Jagadhatri Serial Today October 3rd: ‘జగధాత్రి’ సీరియల్: డబ్బుల గురించి తెలుసుకున్న నిషిక – కీర్తిని కింద పడేసిన వైజయంతి
Jagadhatri Today Episode: ఆఫీసు నుంచి రాఘవరావు ఫోన్ చేయడంతో తమ బండారం బయటపడుతుందని వెంటనే ఎలాగైనా కౌషికిని ఆపాలని వైజయంతి, నిషిక నాటకం ఆడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: నిషికకు అసలు నిజం చెప్పాలనుకుంటాడు యువరాజ్. ఇప్పుడు నిషికకు నిజం చెప్తే నాకు హెల్ప్ అవుతుంది అనుకుని ఆ విగ్రహంలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. మా ఫ్రెండ్ ఐటీ ప్రాబ్లమ్స్ అని దాచి పెట్టమని నాకు ఇచ్చాడు. అవి తిరిగి వాడికి ఇస్తే మనకు 25 శాతం డబ్బులు వస్తాయి అని చెప్పగానే నిషిక నువ్వు చెప్పేది నిజమా? అంటుంది. నిజమని యువరాజ్ చెప్తాడు. యువరాజ్ మాటలను కాచి, బూచి వింటారు. వాళ్లకంటే ముందే ఆ కోట్ల రూపాయలు కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. మరోవైపు ధాత్రి తాను పట్టుకున్న ఫైల్ గురించి ఆలోచిస్తుంది.
కేదార్: ఏం చేస్తున్నావు ధాత్రి.
ధాత్రి: ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు కేదార్. అసలు మా అమ్మ చావుకు పెద్దమామయ్యా గారికి సంబంధం ఏంటి? నిషిక, యువరాజ్ ల పెళ్లి వరకు వాళ్ల గురించి వినడమే కానీ ఎక్కడా చూడలేదు. అలాంటి వదిన వాళ్ల నాన్నకి, మా అమ్మ కాపాడాలి అనుకున్న ఈ సాక్ష్యానికి సంబంధం ఏంటి?
కేదార్: ఎంత ఆలోచించినా అదే అర్థం కావడం లేదు ధాత్రి. ఆలోచించే కొద్ది ప్రశ్నాలు పెరుగుతూనే ఉన్నాయి.
ధాత్రి: సమాధానం దొరికింది అనుకున్న ప్రతిసారీ మరో ప్రశ్న ఎదురవుతూనే ఉంది కేదార్. అసలు ఇదంతా ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు నిజం తెలుసుకుంటానో నాకే తెలియడం లేదు.
కేదార్: ఇదెంత ప్రమాదమో తెలిసినా.. అత్తయ్యగారు ఈ ఫైల్ తో అందరి నిజాలు భయటపెట్టాలనుకున్నా ప్రమాదంలో ప్రాణాలు పోతాయనుకున్నా.. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు.
ధాత్రి: వదిన కడుపులో ఉన్న బిడ్డు కాపాడాల్సి బాధ్యత కూడా మన మీదే ఉంది కేదార్.
కేదార్: అవును ధాత్రి. మనల్ని దాటి అక్కకి ఏ హాని వెళ్లకూడదు అంటే మనం ఎప్పుడూ అక్కని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
అని ఇద్దరూ డిసైడ్ అవతారు. తర్వాత ఇంట్లో పూజకు టైం అవుతుందని వెళ్లిపోతారు. అందరూ పూజ చేస్తుంటారు. నిషిక, కాచి విగ్రహంలోని డబ్బు గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో ధాత్రి హారతి ఇస్తుంది. విగ్రహానికి హారతి దగ్గరగా ఇస్తుందని నిషిక, కాచి, బూచి కంగారుపడుతూ డబ్బులు కాలిపోతాయి జాగ్రత్త అంటారు. దీంతో అందరూ షాక్ అవుతారు.
ధాత్రి: నేను విగ్రహానికి హారతి ఇస్తుంటే డబ్బులు కాలిపోతాయని అంటారేంటి?
కౌషికి: అడుగుతుంటే మాట్లాడరేంటి? ఎవరో ఒకరు చెప్పండి.
ధాత్రి: అదిగోండి తడబడుతున్నారు కానీ ఎవరూ చెప్పడం లేదు.
నిషిక: నేను అన్నది విగ్రహం మీద వేసిన డబ్బుల గురించి చెప్పాను. కాలిపోతాయి కాస్త చూసుకో అన్నాను.
బూచి: సేమ్ మ్యాటర్ సిస్టర్. కాపీ పేస్ట్ చేసుకో అంతే..
యువరాజ్: కాచి, ఏంటి డబ్బుల గురించి తెలిసిపోయిందా? ఏంటి? ( అని మనసులో అనుకుంటాడు.)
బూచి: బామ్మర్ధి ఏంటి జీవితంలో మొదటిసారి బుర్రకు ఏదో పని చెప్తు్న్నట్లు ఉన్నాడు. (అని మనసులో అనుకుంటాడు.) సిస్టర్ హారతి అంత దగ్గరకు తీసుకువెళ్లకు
కేదార్: ఈ నలుగురిని చూస్తుంటే ఎందుకో డౌట్ గా ఉంది ధాత్రి. విగ్రహం లోపల ఉన్న డబ్బు గురించి తెలిసిపోయిందా? ఏంటి?
ధాత్రి: అవును కేదార్. అందుకే హారతి ఇవ్వగానే అందరూ డబ్బు గురించి కంగారుపడుతున్నారు. నువ్వు అందరి మీద ఓ కన్నేసి ఉంచాలి.
అని మాట్లాడుకుంటారు. మరవైపు రాఘవరావు కౌషికికి ఫోన్ చేస్తాడు. ఫోన్ లోపల చార్జింగ్ పెట్టుకుని ఉండటంతో కీర్తి వచ్చి కౌషికికి చెప్తుంది. కౌషికి లోపలికి వెళ్లబతుంటే వైజయంతి అనుమానంగా ఆపుతుంది. కాచిని లోపలికి పంపించి కౌషికి ఫోన్ చూసి రమ్మని చెప్తుంది. కాచి వెళ్లి చూసి వచ్చి ఆఫీసు నుంచే పెద్దమ్మ అని చెప్తుంది. కౌషికి లోపలకు వెళ్లి రాఘవరావుకు ఫోన్ చేయబోతుంటే బయటి నుంచి వస్తున్న కీర్తిని నిషిక కిందపడేస్తుంది. కౌషికి పరుగెత్తుకు వచ్చి కీర్తిని లేపబోతుంటే కడుపులో పెయిన్ రావడంతో కేదార్, ధాత్రి, కౌషికిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్తారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం