అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vastu Dosham: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే

VASTU DOSHAM: వాస్తు దోషం మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందా? వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి..? తెలుసుకున్న వాస్తు దోషాన్ని ఎలా నివారించుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Vastu Dosham Tips In Telugu: వాస్తు దోషం మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుందా..? కోలుకోలేని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుందా..? వాస్తు దోషం కారణంగానే కేరీర్‌ లో ఒక్కసారిగా డౌన్‌ ఫాల్‌ మొదలవుతుందా? జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాల్సిన వ్యక్తులు  ఉన్న స్థితలోనే ఆగిపోవడానికి వాస్తు దోషమే కారణం అనుకుంటున్నారా? అసలు వాస్తు దోషం ఉంటే మనిషి నిజంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటాడా? అసలు వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి..? తెలుసుకున్న వాస్తు దోషాన్ని ఎలా నివాలరించుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

 మనదేశంలో వాస్తు శాస్త్రంపై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉంటుంది. చిన్న రేకుల షెడ్డు నుంచి కోట్ల రూపాయల భవనాలు కట్టాలన్నా వాస్తు చూసే కడతారు. వాస్తుకు లేకపోతే ఆ ఇంట్లో సుఖఃశాంతులు ఉండవని.. అందులో నివసించే వారి జీవితంలో అప్‌ అండ్‌ డౌన్‌ పాల్స్‌ ఉంటాయని.. వారి జీవితం మొత్తం ముళ్లబాటగా మారిపోతుందని నమ్ముతుంటారు. అయితే ఇండ్లు వాస్తుకు చూసి కట్టుకున్నా కూడా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు చూడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వస్తువుల అరమరికలోనూ వాస్తు చూడకపోతే విపరీతమైన నెగెటివ్‌ ఎనర్జీని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దాని కారణంగా అతని జీవితం కష్టాలతో నిండి ఉంటుందట.  

ALSO READ: గరిక, పసుపు, నిమ్మకాయ ఉంటే మీ ఆర్థిక, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇట్టే మాయమైపోతాయి!

మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే.. మీరు చేసే  పనికి పదే పదే అడ్డంకులు ఎదురవుతాయట. ఎంత మంది కష్టపడి పని చేసినా… ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుందట. అలాగే విపరీతమైన డబ్బు సంపాదించినా అది నిలవకపోతే ఇంట్లో వాస్తు దోసం ఉన్నట్టేనట. ఇంట్లో వాళ్లు తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నా కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనట. ఇక మానసిక ఆందోళన, ప్రతి చిన్న విషయానికి టెన్షన్‌ పడటం. అనుకోకుండా కుటుంబంలో గొడవలు తలెత్తడం లాంటివి జరుగుతున్నా.. కూడా మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లేనట.  

ఇక ఏ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఎలాంటి పరిణామాలు జరగుతాయో కింద తెలుసుకుందాం.

తూర్పు దిక్కు దోషం: ఇంటికి తూర్పు దిక్కులో ఏదైనా వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యులకు ఉదర సంబంధిత వ్యాధుల వస్తాయట. గ్యాస్ట్రిక్‌ సమస్య కూడా అలాంటిదేనట. ఇక ఈ  లోపాన్ని తొలగించడానికి ఇంట్లో  తూర్పు వైపు ఉన్న గోడపై సూర్య యంత్రాన్ని అమర్చుకోవాలట. అప్పుడు వాస్తు దోషం పోతుందని నిపుణులు చెప్తున్నారు.

పడమర దిక్కు దోషం: ఇంటికి పశ్చిమ భాగం తక్కువగా ఉన్నట్లయితే లేదా ప్రధాన ద్వారం పశ్చిమ దిశలో ఉన్నట్లయితే, కుటుంబ పెద్ద మరియు పిల్లలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందట. పిల్లల చదువులకు ఆటంకం, ఇంట్లో ధన నష్టం కలగవచ్చట. ఈ దోషం తొలగిపోవాలంటే పడమర  వైపు ఉన్న గోడపై వరుణ యంత్రాన్ని అమర్చుకోవాలని అలాగే పడమర వైపు  అశోక చెట్టును పెంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

ఉత్తర దిక్కు దోషం:  ఇంటికి ఉత్తర దిశలో వేదికలు లేకుంటే కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ లోపాన్ని తొలగించడానికి, పూజా స్థలంలో బుధ యంత్రాన్ని  ప్రతిష్ట చేసుకుని రోజూ పూజించాలట. ఇక  ప్రవేశ ద్వారం వద్ద గాలి గొట్టం అమర్చుకుంటే ఉత్తర దిక్కు వాస్తు దోషాలు శాంతిస్తాయట.

దక్షిణ దిక్కు దోషం:  ఇంట్లో కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఆ ఇంటికి దక్షిణ దిక్కు వాస్తు దోషం ఉన్నట్లు అర్థం చేసుకోవాలట. అయితే ఈ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంటి పూజగదిలో ఆంజనేయస్వామి మూల యంత్రాన్ని ప్రతిష్టించుకుని రోజూ పూజించాలట.

NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక ఆంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు ఏడీపీ దేశం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏబీపీ దేశం, ఏబీపీ నెట్వర్క్ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.  

ALSO READ: సాంబ్రాణి ధూపం ఉపయోగాలు తెలుసా? ఆ రోజు ధూపం వేస్తే మీకు లక్ష్మీకటాక్షమే

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget