అన్వేషించండి

Jagadhatri Serial Today September 17th: ‘జగధాత్రి’ సీరియల్‌: షర్మిలను సేవ్ చేసిన ధాత్రి, కేదార్ – ఫైల్ వెతకడానికి పర్మిషన్ ఇచ్చిన షర్మిల

Jagadhatri Today Episode: షర్మిల టాగూర్ క్యాంపులోకి వెళ్లిన నిషిక, కాచి, బూచిలను పట్టుకున్న పోలీసులు కౌషికికి చూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: షర్మిల ఠాగూర్‌ క్యాంపులో నిషిక వాళ్లు ఉన్నారని తెలుసుకున్న ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. ఇంతలో నిషిక, కాచి పరుగెత్తుకు వెళ్లి ఒక టెంట్‌ లో దాక్కుంటారు. అ టెంట్‌ ను పోలీసులు చుట్టుముడతారు. ధాత్రి, కేదార్‌ అటువైపు వెళ్తారు. ఇంతలో షర్మిల టాగూర్‌.. నిషిక వాళ్లు ఉన్న టెంట్‌ దగ్గరకు వెళ్లి వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో నిషిక బయటకు వస్తుంది. లాండ్ మైన్‌ మీద కాలు పెడుతుంది.

కాచి: అయ్యో ఇవాళ నిషిక అయిపోయింది.

షర్మిల: కదిలితే కాల్చేస్తా..  లేదంటే మర్యాదగా లొంగిపో..

నిషిక: నేను లొంగి పోతాను. నన్నేం చేయోద్దు..

ధాత్రి: మేడం ఆగండి మీరిద్దరూ లాండ్‌ మైన్‌ మీద కాలు పెట్టారు. వీళ్లిద్దరూ తప్ప అందరూ కొంచెం వెనక్కి వెళ్లండి. మేడం చెప్పండి ప్లీజ్‌. మీరు కూడా కదలకండి. కదిలారు అంటే ప్రాణాలు పోతాయి.

నిషిక: అంటే నేనిప్పుడు చచ్చిపోతానా? నేను చచ్చిపోను నేను ఇంకా చాలా చేయాలి.

ధాత్రి: మేడం ఇంకెక్కడైనా పెట్టారేమో చూడండి.

కేదార్‌: ఎవరైనా బాంబ్‌ స్వ్కాడ్‌ కు ఫోన్‌ చేయండి.

కౌషికి: జగధాత్రి, కేదార్‌ ఎక్కడికి వెళ్లారు ఇంకా రాలేదేంటి? ఫోన్‌ చేస్తాను.

నిషిక: మీరు బాంబు స్వ్కాడా..?

కేదార్‌: కాదు.

నిషిక: మరి ఇవి బాంబ్స్‌ అని మీకెలా తెలిసింది.

కేదార్‌: ఒకసారి కాలు తీసి చూడు నీకు కూడా తెలుస్తుంది.

ధాత్రి: మీ కాలి చుట్టూ మట్టి తొవ్వుతారు. ప్లీజ్‌ కదలకుండా అక్కడే ఉండు.

 అని మాట్లాడుకుంటుండగా ఒక జవాన్‌ వచ్చి బాంబు స్వ్కాడ్‌ రావడానికి ఇంకా రెండు గంటల పడుతుందట అని చెప్తాడు. దీంతో ధాత్రి,  కేదార్‌ బాంబు తీయడానికి నిషిక కాలు మట్టిని తవ్వుతారు. తర్వాత మెల్లగా బాంబును డిస్‌ యాక్టివేట్‌ చేస్తారు. దీంతో నిషిక అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత వెళ్లి షర్మిల టాగూర్‌ కాలు కింద  మట్టిని తవ్వి చూసి ఇది ఆటోమేటిక్‌ బాంబు అని మెల్లగా అక్కడి నుంచి షర్మిల టాగూర్‌ తప్పిస్తారు. 

కేదార్‌: జేడీ నువ్వు మేడంను తీసుకెళ్లు.. నేను చూసుకుంటాను.

ధాత్రి: నో కేడీ..

కేదార్‌: జేడీ నా మాట విను నేను జంప్‌ చేస్తాను. నువ్వు వెళ్లు.

   అంటూ ధాత్రిని తోస్తాడు కేదార్‌. ధాత్రి, షర్మిల టాగూర్‌ ను తీసుకుని పక్కకు వెళ్తుంది. కేదార్‌ అక్కడి నుంచి జంప్‌ చేయగానే బాంబు పేలుతుంది. గాయాలతో కేదార్‌ కిందపడిపోయి ఉంటాడు. ధాత్రి వెళ్లి కేదార్‌ను పైకి లేపుతుంది. ఇంతలో షర్మిల వచ్చి పారిపోయిన ఆ ఇద్దరిని అరెస్ట్ చేయమని చెప్తుంది. తర్వాత మీరు ఎవరు అంటూ ప్రశ్నించి.. జేడీ, కేదార్‌ ల ముఖానికి ఉన్న మాస్క్‌ తీసి చూసి షాక్‌ అవుతుంది. దీంతో ధాత్రి, కేదార్‌ లు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆ ఫైల్‌ తనకు ఎంతో అవసరం అని చెప్పగానే షర్మిల టాగూర్‌ ఎమోషనల్‌ అవుతుంది.

ధాత్రి: మీ ఇన్ఫిరేషన్‌ తోనే ఇంతదాకా వచ్చాము మేడం. మీరే హెల్ఫ్ చేయాలి మేడం.

కేదార్‌: ఫ్లీజ్‌ మేడం మీరు ఒక గంట పర్మిషన్‌ ఇస్తే ఆ ఫైల్‌ తీసుకుని ఇక్కడి నుంచి వెల్లిపోతాము. ఎవ్వరికీ ఏ ప్రాబ్లమ్‌ రానివ్వము.

 అని చెప్పగానే షర్మిల టాగూర్‌ , ధాత్రి, కేదార్‌ లను మెచ్చుకుంటుంది. మీకు సాయం చేయకుండా ఉండలేను అంటూ రూల్స్‌ ఒప్పుకోకపోయినా మీకు పర్మిషన్‌ ఇస్తున్నాను. వెళ్లి మీ అమ్మ చావుకు కారణం అయిన వారిని కనిపెట్టు అని చెప్పగానే ధాత్రి హర్ట్‌ ఫుల్‌ గా థాంక్స్‌ చెప్తుంది. అలాగే నిషిక వాళ్లను వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అంటుంది షర్మిల. నేను వెళ్లి కౌషికి దగ్గర మేనేజ్‌ చేస్తాను మీరు వెళ్లండి అని చెప్పి కౌషికి దగ్గరకు నిషిక, కాచి, బూచిలను తీసుకెళ్తుంది. దీంతో కౌషికి వాళ్లను కోపంగా చూస్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget