గణేష్ నిమజ్జనంలో పాల్గొనేవారు ఇవి చేయకండి

Published by: RAMA

నిమజ్జనం సందడి

నిమజ్జనంలో పాల్గొనేవారు సింథటిక్ దుస్తులు అస్సలు ధరించవద్దు...శరీరానికి అసౌకర్యం మాత్రమే కాదు ఇలాంటి సమయంలో ప్రమాదం కూడా

నిమజ్జనం సందడి

క్రాకర్స్ కాల్చేవారికి దూరంగా ఉండండి.. పేల్చిన క్రాకర్స్ కూడా ఎటువైపు వెళుతున్నాయో చూసుకోండి..లేదంటే కాల్చుకుని తర్వాత బాధపడాల్సి ఉంటుంది

నిమజ్జనం సందడి

నిమజ్జనం వేడుకలలో పిల్లలుంటే చాలా జాగ్రత్తగా గమనించండి..నీటివైపు పోనీయవద్దు..తొక్కిసలాడలో కిందపడితే మళ్లీ లేవలేరు...అందుకే పిల్లల్ని ఈ వేడుకలకు దూరంగా ఉంచడం మంచిది

నిమజ్జనం సందడి

వేడుక పేరుతో అర్థరాత్రి వరకూ నిమజ్జన వేడుకలోనే ఉండిపోవద్దు..కాస్త తొందరగానే వేడుకలు ముగించుకుని ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి

నిమజ్జనం సందడి

విగ్రహాన్ని లోపలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నదులు, సముద్రాల లోపలకు వెళ్లిపోవద్దు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం..ముందే జాగ్రత్త పడండి

నిమజ్జనం సందడి

మీ విలువైన వస్తువులు అసలు తీసుకెళ్లొద్దు..తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తే ఎవరికీ అప్పగించవద్దు..మీరే జాగ్రత్తగా భద్రపరుచుకోండి

నిమజ్జనం సందడి

మీరు నిమజ్జనం చేసే నీటిలో ఉండే కాలుష్య ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది..అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోండి..ఎక్కువ సేపు ఆ నీటిలో ఉండిపోవద్దు

నిమజ్జనం సందడి

ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత సమస్యలున్నవారు ఈ వేడుకలను దూరం నుంచి చూసి ఆనందించడమే మంచిది.. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు