Jagadhatri Serial Today October 5th: ‘జగధాత్రి’ సీరియల్: మాల వేసిన యువరాజ్ – అబ్బులును ఎంక్వైరీ చేసిన ధాత్రి, కేదార్
Jagadhatri Today Episode: విగ్రహంలో ఉన్న డబ్బులు కొట్టేసేందుకు యువరాజ్ మాల వేస్తాడు. దీంతో బూచి, కేదార్ కూడా మాల వేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ధాత్రి అబ్బులు బండ నెంబర్ రమ్యకు పెట్టి ఆ బండి డీటెయిల్స్ కనుక్కుని నాకు పంపు అని చెప్తుంది. రమ్య సరే అంటుంది. తర్వాత ఆ బండి డీటెయిల్స్ తెలిస్తే ఈ కేసులో మనం ముందుకు వెళ్ళగలం అంటుంది ధాత్రి. తన తల్లికి చావులోనైనా శాంతిని ఇవ్వాలని ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జగధాత్రి కోసమైనా నువ్వు గెలవాలి జేడీ అంటాడు కేదార్. మరోవైపు అందరూ పూజ దగ్గరకు రాగానే అక్కడ యువరాజ్ పూజ చేస్తూ కనిపిస్తాడు. అందరూ షాక్ అవుతారు.
వైజయంతి: ఒరే అబ్బోడా ఏందిరా ఇదంతా..
యువరాజ్: మాల వేసుకున్నాను అమ్మా
కౌషికి: ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి యువరాజ్ సడెన్ గా
నిషిక: అంటే వదిన నిన్ననే ఒక స్వామిజీని కలిస్తే మా దాంపత్యంలో కొన్ని దోషాలు ఉన్నాయి. అందుకే ఇంకా పిల్లలు పుట్టడం లేదు. యువరాజ్ తో మాల వేయించి రాత్రి, పగలు స్వామి సన్నిధిలో ఉంటే దోషం పోయి పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు.
ధాత్రి: అందుకే యువరాజ్ మాల వేసుకున్నాడా? నిషి
నిషిక: కరెక్టు
కేదార్: ఇదంతా డబ్బు కోసం ఆడుతున్న నాటకం ధాత్రి.
ధాత్రి: అవును కేదార్ నిషి కూడా యువరాజ్‌కు సపోర్టు చేస్తుందంటే నిషికకు డబ్బున్న విషయం మాత్రమే చెప్పి ఎవరిదో చెప్పలేదన్నమాట.
బూచి: అమ్మా నా బామ్మర్ధి మీ అన్నయ్యకు వదినకు ఎన్ని దొంగ బుద్దులే మాల వేసుకున్నాడు కాబట్టి యువరాజ్ ఎప్పుడు ఆ దేవుడి పక్కనే ఉంటాడు.
కాచి: ఎవరూ లేని టైం చూసి విగ్రహం నుంచి డబ్బులు తీస్తాడు. అదే వాడి ప్లాన్ అయ్యుంటుంది.
కౌషికి: మంచి పని చేశావు యువరాజ్ దేవుడి సేవ చేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
నిషిక: అవును వదిన టిఫిన్ దగ్గర నుంచి భోజనం కూడా ఇక్కడే. రాత్రి పడుకునేది కూడా దేవుడి దగ్గరే. ఇక యువరాజ్ ఉంటాడు కాబట్టి దొంగల భయం కూడా ఉండదు.
ధాత్రి: దొంగనే కాపలా కాస్తున్నాడన్నమాట.
కేదార్: ఏదో ఒకటి చేసి మనం యువరాజ్ ను ఆపాలి ధాత్రి. లేకుంటే ఎవరూ లేని టైం చూసి యువరాజ్ డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు.
ధాత్రి: వదిన పూజ స్టార్ట్ చేస్తున్నారు కదా మేము వెళ్లి ప్రసాదాలు తీసుకొస్తాము
అని లోపలికి వెళ్తారు. కాచి, బూచి కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లి ప్రసాదం తీసుకొచ్చిన ధాత్రిని కౌషికి, కేదార్ ఎక్కడని అడుగుతుంది. అదిగోండి వదిన అని చూపిస్తుంది. కేదార్ మాల వేసుకుని వస్తుంటాడు. కేదార్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో బూచి కూడా మాల వేసుకుని వచ్చి కేదార్ ను చూసి నువ్వు కూడా మాల వేసుకున్నావా? అంటే నీకు కూడా సీక్రెట్ తెలిసిపోయిందా? అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
కౌషికి: ఏం సీక్రెట్ మరిది గారు
కాచి: అంటే అక్కా అది పిల్లల కోసం మాల వేసుకుంటున్నారు కదా అదే సీక్రెట్.
వైజయంతి: నిషిక అందరి ముందు చెప్పింది కదా అది సీక్రెట్ ఎలా అవుతుంది.
బూచి: అది అత్తయ్యా ఊరికే అబద్దం చెప్పాను.
యువరాజ్: బావా అసలు నువ్వెందుకు మాల వేసుకున్నావు.
బూచి: నువ్వు దేని కోసం వేసుకున్నావో నేను అందుకోసమే వేసుకున్నాను.
అని బూచి చెప్పగానే ఇంట్లో నేను తప్ప ఎవరు వేసుకోకూడదు. మీరిద్దరూ వెళ్లి మాల తీసేసిరండి అంటాడు యువరాజ్. దీంతో ధాత్రి, కాచి వాళ్లిద్దరూ మాల తీసే ప్రసక్తే లేదని చెప్తారు. గొడవ వద్దు కానీ పూజ చేద్దాం రండి అని కౌషికి పిలవగానే అందరూ వెళ్లి పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత వీళ్లంతా డబ్బు తీసుకుపోకుండా ప్లాన్ చేయాలి. అనుకుంటారు ధాత్రి, కేదార్. మరోవైపు కేదార్, బూచి మాల తీసేసేలా చేయాలని నిషిక, యువరాజ్ ప్లాన్ చేస్తుంటారు. తర్వాత ధాత్రి, కేదార్ వెళ్లి అబ్బులును ఎంక్వైరీ చేస్తారు. అబ్బులు చెప్పిన గోపాల కృష్ణ ఇంటికి వెళ్తారు. ఆయన చనిపోయి 20 ఏళ్లు అవుతుందని ఆయన భార్య చెప్పడంతో ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్: సామంత్, అనామికల మధ్య గొడవ – రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న
Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం