Jagadhatri Serial Today October 22nd: ‘జగధాత్రి’ సీరియల్: టోనీని కాల్చేసిన కేదార్ – నొప్పితో కిందపడిపోయిన సుధాకర్
Jagadhatri Today Episode: అభిని చంపేస్తున్న మీనన్‌ను కేదార్ షూట్ చేస్తాడు. ఇంతలో అడ్డువచ్చిన టోనీకి బుల్లెట్ తగలడంతో చనిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: టోనీ కోపంగా ధాత్రిని కొట్టడానికి వెళితే తప్పించుకుంటుంది. వాళ్లను వదిలేయమని చెప్తుంది. వినయపోయే సరికి ధాత్రి అటాక్ స్టార్ట్ చేస్తుంది. జేడీ టీంకు మీనన్ టీంకు పైటింగ్ జరుగుతుంది. ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి మీనన్ రౌడీలను చిత్తుగా కొడుతుంటారు. ఇంతలో టోనీ వచ్చి కేదార్‌ను కొట్టి మాస్క్ తీసి చూస్తాడు.
టోనీ: నువ్వా..
ధాత్రి: ఆరాధ్య పద..
టోనీ: దేవా.. గన్ ఇవ్వు గన్ ఇవ్వు.. ఎవరైనా దొరికారా..? వెళ్లు వెళ్లి వెతుకు.
మీనన్: ఎవరు ఎవర్ని వెతకాల్సిన అవసరం లేదు.
టోనీ: అవసరం లేదా? ఎందుకు అన్నయ్యా వాళ్లను అలాగే వదిలేస్తావా?
మీనన్: వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు.
టోనీ: వెతుక్కుంటూ వస్తారా? ఎలా..?
మీనన్: వీళ్ల కోసం వీళ్ల కోసం ( అభి, కదీర్ ను కొడుతూ) మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మమ్మల్నే మోసం చేస్తార్రా..?
బయటకు తప్పించుకుని వెళ్లిపోయిన ధాత్రి వాళ్లు ఆరాధ్యను తీసుకెళ్లండి అని కిరణ్ కు చెప్తారు.
ధాత్రి: అలాగే కదిర్ ను కూడా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి..
కేదార్: కదిర్ ఎక్కడ.. అభి కూడా లేడు.
ఆరాధ్య: అయ్యో అన్నయ్యా లోపలే ఉన్నాడు అక్కా ఆ మీనన్ అన్నయ్య గురించి తెలుసుకుని ఏం చేస్తాడోనని భయంగా ఉంది అక్క.
ధాత్రి: కిరణ్ ఆరాధ్యను తీసుకుని వెళ్లండి.
అని చెప్పి లోపలికి వెళ్తారు. లోపల మీనన్ అభి, కదిర్‌ను కొడుతుంటాడు. మీనన్ అంటూ గట్టిగా అరుస్తూ ధాత్రి వెళ్తుంది. వీడు నీ టీమే అనుకుంటా.. అంటాడు మీనన్. ధాత్రి గన్ తీసి మీనన్‌కు ఎయిమ్ చేస్తుంది. టోని ధాత్రిని ఎయిమ్ చేస్తాడు. ఇంతలో కేదార్ వచ్చి టోనీని కాలుస్తాడు. మీనన్ టోనీని పట్టుకునే హాస్పిటల్ కు వెళ్లబోతుంటే ధాత్రి, కేదార్ వచ్చి అభి, కదీర్ లను తీసుకుని వెళ్లిపోతారు. టోనీ చనిపోతాడు. మీనన్.. దేవాను పిలిచి వాళ్లిద్దరినీ చంపేయమని చెప్తాడు. రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు కదీర్, అభిలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు ధాత్రి, కేదార్. టోనీ శవం ముందు కూర్చుని మీనన్ బాధపడుతుంటాడు.
మీనన్: నా తమ్ముడి ముందు ఈ మీనన్ ఓడిపోయాడు.
దేవా: భాయ్ ప్లీజ్ భాయ్ మీనన్ ఓడిపోవడం ఏంటి. అది ఎప్పటికీ జరగదు.
మీనన్: నేను అదే అనుకున్నాను. ఈ మీనన్‌కు ఓటమి లేదని.. చంపడమే తెలిసిన నాకు చావును ఒక్క ఆడది పరిచయం చేసింది .నా కళ్ల ముందే నా రక్తాన్ని చంపేసింది దేవా. నా ప్రాణాన్ని తీసేసింది దేవా. మనలోనే ఒక పోలీస్ ఉన్నాడని ఎందుకు తెలుసుకోలేదు. ఎవడు తీసుకొచ్చాడు వాణ్ని.
దేవా: కదీర్ గాడు తీసుకొచ్చాడు భాయ్. కదిర్ మన దగ్గర పది సంవత్సరాలుగా చేస్తున్నాడు కదా భాయ్. తప్పు అయిపోయింది భాయ్.
మీనన్: ఆ తప్పు విలువ తెలుసా.. ఆ ఒక్క తప్పు వల్ల నేను ఏం కోల్పోయానో తెలుసా నీకు. చూడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెడతాడనుకుంటే శవంలా పడి ఉన్న నా తమ్ముణ్ని చూడు
అంటూ మీనన్ గట్టిగా అరుస్తుంటాడు. జేడీ అంటూ కోపంతో రగిలిపోతుంటాడు. ఆ జేడీ శవం తగులబెట్టిన తర్వాతే నా తమ్ముడికి దహన సంస్కారాలు చేస్తాను అంటూ మీనన్ వెళ్లిపోతుంటే దేవా ఆపుతాడు. ఇంటికి వెల్లిన కేదార్, ధాత్రి. మీనన్ తమను అంత తేలిగ్గా విడిచిపెట్టడని అనుకుంటారు. గార్డెన్ లో కూర్చున్న సుధాకర్.. బాధగా వైజయంతి చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి సారీ చెప్తుంది. నీకు ఇష్టం లేని పని చేయము అంటూ భోం చేద్దువురా అంటూ పిలుస్తుంది. చేయనని సుధాకర్ అందరినీ తిడుతూ కిందపడిపోతాడు. ఇంతలో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!