(Source: ECI | ABP NEWS)
Jagadhatri Serial Today July 16th: జగద్ధాత్రి సీరియల్: జగద్ధాత్రి ముందే కేథార్, మేఘనల ప్రీవెడ్డింగ్ షూట్.. కౌషికికి కేథార్‌పై డౌట్!
Jagadhatri Today Episode మేఘన కేథార్‌తో ఫొటో, వీడియోల షూట్స్ చేయడం జగద్ధాత్రి అది చూసి కోపంతో రగిలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్ బసిరెడ్డికి కలిసి తాయారు గతం గురించి తెలుసుకుంటారు. కావ్య గురించి న్యూస్ వచ్చిన పేపర్ తీసుకుంటారు. తాయారుని జైలు పాలు చేస్తామని ఆ వార్త మీరు త్వరలోనే వింటారని అంటారు. ఇక ఇంటి దగ్గర వైజయంతి మొక్కలకు నీరు పోస్తుంటే యువరాజ్ చూసి అమ్మా ఏం చేస్తున్నావ్ అని అడిగి నిషికని పిలుస్తారు.
నిషిక, యువరాజ్ ఇద్దరూ వైజయంతితో కాబోయే ఎమ్మెల్యేవి నువ్వు ఇలా మొక్కలకు నీరు వేయకూడదు ఒక వేళ వేసినా మీడియా ముందే చేయాలని చెప్పి వైజయంతితో ప్రచారం అయినప్పుడు ప్రజల్ని పలకరించడం ఎమ్మెల్యేగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు. యువరాజ్ తల్లితో మన టైం స్టార్ట అయింది అమ్మ అని అంటాడు. మరోవైపు జగద్ధాత్రి, కేథార్‌లు పాత పేపర్ తీసుకొని కౌషికి దగ్గరకు వెళ్తారు. జగద్ధాత్రి కౌషికితో అమ్మని అరెస్ట్ చేసిన ఏసీపీ ఆఫీసర్ ఎవరో తెలుసుకొని స్టేట్‌మెంట్ తీసుకుంటే అమ్మ మీద పడిన నింద పోతుందని అంటుంది. కౌషికి సూపర్ అంటూనే మీకు ఎలా ఈ పేపర్ దొరికింది అంటే కేథార్ బసిరెడ్డి పేరు చెప్పబోతే జగద్ధాత్రి ఆపుతుంది.
కౌషికి తన టీమ్‌కి చెప్పి అతన్ని వెతికిస్తా అని అంటే కేథార్ మళ్లీ నోరు జారి మా టీమ్‌కి చెప్పాం వెతికే పనిలో ఉన్నారని అంటాడు. కౌషికి అనుమానంతో అడుగుతుంది. ఇద్దరూ కవర్ చేస్తారు. కౌషికి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ అన్నీ నాతో చెప్పినప్పటికీ నా దగ్గర ఏదో దాస్తున్నట్లు ఉన్నారని అనుకుంటుంది. ఇక జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ కౌషికి దగ్గర నోరు జారిపోతున్నాం ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనుకంటారు. తర్వాత కేథార్ జగద్ధాత్రి కోసం కాఫీ పెట్టి ఇస్తానని అంటాడు. మరోవైపు బామ్మ, మేఘన ఇంటికి వస్తారు. కేథార్‌తో మేఘనకు ఫొటో షూట్ చేయించడానికి బామ్మ తీసుకొస్తుంది.
మేఘన బామ్మతో కేథార్ ఒప్పుకుంటాడో లేదో అంటే ఇదంతా మొదలైంది నువ్వు విషం తాగుతా అని బెదిరించడం వల్లే కదా మళ్లీ విషం తాగుతా అని భయపెట్టు అని అంటుంది. మేఘన, బేబీ ఇంటి లోపలికి వెళ్తే సరికి కేథార్ కాఫీతో ఎదురు పడతాడు. మేఘన కేథార్ తన మీద ప్రేమతో తనకోసమే తీసుకొచ్చాడని అనుకొని చకచకా తాగేస్తుంది. జగద్ధాత్రి వచ్చి కేథార్‌ని కోపంగా చూస్తుంది. ఇక అందరికీ బామ్మ ఫొటో షూట్ గురించి చెప్తుంది. జగద్ధాత్రి నోరెళ్లపెడుతుంది. ఫొటోలు వద్దని గోల చేస్తుంది. దాంతో బామ్మ ఏదో నీ భర్తతో నా మనవరాలు ఫొటోలు తీసుకుంటున్నట్లు అలా అయిపోతున్నావ్ అని అంటుంది. నిషిక, వైజయంతి కావాలని కేథార్‌ని ఇరికించి ఫొటోలు తీసుకునేలా చేస్తుంది.
కేథార్, మేఘనకు ఇంట్లోనే ఫొటో షూట్ ఏర్పాటు చేస్తే జగద్ధాత్రితో పాటు అందరూ కూర్చొని చూస్తారు. జగద్ధాత్రి అయితే ఏకంగా కింద కూర్చొని అటు ఇటూ తిరుగుతూ రగిలిపోతుంది. కాచి, బూచిలు మేఘనకు నిజం చెప్పేమని అంటారు. మేఘన నడుం మీద చేయి వేసి స్టిల్ ఇవ్వమని ఫొటో గ్రాఫర్ చెప్తే జగద్ధాత్రి నోరెళ్ల బెట్టి దేవుడా అంటూ తల బాదుకునే సీన్ చూస్తే భలే నవ్వొస్తుంది. ఫొటోల తర్వాత పాటలు పెట్టి వీడియో షూట్ చేస్తారు. జగద్ధాత్రి గుండెల మీద చేయి వేసుకొని కొట్టుకుంటుంది. కేథార్ ఇద్దరి మధ్య ఇరుకున్నా అనుకుంటూనే ముఖం మాడ్చుకొని స్టెప్పులేస్తాడు. ఇదంతా మేం చూడలేం అని కాచి, బూచి వెళ్లిపోతారు.
నిషిక, వైజయంతి జగద్ధాత్రి దగ్గరకు వెళ్లి బాగా చేస్తున్నారు కదా అని రెచ్చగొడతారు. అలా చూస్తూ ఉండటం తప్ప నువ్వేం చేయలేవే ఈ రోజు ఈ స్టెప్‌లు ఆపలేనట్లు రేపు పెళ్లి కూడా ఆపలేవు అని అంటుంది నిషిక. దాంతో జగద్ధాత్రి కోపంగా పాటలు ఆపేసి ఇళ్లనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా అని అంటుంది. అవసరం అయితే బయటకు వెళ్లిపోమని అంటుంది. కేథార్ కూడా నాకు ఇష్టం లేదని ప్రతీ సారి ఇలా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని అంటాడు. దాంతో మేఘన తను చెప్పినట్లు చేయకపోతే విషం తాగేస్తా అని బెదిరిస్తుంది. జగద్ధాత్రి, కేథార్ వద్దని చెప్పినా మేఘన వినకుండా నాకు నచ్చినట్లు చేస్తావా చేయవాఅని అడుగుతుంది. దాంతో కేథార్ చేస్తానని అంటాడు. జగద్ధాత్రి దగ్గరకువెళ్లి మేఘన అన్నంత పని చేస్తుంది అందుకే కాసేపు డ్యాన్స్ చేసి ఏదో ఒకటి చెప్పి ఆపేస్తా అంటాడు. మళ్లీ డ్యాన్స్ చేస్తారు. జగద్ధాత్రి వెళ్లిపోతుంది. నిషిక, వైజయంతిలు జగద్ధాత్రి ఎక్కడికి వెళ్లిందా అని వెళ్తారు. జగద్ధాత్రి కిచెన్‌కి వెళ్లి కుంకుడు కాయల్ని మేఘన అంటూ చితక్కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?




















