Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Income Tax Telugu News: బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి లావాదేవీలు మరియు షేర్ ట్రేడింగ్ వంటి ముఖ్యమైన నగదు లావాదేవీలు ఆదాయపుపన్ను నిఘా పరిధిలోకి వస్తాయి.
Income Tax Latest Telugu News: చాలా మంది పన్ను చెల్లింపుదారులు అలాగా పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు సైతం తమ ఆదాయాల కంటే ఎక్కువగా కొన్ని హైవాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఒక్కోసారి అవి మన మిత్రులు లేదా తెలిసినవారు, కుటుంబ సభ్యుల కోసం చేస్తుంటాం. అయితే వీటి వల్ల పన్ను అధికారుల నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. ప్రజలు వివిధ మార్గాల్లో చేసే చెల్లింపులను అనేక సంస్థల నుంచి పన్ను అధికారులు తెప్పించుకుంటుంటారు. ఈ డేటాను వారు టెక్నాలజీ ఆధారంగా పర్వవేక్షిస్తుంటారు. అందువల్ల ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో వీటికి సంబంధించిన వివరాలు తప్పక అందించాలి. విఫలమైతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
ప్రధానంగా ఐటీ శాఖ నిఘా ఎల్లప్పుడూ బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆస్తి లావాదేవీలు, షేర్ ట్రేడింగ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటి ముఖ్యమైన నగదు లావాదేవీపై ఉంటుంది. వీటిలో పరిధికి మించిన నగదు ట్రాన్సాక్షన్స్ జరిగితే అధికారులు అప్రమత్తం అవుతారు. అందుకే వీటికి సంబంధించిన లిమిట్స్ తెలుసుకోవటం చాలా ముఖ్యం..
బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్:
ఎవరైనా వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా కరెంట్ బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలకు మించిన ఏదైనా లావాదేవీలు జరిపితే ఆ వివరాలను బ్యాంకులు ఆదాయపుపన్ను శాఖకు పంపిస్తాయి. అలాగే ఒకే లావాదేవీలో రూ.2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు జరిపినా కూడా పరిశీలనలోకి వస్తాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్:
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో ఇటీవలి పెరుగుదల కారణంగా స్థిరమైన వడ్డీ ఆదాయం కోసం చాలా మంది పెట్టుబడిదారులు తమ డబ్బులను వీటిలోకి మళ్లించారు. పన్ను శాఖ నగదు డిపాజిట్లను నివేదించడానికి ప్రస్తుత థ్రెషోల్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో ఉంచబడిన నిధులతో సహా ఉద్దేశించిన ఉపయోగంతో సంబంధం లేకుండా ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలుగా ఉంది. వ్యక్తులు అనేక బ్యాంకుల్లో మెుత్తంగా కలిపి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది పన్ను అధికారుల నోటీసుకు వస్తుంది. ఈ పరిమితిని అధిగమించడం తప్పనిసరిగా పన్ను ఎగవేతను సూచించదు కానీ పన్ను శాఖ పరిశీలనను తీసుకుంటుంది. అవసరమైన వారికి నోటీసులు పంపుతుంది.
నగదు చెల్లింపులు:
బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్‌లు లేదా బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేయడానికి నగదు చెల్లింపులు జరిగే లావాదేవీలను నివేదించడం బ్యాంకులు లేదా సహకార సంఘాలకు పన్ను శాఖ తప్పనిసరి చేసింది.
క్రెడిట్ కార్డ్ చెల్లింపులు:
క్రెడిట్ కార్డ్ బిల్లుల కోసం సంవత్సరానికి రూ.లక్ష కంటే ఎక్కువ నగదు చెల్లింపుల వివరాలు పన్ను అధికారుల పరిశీలనకు వస్తాయి. అలాగే నగదు రహిత పద్ధతుల ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్‌ల్లో రూ.10 లక్షలకు మించి జరిపై అన్ని చెల్లింపులు పర్యవేక్షణకు లోబడి ఉంటాయి.
ఇతర కారణాలు:
దేశీయ వ్యాపార-తరగతి విమాన ప్రయాణం, ట్యూషన్ లేదా విరాళం చెల్లింపులు, నగలు, పెయింటింగ్‌లు, మార్బుల్, విద్యుత్ ఖర్చులు వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి జరిపితే నోటిఫికేషన్‌లను పంపే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది.
రియల్ ఎస్టేట్ లావాదేవీలు:
భారతదేశంలో రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కొనుగోలు చేసే కొనుగోలుదారులు దానికి సంబంధించిన నిధుల మూలాన్ని వెల్లడించడం ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించాలి. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోబడింది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లావాదేవీలకు రూ.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల విలువైన ఆస్తి ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటి వివరాలు అందించాల్సి ఉంటుంది.