారు. ఇంతలో ఓ మెకానిక్ వచ్చి కారు సర్వీసింగ్‌కి ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఏంటి అని అడుగుతాడు. కారులో కనిపించలేదు బండి మీదే కనిపిస్తున్నారు అని అడుగుతాడు. జగద్ధాత్రి, కేథార్‌కి అనుమానం వస్తుంది. రేఖ కూడా కారు పెట్రోల్ వేస్ట్ అని బండి నడుపుతున్నారు అంటుంది. నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నారని జగద్ధాత్రి అనుకుంటుంది. అప్పులు ఉండవులే అని కేథార్ అంటాడు.
నిషిక భర్తతో మా అమ్మనాన్నలకు మన కంటే ఆ జగద్ధాత్రి, కేథార్లు ఎక్కువైపోయారు అని అంటుంది. మన ప్రవర్తన వల్లే ఉంటుంది అని సుధాకర్ అంటాడు. ఇక వైజయంతి నిషితో నా గురించి చెప్పడానికి నీకు ఏం అర్హత ఉంది.. ఈ శ్రీవల్లి నా కూతురు అనడానికి నీకు ఏమైనా సాక్ష్యం ఉందా.. నోటికొచ్చినట్లు వాడిగితే ఊరుకోను అని అంటుంది. అయితే ఈ అమ్మాయి తల్లి మీరు కాకపోతే ఎవరో చెప్పొచ్చు కదా.. సిగ్గు లేకుండా అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు అని అంటుంది. కౌషికి నిషిని ఊరుకోమని అరుస్తుంది. వైజయంతి కూడా ఊరుకుంటున్నా అని ఎక్కువ వాగుతున్నావ్ అని నిషిని అంటుంది.
నిషి అయినా తగ్గకుండా మీది ఓ బతుకేనా పెళ్లికి ముందు మరో వ్యక్తితో బిడ్డను కంటారా.. మీ స్థానంలో నేను ఉంటే ఎప్పుడో ఉరి వేసుకొని చచ్చేదాన్ని అని నిషి అనడంతో కౌషికి కోపంగా నిషిని లాగిపెట్టి కొడుతుంది. నిషి బిత్తరపోతుంది. కోపంగా నన్నే కొడతారా అని అంటే మళ్లీ కౌషికి కొడుతుంది. ఊరుకుంటున్నాను అని నోటికొచ్చినట్లు వాగుతావా.. అత్తయ్య అని గౌరవం లేదు.. పెద్దావిడ అని లేదు అని తిడుతుంది. మర్యాదగా పిన్నికి సారీ చెప్పు అని కౌషికి అంటే నేను చెప్పను అని నిషి అంటుంది. ఎంత మంది చెప్పినా నిషి వినదు.. తప్పులు చేయని వారిని అడగమను సారీ చెప్తా.. అలా ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా.. దా గ్రేట్ మామగారు పెళ్లికి ముందే కేథార్‌ని కన్నారు. ఈ పెద్దావిడ ఈ శ్రీవల్లిని కనేసింది.. బూచి తాగుబోతు, కేథార్, జగద్ధాత్రి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఇద్దరూ ఇద్దరే. ఇక అందరికీ నీతులు చెప్పే మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భర్తని వదిలేసి ఇలా పుట్టింట్లో ఉంటున్నారు అని నిషి అంటుంది.
నిషికను కొట్టడానికి కౌషికి చేయి ఎత్తితే యువరాజ్ చేయి పట్టుకొని నేను ఒక లిమిట్ వరకు చూస్తాను అక్క ఇంకా దాటొద్దని కోరుకుంటున్నా అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మీరు అంటే మేం పడాలా.. తను నిజాలు చెప్తే పడాలా.. ఏం అన్నా పడుతున్నాం అని మమల్ని హీనంగా చూడొద్దు అని అంటాడు. సుధాకర్ కొడుకుని లాగిపెట్టి కొడతాడు. మీ అక్కనే ఎదిరించే అంత ఎదిగిపోయావారా.. తననే అడ్డుకునే అంత ఎదిగిపోయావా.. నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోయా.. కౌషికికి వార్నింగ్ ఇస్తావా.. ఈ పాపం ఊరికే పోదురా.. తను లేకపోతే మీకు తిండే లేదురా అని అంటారు. వాడి మాటలు పట్టించుకోవద్దమ్మా అని కౌషికికి సుధాకర్ చేస్తాడు. వైజయంతి దగ్గరకు వెళ్లి నీ వల్లే ఈ ఇళ్లు ఇలా రావణ కాష్టంలా అయిపోయిందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















