Indian 2: ఇండియన్ 3 నచ్చిందంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు, కాంట్రవర్సీపై కమల్ క్లారిటీ
Kamal Hasan: ఇండియన్ 3 సినిమాయే తనకు ఎక్కువగా నచ్చిందని ప్రచారం చేసినట్టు వచ్చిన వార్తల్ని కమల్ ఖండించాడు. ఇండియన్ 2, ఇండియన్ 3 లో ఏదీ తనకు ఎక్కువ కాదని, రెండూ నచ్చాయని క్లారిటీ ఇచ్చాడు.
![Indian 2: ఇండియన్ 3 నచ్చిందంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు, కాంట్రవర్సీపై కమల్ క్లారిటీ Not that I dont like Indian 2 Kamal Haasan clarifies on liking Indian 3 more Indian 2: ఇండియన్ 3 నచ్చిందంటే ఇండియన్ 2 నచ్చలేదని కాదు, కాంట్రవర్సీపై కమల్ క్లారిటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/d82f4c04717373c588e581ee6923fb7d1720351926360517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kamal Hasan on Indian 3: శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఇండియన్ 2 జులై 12న విడుదల కానుంది. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతిగా కనిపించనున్నారు. జులై 6వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే అంతకు ముందు కమల్ ఇండియన్ 2 పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇండియన్ 3 తనకు చాలా నచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. "అంటే కమల్‌కి ఇండియన్ 2 నచ్చలేదా? అంత కాన్ఫిడెన్స్ లేదా" అని మీడియాలో గట్టిగానే వార్తలొచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్దార్థ ఇదే విషయాన్ని కమల్ దృష్టికి తీసుకొచ్చాడు. "మీ కామెంట్స్‌ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. కాస్త క్లారిటీ ఇవ్వండి" అని అడగ్గా కమల్ వివరణ ఇచ్చాడు. ఇండియన్ 3 సినిమా నచ్చిందని చెబితే ఇండియన్ 2 నచ్చలేదనుకుంటారా అని అసహనం వ్యక్తం చేశాడు.
ఇండియన్ 2 మూవీలో కొందరికి ఫస్టాఫ్ నచ్చుతుందని, మరికొందరు సెకండాఫ్‌ని ఇష్టపడతారని అన్నారు కమల్. ఇండియన్ 3లో సెకండాఫ్ అదిరిపోతుందని చెప్పాడు. ఈ కామెంట్స్ కాస్తా మిస్‌ఫైర్ అయ్యాయి. కమల్ హాసన్‌కి భారతీయుడు 2 నచ్చలేదని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ కన్‌ఫ్యూజన్‌కి తెర దించుతూ కమల్ హాసన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. శంకర్‌తో తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని, కానీ మీడియా కారణంగా ఆయన నాకు కాల్ చేసి ఏం జరిగిందని ఆరా తీయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు.
"పిల్లల్ని అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అంటే ఏం చెబుతారు. అలాంటి ప్రశ్నల్ని పిల్లల్ని అడగకూడదు. నాకు ఇండియన్ 2, ఇండియన్ 3 ఒకటే. ఏదీ ఎక్కువా కాదు. ఏదీ తక్కువా కాదు. ఓ సీన్ నచ్చిందని చెప్పినంత మాత్రాన మిగతా సీన్‌లు నచ్చలేదని ఊహించేసుకుంటే ఎలా. ఇండియన్ 3 రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పాడు ఉలగ నాయగన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)