(Source: ECI/ABP News/ABP Majha)
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Bharateeyudu 2 Pre Release Event: కామెడియన్‌గా అందరినీ అలరించే బ్రహ్మానందంకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. అలాంటి ఒక టాలెంట్‌తో ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు.
Brahmanandam At Bharateeyudu 2 Pre Release Event: శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. ఎన్నోసార్లు వాయిదాపడిన తర్వాత ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ‘భారతీయుడు 2’కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అందులోని ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మొత్తం పాల్గొంది. వారిలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఇక స్టేజ్‌పై మునుపెన్నడూ చూడని టాలెంట్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు బ్రహ్మానందం. కమల్ హాసన్‌ను పర్ఫెక్ట్‌గా మిమిక్రీ చేసి చూపించారు.
బ్రహ్మానందం మిమిక్రీ..
కమల్ హాసన్ ముందే ఆయనను ఇమిటేట్ చేసి అదరగొట్టి చూపించారు బ్రహ్మానందం. ‘భారతీయుడు 2’ ఈవెంట్‌లో స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కారు బ్రహ్మానందం. కానీ ఆ స్పీచ్ అంతా కమల్ హాసన్ వాయిస్‌లోనే ఇచ్చారు. ముందుగా అందరికీ నమస్కారం అంటూ కమల్ హాసన్ వాయిస్‌లో చెప్పగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తానే కమల్ హాసన్‌గా మారి స్పీచ్ ఇచ్చారు. ‘‘నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ ఫస్ట్ పార్ట్‌ను బాగా హిట్ చేశారు. దాని గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఎక్కువగా కష్టపడ్డాను. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో అభిమానించారు’’ అంటూ కమల్ హాసన్ వాయిస్‌లోనే స్పీచ్‌ను కంటిన్యూ చేశారు బ్రహ్మానందం.
మీ కమల్ హాసన్..
‘‘నాకు మాటలు ఎక్కువ రావడం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా సంతోషంగా ఉండడంతో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను మరింత హ్యాపీ అవుతాను. ఎప్పటికీ మీ కమల్ హాసన్’’ అంటూ అలాగే స్టేజ్ దిగి వెళ్లిపోయారు బ్రహ్మానందం. ఆయన ఎన్నో ఏళ్లుగా కామెడియన్‌గా వందల సినిమాల్లో నటించి అలరించారు. కానీ ఆఫ్ స్క్రీన్ అసలు బ్రహ్మానందం ఏంటని చాలామందికి తెలియదు. ఆన్ స్క్రీన్ ఉన్న కామెడియన్‌కు, ఆఫ్ స్క్రీన్‌లో ఆయన వ్యక్తిత్వానికి సంబంధం ఉండదని చాలామంది దర్శకులు అంటుంటారు. అలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే బ్రహ్మానందం.. ఇప్పుడు మిమిక్రీ టాలెంట్‌తో మరోసారి అందరినీ ఇంప్రెస్ చేశారు.
Legendary Brahmanandam Garu to Mimicry Artists:"Pillalu ra Meeru" 😎#Bharateeyudu2 #Indian2 pic.twitter.com/QsgDBRXFG9
— Kalyan Babu (@PAWANKALYAN_1) July 7, 2024
సినిమాలు తగ్గాయి..
ఒకప్పటిలాగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు బ్రహ్మానందం. కానీ ఆయన సినిమాలో ఉంటే బాగుంటుంది అని భావించిన దర్శకులు మాత్రం మంచి కథలతో ఆయనను ఒప్పిస్తున్నారు. అలా దర్శకుడు శంకర్.. ‘భారతీయుడు 2’లో నటించేందుకు బ్రహ్మానందంను ఒప్పించారు. ఇక ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘భారతీయుడు 2’ షూటింగ్ ప్రారంభించనప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఫైనల్‌గా షూటింగ్ పూర్తి చేసుకొని పలుమార్లు వాయిదా పడి జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.
Also Read: ఇండియన్ 3 నచ్చిందంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు, కాంట్రవర్సీపై కమల్ క్లారిటీ