ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ ఫ్యామిలీకి అతి పెద్ద భరోసా. ఊహించని పరిస్థితి ఎదుర్కోవడానికే ఉపయోగపడే నిధి. మధ్యతరగతి, ఉద్యోగుల ఫ్యామీలకు చాలా అవసరం. ఉద్యోగం పోయినా, ఆనారోగ్యంపాలైనా ఆ నిధి వాడుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మానసిక ప్రశాంత ఉంటుంది. అంబానీ, అదానీ స్థాయి వ్యక్తులకైనా ఈ నిధి ఉంటుంది. కష్టం వస్తే రోజు వారి ఖర్చుల కోసం అప్పులు చేయడం ఎవరిపై ఆధార పడకుండా చేస్తుందీ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. దానికో లెక్క ఉంటుంది. 3 నుంచి 6 నెలలకు సరిపడా ఉంచుకోవాలి. మీ నెలసరి వేతనం, ఖర్చును బట్టి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఈ లెక్కల కోసం ఆన్‌లైన్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్‌ను సేవింగ్ అకౌంట్‌లో, లిక్విడ్ ఫండ్స్‌గా, షార్ట్ టెర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్‌ను ఉద్యోగం పోయినప్పుడు, మేజర్ చికిత్సల కోసం, ఇంటి మరమ్మతులు, అనుకోని పర్యటనలకు వాడుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ ఖర్చుల కోసం ఉపయోగించొద్దు.