Jagadhatri Serial Today January 2nd: కౌషికిని మీనన్ ఎందుకు అడ్డగిస్తాడు..? ఇంట్లో ఉండాల్సిన వజ్రాల కుంకుమ భరణి కౌషికి బ్యాగ్‌లోకి ఎలా వస్తుంది.?
Jagadhatri Serial Today Episode January 2nd: ఆత్మహత్యకు యత్నిస్తున్న శ్రీవల్లిని ధాత్రి కాపాడుతుంది. ఇంతలో వజ్రాల కుంకుమభరణి బయటపడి చేతులు మారుతూ కౌషికి బ్యాగ్‌లోకి చేరుతుంది.

Jagadhatri Serial Today Episode: శ్రీవల్లి కోసం ఇంట్లోవాళ్లందరూ వెతుకుతుండగా...శ్రీవల్లి మేడపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నిస్తుంది.అప్పుడే జగధాత్రి పరుగుపరుగున వెళ్లి ఆమెను ఆపి కిందకు తీసుకొస్తుంది. నీకు ఏ కష్టం వచ్చినా మేం అందరం అండగా ఉంటామని హామీ ఇచ్చాం కదా మళ్లీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని జగధాత్రి మందలిస్తుంది. నావల్ల ఇంట్లో మీ ఎవరికీ చెడ్డపేరు రాకూడదనే చనిపోవాలనకున్నట్లు చెబుతుంది. నువ్వు చచ్చిపోతే నీపై పడిన మచ్చ తొలగిపోతుందా అని కేదార్ కోప్పడతాడు. నిషిక కూడా శ్రీవల్లిపై మండిపడుతుంది. నువ్వు ఇక్కడ చచ్చిపోయి...మా అందరికీ చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్వు చేసిన తప్పు మేం ఎత్తి చూపామని ఇలా పగ తీర్చుకుందామని అనుకున్నావా అంటుంది. ఆ మాటకు జగధాత్రికి కోపం వచ్చి నిషి చెంప పగులగొడుతుంది. నన్నే కొడతావా అంటూ నిషి ధాత్రి మీదకు వెళ్లబోగా....యువరాజు గట్టిగా వారిస్తాడు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా మీరు అన్నమాటలకే శ్రీవల్లి ఆత్మహత్య చేసుకోబోయిందని అంటాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పని చేస్తున్నారని మండిపడతాడు. శ్రీవల్లిపై పడిన మచ్చ నిజమేనని తేలేవరకు ఇలాంటి మాటాలు ఆపండని ధాత్రి గట్టిగా హెచ్చరిస్తుంది.
యువరాజు పర్సులో నుంచి కార్డు కిందపడిపోగా...దాన్ని తీసుకునేందుకు టేబుల్ కింద చేయిపెట్టి లాగుతాడు.దీంతో వజ్రాలు ఉన్న కుంకుమ భరిణి బయటపడుతుంది. యువరాజు దాన్ని చూడకుండానే వెళ్లిపోతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన నిషి దాన్ని చూస్తుంది. ఇంతలో కేదార్,ధాత్రి అక్కడికి రాగా...వెంటనే వెళ్లి ఆ కుంకుమ భరణి కనిపించకుండా అడ్డుగా నిలుచుకుంటుంది. వాళ్లు అడ్డు తప్పుకోమన్నా తప్పుకోకుండా అక్కడే ఉంటుంది. దీంతో వాళ్లే పక్కకు తప్పుకుని వెళ్లిపోతారు. మళ్లీ తన కాలు తగిలి కుంకుమ భరణి కనిపించకుడా పోవడంతో నిషి కంగారుపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్‌కు ఆ కుంకుమ భరణి కనిపించడంతో చేతిలోకి తీసుకుని కిందకు తీసుకెళ్లి టేబుల్‌పై పెడతాడు.అది తీసుకునేందుకు నిషి పరుగున రాగా...అప్పుడే బయట నుంచి కౌషికి వస్తుంది. దీంతో నిషి ఆగిపోతుంది. ఏంటి అంత కంగారుగా ఉన్నావని నిలదీస్తుంది. ఇంతలో కౌషికి ఛార్జర్ అనుకుని వజ్రాలు ఉన్న కుంకుమ భరణి తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లిపోతుంది. నిషి కంగారు చూసి ఏమైందని వైజయంతి అడగ్గా...వ్రతం రోజు కనిపించకుండా పోయిన కుంకుమ భరణి వదిన తీసుకెళ్తోందని చెప్పడంతో ధాత్రి వింటుంది. అదే సమయంలో పని ఉందని నిషి బయటకు వెళ్లడంతో వారికి అనుమానం రెట్టింపవుతుంది.
బయటకు వెళ్లిన నిషిక మీనన్‌కు ఫోన్ చేసి వజ్రాలు కౌషికి బ్యాగ్‌లో ఉన్న కుంకుమభరణిలో ఉన్నాయని చెబుతుంది. దీంతో మీనన్ తన మనుషులతో కలిసి వెళ్లి కౌషికిని అడ్డగిస్తాడు. దీంతో ఆమె తన కారును వెనక్కి తిప్పి వేగంగా వెళ్లిపోతుంది. దారిలోనే జగధాత్రికి ఫోన్ చేసి మీనన్ వెంటపడుతున్నాడని చెబుతుంది. నువ్వేమీ భయపడొద్దని...నేనే జేడీ టీంకు కాల్ చేసి చెబుతానని అంటుంది. వెంటనే రమ్యకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంది. ఇంతలో మీనన్ అడ్డదారిలో ముందుకు వచ్చి కారును అడ్డుగా పెడతాడు. వెనక,ముందు తన మనుషులు చుట్టుముట్టడంతో కౌషికి ఎటూ వెళ్లలేకపోతుంది. దీంతో కౌషికి గన్ తీసుకుని కారు దిగుతుంది. మీనన్‌కు గన్ గురిపెట్టి బెదిరిస్తుంది. దీంతో మీనన్ తన కూతురుని తీసుకురమ్మని మనుషులకు చెబుతాడు. వాళ్లు కారులో ఉన్న బ్యాగ్ తీసి అందులోని వజ్రాలు బయటకు తీస్తారు.





















