Nuvvunte Naa Jathaga Serial Today November 6th: నువ్వుంటే నా జతగా: మామని కాపాడిన దేవా! మిథునని వదిలేస్తాడా! దేవాతో అంతరాత్మ ఏం చెప్పింది?
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 6th దేవా హరివర్థన్‌ని కాపాడటం హరివర్థన్ ఇంటికి క్షేమంగా వెళ్లడం దేవా మిథునని వెళ్లిపోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా రౌడీలను చితక్కొట్టి హరివర్థన్‌ని కాపాడుతాడు. దేవా కట్లు విప్పి బయటకు తీసుకెళ్తాడు. దేవాకి హరివర్థన్ థ్యాంక్స్ చెప్తాడు. హరివర్థన్ వెళ్తాను అంటే దేవా డ్రాప్ చేస్తా అంటాడు. హరివర్థన్ వద్దని ఆటోలో వెళ్తాను అని వెళ్లిపోతాడు.
ఇంటి దగ్గర మిథున చాలా కంగారు పడుతూ ఉంటుంది. దేవా నెంబరు కలవకపోవడంతో ఏమైందా అనుకుంటుంది. నాన్న దేవా ఇద్దరూ క్షేమంగా ఉండాలి అనుకుంటుంది. దేవా వస్తూ మిథున వెళ్లిపోమని చెప్పిన మాట గుర్తు చేసుకొని సరిగా డ్రైవింగ్ చేయడు. ఓ కారు ఆయన దేవాని తిడతారు. దాంతో ఓ చోట బైక్ ఆపేసి కూర్చొని ఆలోచిస్తాడు.
దేవా అంతర్మాత్మ వచ్చి దేవాతో మాట్లాడుతుంది. మిథునని ఇప్పుడు నువ్వు పంపేయాలి అందుకే నువ్వు ఇంటికి వెళ్లలేకపోతున్నావ్.. మిథునని పంపేయాలి అని మాట అంటున్నా మనసు ఒప్పుకోవడం లేదు అందుకే ఇలా ఉండిపోయావ్ అని అంటుంది. అందుకే నీలో నువ్వు నలిగి పోయి నరకం చూస్తున్నావ్ అంటుంది. మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్లు దొరకడం అదృష్టం..నువ్వు ఇంకో జన్మ ఎత్తినా మిథునలా ప్రేమించే వాళ్లు నీకు దొరకరు. మరి ఎందుకు తనని దూరం చేసుకుంటున్నావ్ అయినా మిథున అంటే నీకు చచ్చేంత ప్రేమ ఉంది కదా అని దేవా అంతరాత్మ ప్రశ్నిస్తుంది.
దేవా దానికి మిథునని నేను ప్రేమిస్తున్నా కాబట్టి తన క్షేమం నాకు ముఖ్యం. తనని ప్రతి క్షణం పక్కనే ఉండి కాపాడుకోలేను.. నేను తనకి సెట్ అవ్వను. తను ఎంచుకున్న చోట వేరు తన జీవితం వేరు. మిథునని దూరం చేసుకోవడం నాకు చాలా కష్టం కానీ తన జీవితం బాగుండాలి అని నేను ఎంత కష్టం అయినా భరిస్తా అని అనుకుంటాడు.
రౌడీలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి దేవా అందర్నీ కొట్టి జడ్జిని తీసుకెళ్లిపోయారు అని చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ అయిపోతుంది. మీ వల్ల నా కొడుకు భవిష్యత్ పోతుందిరా.. నాకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కదురా. ఆ అమ్మాయిని రేప్ చేసినందుకు ఆ దేవా నా కొడుకుని చంపేస్తాడు. ఇద్దరూ ఇప్పుడు టార్గెట్ చేశారు. మొత్తం సర్వనాశనం చేశారు కదరా అని తిడుతుంది.
హరివర్థన్ ఇంటికి రావడంతో అందరూ చాలా సంతోషపడతారు. లలిత ఏడుస్తూనే ఉంటుంది. ఏం కాలేదు కదా క్షేమంగా వచ్చాను ఊరుకో అని జడ్జి అంటారు. నాన్న పోలీసులు కూడా మీరు ఎక్కడున్నారు కనిపెట్టలేకపోయారు. మరి మీరు ఎలా తప్పించుకున్నారు అని రాహుల్ అడుగుతాడు. రౌడీలు నన్ను చంపేయబోయారు. దేవా రావడం ఒక్క క్షణం లేటైనా నేను మీ ముందు ఉండే వాడిని కాదని అంటాడు. దేవా కాపాడాడు అనగానే అందరూ షాక్ అయిపోతారు. లలిత, అలంకృత చాలా సంతోషపడతారు.
అలంకృత విషయం అక్కకి చెప్పాలని కాల్ చేస్తుంది. నాన్న క్షేమంగా వచ్చేశారు అక్క అని చెప్పి బావే నాన్నని కాపాడారు అని చెప్తుంది. దేవా ఇంటికి రాగానే మిథున పరుగున వెళ్లి హగ్ చేసుకుంటుంద. అందరూ ఏమైందా అని అనుకుంటారు. మిథున దేవాకి థ్యాంక్స్ చెప్పి నువ్వు మాత్రమే మా నాన్నని కాపాడగలవు అని నాకు తెలుసు అంటుంది. జడ్జిని కాపాడారు అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అందరూ దేవాని మెచ్చుకుంటారు.
దేవా మిథునతో నీకు ఇచ్చని మాట ప్రకారం నేను మా నాన్నని మీ ఇంటికి పంపాను.. ఇక నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని అంటాడు. ఏంటి దేవా ఏం అంటున్నావ్ అని శారద అడుతుంది. మిథున కన్నీరు పెట్టుకుంటుంది. మిథున వాళ్ల ఇంటికి వెళ్లిపోతా అని మాటిచ్చిందని దేవా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















