jagadhatri serial Today july 3rd: బాబు నామకరణంలో పెను తుఫాను! కౌషికి, సురేష్ విడిపోతారా? ఆదిలక్ష్మి షాక్!
jagadhatri Today: కౌషికి అత్త బాబుకి తన భర్త పేరు పెట్టమని చెప్పడం కౌషికి తన తండ్రి పేరు పెట్టాలని అనుకోవడంతో జగద్ధాత్రి పరిష్కారం చూపడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

jagadhatri serial Today: కౌషికి ఆమె భర్త దూరంగా ఉండటం ఇటీవల కౌషికి బాబాయ్ సురేశ్‌కి కాల్ చేసి కొడుకు పుట్టాడని చెప్పి నామకరణానికి ఆహ్వానిస్తాడు. దాంతో సురేశ్ తన తల్లిని తీసుకొని కార్యక్రమానికి బయల్దేరుతాడు. ఈ తరుణంలో ఇవాళ్టి ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందంటే..
" సురేశ్ తన తల్లి ఆదిలక్ష్మీ కౌషికి ఇంటికి వస్తారు. ఆదిలక్ష్మీ మనవడిని ఎత్తుకొని రారా నా బంగారు మనవడా.. నిన్ను చూసే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వడేమో అనుకున్నానురా కానీ ఇంత త్వరగా ఇస్తాడు అనుకోలేదు అని అంటుంది. ఆ మాటలు విని నిషిక అత్తతో మనవడు అంటే అంత ప్రేమగా చూస్తుంది ఈవిడ గొడవ చేస్తుంది అంటారా అత్తయ్య అని అడుగుతుంది. ఇక ఆదిలక్ష్మీ మనవడితో ఏమయ్యా పరందామయ్య మళ్లీ నీ కుటుంబంతో ఉండాలి అని వచ్చావా అని అంటుంది. జగద్ధాత్రి, కౌషికిలతో పాటు అందరూ ఆదిలక్ష్మీ తన భర్త పేరు చెప్పగానే షాక్ అవుతారు. ఆదిలక్ష్మీ అందరితో ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు అని అడుగుతుంది. దాంతో కౌషికి చెప్పబోతే జగద్ధాత్రి ఆపి వదిన బాబుకి వాళ్ల నాన్న పేరు పెట్టాలని అనుకున్నారని అంటుంది. ఆదిలక్ష్మీ షాక్ అవుతుంది. మేం కూడా సురేశ్‌కి రెండో బిడ్డ పుడితే మా ఆయన పేరు పెట్టాలని అనుకున్నాం అని అంటుంది. జగద్ధాత్రి వాళ్లతో రెండు పేర్లు చిట్టీలు వేద్దాం ఏం పేరు వస్తే అది పెడదాం అని అంటుంది. దాంతో నిషిక అత్త భర్తలతో మనం కౌషికి వదిన నాన్న పేరు రెండు చిట్టీల్లో రాసి ఆదిలక్ష్మీ గొడవ పెట్టేలా చేద్దామని అంటుంది." దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.
ఆదిలక్ష్మీ అరెస్ట్ అయి బెయిల్ మీద వస్తుంది. దాంతో కోడలి మీద చాలా కోపంగా ఉంటుంది. సురేశ్, కౌషికి మధ్య అభిప్రాయ బేధాల వల్ల దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో మళ్లీ బాబు పుట్టడం వల్లీ కౌషికి, సురేశ్ మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిస్తే తమకు నష్టం అని భావించిన నిషిక బ్యాచ్ ఎలా అయినా గొడవలు పెట్టి కలవకుండా చేయాలని అనుకుంటారు. అందులో భాగంగానే ఆదిలక్ష్మీని రెచ్చగొట్టి గొడవలు చేయాలని అనుకుంటారు. తాజా ప్రోమో ప్రకారం ఆదిలక్ష్మీ బాబుకి తన భర్త పేరు పెట్టమనడం కౌషికి తన తండ్రి పేరు పెడతానని అనడం విషయాన్ని నిషిక వాళ్లు అవకాశంగా తీసుకుంటారు. చిట్టీలు మార్చి కౌషికి, జగద్ధాత్రిలను ఇరికించాలని ప్లాన్ చేస్తారు. నిషిక వాళ్లు ప్లాన్ సక్సెస్ అయితే బాబు నామకరణంలో పెద్ద రచ్చ జరుగుతుంది. అదే జరిగితే మళ్లీ కౌషికి, సురేశ్‌లు అభిప్రాయ బేధాలతో విడిపోయే ప్రమాదం ఉంది. ఇది వరకు నిషిక, యువరాజ్ సురేశ్కి విడాకులు ఇచ్చి శాశ్వతంగా విడిపోమని కౌషికితో చెప్పారు కాబట్టి ఇద్దరూ ఈ సారి విడిపోతే విడాకులు జరిగే ప్రమాదం ఉంది. అయితే ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చిన తమ పోలీస్ తెలివితో పరిష్కరించే జగద్ధాత్రి, కేథార్ ఈ ఫంక్షన్ సజావుగా జరగడానికి ఏం చేస్తారో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















