అన్వేషించండి

YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!

Andhra Pradesh News: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడ్ని ఆసుపత్రికి తరలించడానికి తన అంబులెన్స్ ను ఇచ్చి సాయం చేశారు.

YS Jagan Mohan Reddy provide 108 Ambulance to save a Life: పులివెందుల: సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమన్నూతలకు చెందిన నరేంద్ర అనే యువకుడు నీటిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. పక్కనే ఉన్న నరేంద్ర సన్నిహితులు 108 వాహనానికి ఫోన్‌ చేసినా సకాలంలో రాలేదు. దాంతో సన్నిహితులు నరేంద్రను ద్విచక్ర వాహనంపై పులివెందులలోని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. 

మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ 
మరోవైపు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ లింగాల మండలం పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆగి చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో బైకుపై ప్రాణపాయ స్థితిలో ఉన్న నరేంద్రను అతడి సన్నిహితులు తీసుకువచ్చారు. తాము 108 కు ఫోన్‌ చేస్తున్నా రాలేదని, కనీసం కాన్వాయ్‌ లో ఉన్న 108 వాహానంలో బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కోరారు. వైఎస్‌ జగన్ కు విషయం చేరవేయగా.. ఆయన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌ లో నరేంద్రను ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!

హుటాహుటిన 108లో ఆక్సిజన్‌ సహాయంతో పులివెందుల మెడికల్‌ కళాశాలకు బాధితుడ్ని తీసుకెళ్లారు. సకాలంలో వైఎస్ జగన్ సాయం చేయడం, వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో నరేంద్ర  ప్రాణాలు నిలిచాయి. నరేంద్ర ప్రస్తుతం  పులివెందుల మెడికల్‌ కళాశాలలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు 108కు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి, పలువురి ప్రాణాలు కాపాడిన వైఎస్‌ జగన్ తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. దాంతో ఓ యువకుడు ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. సకాలంలో సాయం చేసిన మాజీ సీఎం జగన్‌కు నరేంద్ర కుటుంబసభ్యులు, సన్నిహితులు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget