News
News
X

Jabardasth New Anchor : 'జబర్దస్త్'కు ఎక్స్ట్రా గ్లామర్, అనసూయ ప్లేస్‌లో వచ్చిన కొత్త యాంకర్ ఎవరో తెలుసా?

Jabardasth New Anchor Name : 'జబర్దస్త్' కొత్త యాంకర్ ఎవరో తెలిసిపోయింది. లేటెస్ట్ ప్రోమోలో యాంకర్ ఎవరనేది రివీల్ చేయనప్పటికీ... విశ్వనీయ వర్గాల నుంచి కొత్త యాంకర్ ఎవరనేది 'ABP Desam' తెలుసుకుంది.

FOLLOW US: 

ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth Show) కు వెండితెర రంగమ్మత్త, బుల్లితెర అందాల భామ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వీడ్కోలు పలికారు. జూలై నెలలో ఆఖరి వారంలో టెలికాస్ట్ అయిన 'జబర్దస్త్' ఎపిసోడ్, సూపర్ హిట్ కామెడీ షో యాంకర్‌గా అనసూయకు లాస్ట్ ఎపిసోడ్. ఆ విషయం క్లారిటీగా చెప్పేశారు. మరి, ఆమె ప్లేస్‌లో వస్తున్న కొత్త యాంకర్ ఎవరు? అనేది ఆ ఎపిసోడ్‌లో చెప్పలేదు. సస్పెన్స్‌లో పెట్టారు.

Jabardasth Latest Promo With New Anchor : ఆగస్టు తొలి వారంలో టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా విడుదల చేశారు. అందులో స్టార్టింగ్ నుంచి ఎక్కడా యాంకర్‌ను చూపించలేదు. ప్రోమో చివర్లో... పల్లకిలో ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌ను తీసుకొచ్చారు. 'ఎవరో కనిపెట్టండి చూద్దాం!' అన్నట్టు బుల్లితెర వీక్షకులకు పజిల్ వదిలారు.

Rashmi Gautam Takes Charge As Jabardasth New Anchor : అనసూయ స్థానంలో మంజూష, స్రవంతి చొక్కారపు తదితరులను యాంకర్‌గా తీసుకు వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు. ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  కు 'జబర్దస్త్' యాంకరింగ్ బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మల్లెమాల సంస్థ కొత్త యాంకర్‌ను తీసుకోలేదని, ఆల్రెడీ 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో వీక్షకుల మనసు దోచిన రష్మీని 'జబర్దస్త్'కు తీసుకొచ్చి ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేశారని తెలుస్తోంది.

Also Read : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు

'జబర్దస్త్'లో 'కార్తికేయ 2' టీమ్ సందడి
ఆగస్టు తొలి వారంలో టెలికాస్ట్ కానున్న రష్మీ గౌతమ్ మొట్టమొదటి 'జబర్దస్త్' ఎపిసోడ్‌లో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' టీమ్ సందడి చేయనుంది. హీరోతో పాటు ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, చిత్ర దర్శకుడు చందూ మొండేటి కూడా సందడి చేయనున్నారు. స్టేజి మీద నిఖిల్ డైలాగులు చెప్పారు. సంగీత, ఇంద్రజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.     

Also Read : 'గంగోత్రి'లో బాలనటి - ఇప్పుడు 'మాసూద'లో కథానాయికి

View this post on Instagram
 
A post shared by Rashmi Gautam (@rashmigautam)

Published at : 31 Jul 2022 12:39 PM (IST) Tags: Rashmi Gautam Jabardasth New Anchor Anasuya Replaced By Rashmi In Jabardasth Rashmi Gautam As Jabardasth Anchor

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?