ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ లేకుంటే మనకు రోజు గడవదు మన దేశంలో ఐదు రకాల బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్, రీజనల్ రూరల్, కోపరేటవ్, లోకల్ ఏరియా బ్యాంకులగా విభజించారు. వీటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాస్‌లా పని చేస్తుంది. రూల్స్ గీత దాటిన వారిపై చర్యలు తీసుకుంటుంది. కమర్శియల్ బ్యాంకులన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంకులే. ఇవి ఆర్బీఐ కింద పని చేస్తాయి. షెడ్యూల్డ్ బ్యాంకులు 3 రకాలు. 1.ప్రభుత్వ బ్యాంకులు 2. ప్రైవేటు బ్యాంకులు, 3. విదేశీ బ్యాంకులు. 5 లక్షల లోపు రిజర్వ్ క్యాపిటల్ ఉన్నవి నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. వీటికి ఆర్బీఐతో సంబంధం ఉండదు గ్రామాల్లో సేవలు అందించేందుకు ఆర్‌ఆర్‌బీలను 1975లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40కిపైగా ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు రెండు వే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఎక్కువ పట్టణాల్లోనే ఉన్నాయి. లోకల్ ఏరియా బ్యాంకింగ్ వ్యవస్థని 2013 నుంచి ప్రవేశ పెట్టారు. దీనికి కేంద్రం బాధ్యత వహిస్తుంది. నాబార్డ్, ఐడీబీఐ లాంటివి.