Easy Tips for Lizards: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్
Easy tips for lizards problem: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? అయితే వాటిని ఇంట్లోంచి తరిమికొట్టే అయిదు సులభమైన మార్గాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Easy tips for lizards: గోడ మీద బల్లులను చూస్తేనే కొంత మందికి కంపరంగా అనిపిస్తుంది. మరికొందరైతే బల్లులను చూడగానే దెయ్యాన్ని చూసినట్లుగా భయపడిపోతుంటారు. అటువంటి బల్లులు గోడ మీదే కాకుండా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే కిచెన్ లో దూరి పాత్రల మీద తిరుగుతుంటాయి. అలా తిరుగుతున్న బల్లలను చూస్తే.. ఫుడ్డు తినడం మాట దేవుడెరుగు.. వాంతులు చేసుకునే వాళ్లు లేకపోలేదు. ఈ బల్లుల బెదడ ఎలా తప్పించుకోవాలిరా దేవుడా అంటూ తలలు పట్టుకునేవారు కొందరుంటారు. ఇక ఏవేవే రెమిడీలు చేసినా బల్లుల ఇంటి గోడను పట్టుకుని వేలాడుతుంటే ఊసూరుమనే వాళ్లు మరికొందరుంటారు. అలాంటి వాళ్ల కోసమే.. బల్లులను వెళ్లగొట్టే 5 సులభమైన మార్గాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో దూరిన బల్లులను బయటకు తరిమేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన వారుంటారు. ఎన్ని రకాలుగా ప్రత్నించినా బల్లుల ఇంట్లోంచి పోయినట్టే పోయి మళ్లీ వస్తుంటాయి. అవి ఎలా వస్తాయో.. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అటువంటప్పుడు ఈ కింది సులువైన మార్గాలను ఉపయోగించి బల్లులను ఇంట్లోంచి తరిమేయండి. ఇంకా చెప్పాలంటే ఇవే చిట్కాల ద్వారా బల్లులు ఇక ఇంట్లోకి రాకుండా కూడా చేసుకోవచ్చట.
కోడిగుడ్డు: అవును కోడిగుడ్డును ఉపయోగించి ఇంట్లో తిష్ట వేసిన బల్లులను బయటకు తరిమేయవచ్చట. ఇంట్లో గుడ్ల కర్రీ చేసుకున్నాక మిగిలిపోయిన గుడ్డు పెంకులను పారేయకుండా వాటిని జాగ్రత్త ఎండలో ఆరబెట్టాలి. తర్వాత ఆరిన గుడ్డు పెంకు లోపల కాటన్ వేసి అందులో కొంచెం డెటాల్ కానీ పెట్రోల్ కానీ పోసి గోడలకు అక్కడక్కడ మేకులు కొట్టి తగిలిస్తే ఆ వాసనకు బల్లులు ఇంట్లోంచి తట్టాబుట్టా సర్దుకుంటాయట. ఇలా మూడు రోజులకోసారి గుడ్డు పెంకులను మారుస్తూ ఉంటే బల్లులు ఇక ఎప్పటికీ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వవట.
దోసకాయ: మనం వంటలలో వాడే దొసకాయ కూడా బల్లులకు ప్రధాన శత్రువట. దోసకాయ వాసనను బల్లుల తట్టుకోలేవట. ఆ వాసనకు అవి పలాయనం చిత్తగిస్తాయట. ఇందుకోసం మీరు చేయాల్సింది కేవలం కొన్ని దోసకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బల్లులు ఎక్కువగా తిరిగే చోట. లేదంటే ఇంట్లో అంతటా అక్కడక్కడ పెడితే బల్లులకు ఇక నిద్రపట్టదట. ఇదే విధంగా ప్రతి రోజు చేస్తుంటే బల్లుల మళ్లీ మీ ఇంటి గుమ్మం తొక్కాలంటే వణికిపోతాయట.
కాఫీ పౌడర్: బల్లులను తరిమేసే మరో మంచి గుణాలు కాఫీ పౌడర్ లో ఉన్నాయట. మీరు చేయాల్సిందల్లా కాఫీ పౌడర్ లో కొంచెం పొగాకు కలిపి ఇంట్లో మూలల దగ్గర బల్లుల ఎక్కువ తిరిగే చోట పెట్టాలట. అంతే బల్లలు తోక కాలిన కోతిలాగా అక్కడి నుంచి పారిపోతాయట. ఇదే రెమెడీ క్రమం తప్పకుండా చేస్తే ఇక బల్లల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లేనట.
నిమ్మకాయ: నిమ్మకాయ కూడా ఇంట్లో బల్లులను తరిమేసేందుకు ఎంతో ఉపయోగకారిగా పని చేస్తుందట. మీరు చేయాల్సిందల్లా.. ఒక స్ర్పే బాటిల్ తీసుకుని అందులో కొంచెం నీళ్లు తీసుకుని నిమ్మరసం కలిపి ఇంట్లో బల్లులు ఎక్కడ ఉంటాయో అక్కడ స్ర్పే చేయాలట. అంతే ఇక మీ ఇంట్లో ఒక్క బల్లి కనబడదట.
వెల్లుల్లి మరియు లవంగాలు: ఇంట్లో బల్లులను తరిమేసే మరో మార్గం వెల్లుల్లి, లవంగాలు. వీటి ఘాటైన వాసన బల్లులను మీ ఇంటి నుంచి దూరంగా తరిమేస్తుందట. కిటికీలు, తలుపులు మరియు వంటగదిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, లవంగాలను ఉంచడం ద్వారా ఇంట్లోకి ఒక్క బల్లి కూడా రాదట.
ఇక పైనల్ గా మీరు ఈ చిట్కాలు పాటించినా ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే బల్లులే కాదు క్రిమికీటకాలు, ఈగలు, దోమలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని చిట్కాలు పాటించినా ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలి. అలాగే బల్లులను తరిమేయడానికి భయంకరమైన రసాయనాలు వాడి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కన్నా ఈ రెమెడీలు పాటించడం బెటర్.
ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే