Jagadhatri Serial Today November 17th Episode: జగద్ధాత్రి సీరియల్: సిరిని బ్లాక్‌మెయిల్ చేస్తుందెవరు? పుట్టింటిని జగద్ధాత్రి కాపాడుకుంటుందా!
jagadhatri serial today november 17th హనీమూన్ నుంచి వస్తున్న సిరిని ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఆస్తి మొత్తం తీసుకున్నారని జగద్ధాత్రికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి జగద్ధాత్రితో అ ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్లు ఉంది అది ఏంటో తెలుసుకున్న తర్వాతే మీరు రండి అని చెప్తుంది. కౌషికి వాళ్లు వెళ్తామని చెప్పడంతో ఎలా అయినా జగద్ధాత్రితో సంతకం పెట్టించాలని జగద్ధాత్రి తండ్రి అనుకుంటాడు.
నిషిక సిరి అత్తమామల్ని ఉద్దేశించి మాకు విలువ ఇవ్వని వాళ్లు మా గిఫ్ట్ చూసి మాకు విలువ ఇస్తే మంచిది అని చెప్పి భర్తని తీసుకొని వెళ్లిపోతుంది. సిరి అత్తామామలు కూడా వెళ్లిపోతాం అని అంటే సిరి సరదాగా ఈ రాత్రికి ఉండి రేపు వస్తుందని చెప్పి సిరిని ఉంచుతారు. కౌషికి వాళ్లు కూడా వెళ్లిపోతారు. కేథార్, జగద్ధాత్రి, సిరి ఉంటారు. జగద్ధాత్రి తండ్రి జగద్ధాత్రి, సిరిని పిలిచి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. కేథార్ ఒక్కడే హాల్లో ఉంటే మిగతా నలుగురు వెళ్తారు.
జగద్ధాత్రి తండ్రి బెరుకు చూసి మీరేం చెప్పాలి అనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి అని జగద్ధాత్రి అంటే చెప్పడానికి ఏం లేదమ్మా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా సంతకాలు పెట్టండి అని అంటాడు. సిరి తండ్రిని చూసి కంగారు పడుతుంది. జగద్ధాత్రి తండ్రితో ఏదో అయింది అని స్పష్టంగా తెలుస్తుంది కనీసం నాకు అయినా చెప్పు అని అంటుంది. అలా ఏం లేదమ్మా అని ఆయన అంటారు. సిరి సంతకం చేసి జగద్ధాత్రికి పేపర్లు ఇస్తుంది. జగద్ధాత్రికి అనుమానం పెరిగిపోతుంది. పిన్నికి కూడా చూస్తుంది.
జగద్ధాత్రి సంతకం పెడుతూ ఉంటే రేఖ సైగ చేస్తూ దగ్గుతూ ఉంటుంది. జగద్ధాత్రి చూసి పిన్ని ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా ఉంటుంది.. ఈరోజు ఎందుకు ఇలా సైగ చేస్తుంది అని అనుకుంటుంది. జగద్ధాత్రి పేపర్లు చదవాలి అనుకుంటే డాక్యుమెంట్స్ చదవడం ఎందుకు అని అంటాడు. జగద్ధాత్రి పేపర్లు చదివి ఇళ్లు అమ్ముతున్నట్లు ఉంది.. ఎందుకు అమ్ముతున్నారు.. అసలు సమస్య ఏంటి అని అడుగుతుంది. నా కష్టార్జీతం కదా మీరు ఎందుకు నాకు ప్రశ్నిస్తారు అని జగద్ధాత్రిని అడుగుతారు. ఇక భార్యతో సంతకం పెట్టొద్దు అని నువ్వు అన్నావ్ కదా అంటే మనకు ఇక మిగిలింది ఈ ఇళ్లు ఒక్కటే కదా చెప్పకుండా ఎలా ఉంటాను అని రేఖ అంటుంది.
జగద్ధాత్రి తండ్రితో మీరు అడిగితే నా ప్రాణం అయినా ఇస్తాను. అలాంటిది సంతకం పెట్టలేనా.. అసలు డబ్బు ఎవరికి ఇస్తున్నారు ఇదంతా ఏంటి చెప్పండి అని అడుగుతుంది. ఇంతలో సిరికి ఫోన్ ఇస్తుంది. సిరి చాలా కంగారు పడుతుంది. ఫోన్ ఎవరు నాన్న అని జగద్ధాత్రి అడుగుతుంది. ఎవరు నోరు విప్పకపోవడంతో జగద్ధాత్రి తన తల మీద చేయి వేసుకొని ఎవరు ఫోన్ చేస్తున్నారో చెప్పకపోతే నేను చచ్చినట్లే లెక్క అని అంటుంది. ఇక నిజం చెప్పేయండి అని రేఖ అంటుంది.
జగద్ధాత్రితో తన తండ్రి ఫ్లాష్‌బ్యాక్ చెప్తాడు. సిరి హనీమూన్‌కి కొడైకెనాల్ వెళ్లిన తర్వాత ఇంటికి వచ్చిందని..సిరికి అప్పుడే ఓ ఫోన్ వస్తుంది. సిరి ఫోన్ మాట్లాడుతూ గజగజ వణికిపోతూ ఫోన్ చూసి ఏడుస్తూ గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. రేఖ అది చూసి ఏమైంది అని అడుగుతుంది. రేఖ వాళ్లు వెళ్లి చూసే సరికి సిరి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది. ఏమైంది అని సిరిని అడిగితే హనీమూన్‌కి వెళ్లామని అక్కడ రిసార్ట్‌లో ఉండగా ఎవరో ఫోటోలు, వీడియోలు పెట్టి పది కోట్లు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తుంది. విషయం తెలిసి జగద్ధాత్రి కోపంతో రగిలిపోతుంది.
సిరి ఏడుస్తూ డబ్బు, పొలం, బంగారం, ఆస్తులు అన్నీ అమ్మేశారని ఇక ఈ ఇళ్లు మాత్రమే ఉందని సిరి చెప్తుంది. జగద్ధాత్రి సిరితో నువ్వు తప్పు చేయలేదు.. వాళ్లని అంతు చూస్తా.. నా కుటుంబాన్ని ఏడిపించిన వాళ్లని వదలను.. వడ్డీతో సహా వాళ్లకి తిరిగి ఇచ్చేస్తా అని జగద్ధాత్రి అంటుంది. కేథార్ సిరితో రిసార్ట్‌కి వెళ్లినప్పుడు నుంచి మొత్తం చెప్పమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















