అన్వేషించండి

Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

Intinti Gruhalakshmi Serial Today Episode : దివ్యకు తన కడుపులో బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Gruhalakshmi Serial Telugu Serial Today Episode 

కడుపు నొప్పితో ఉన్న దివ్యను ప్రియ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. ఇక ట్యాబ్లెట్ల డోస్ ఎక్కువ అయినందుకు ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్తాడు. ఇక ప్రియ ఈ విషయాన్ని విక్రమ్‌కి చెప్పాలని కాల్ చేస్తే రాజ్య లక్ష్మి అక్కడికి వచ్చి ఫోన్ తీసుకొని ప్రియను అడ్డుకుంటుంది. 

రాజ్యలక్ష్మి: ఏంటి మీ బావకి ఈ విషయం చెప్పేయాలి అనుకుంటున్నావా.. దివ్యను విక్రమ్‌కు ఇచ్చి పెళ్లి చేయడం చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటాను. దివ్యకి తన ప్రాణాలు దక్కడం ఇప్పుడు ఎంత ముఖ్యమో.. నా కొడుకు విక్రమ్ నా మాట వింటూ నా చెప్పుచేతల్లో ఉండటం నాకు అంత ముఖ్యం. 
ప్రియ: అత్తయ్య దివ్య అక్క పరిస్థితి బాలేనప్పుడు బావగారికి చెప్పకపోవడం అన్యాయం.  
రాజ్యలక్ష్మి: చూడు ప్రియ నీ ఏడుపునకు నీ కన్నీరుకు కరిగిపోయే మనసు కాదు నాది. నా స్వార్థం తర్వాతే నాకు ఏదైనా. దివ్య విషయంలో జరిగిని కథంతా పొరపాటున కానీ కావాలని కానీ విక్రమ్‌కి చెప్పావు అంటే నీ కథ కంచికి పోతుంది. నీ ప్రాణం పోతుంది. ఇప్పుడు దివ్య తలరాత రాస్తుంది నేను. ఎప్పుడు ఏం చేయాలో ఏం రాయాలో నాకు తెలుసు. నవ్వు ఎన్ని చేసినా నా కాళ్లు పట్టుకున్నా నా మనసు మారదు. నువ్వు చూసింది విన్నంది అంతా మర్చిపో. ప్రస్తుతం నువ్వు ఒక రాతి బొమ్మవి అది గుర్తుపెట్టుకో. 

మరోవైపు తులసి అత్తమామలకు టిఫెన్ పెడుతుంది. నందూ మాటలు మనసులో పెట్టుకోవద్దు అని అనసూయ తులసికి చెప్తుంది. ఇక నందూ కూడా అక్కడికి వస్తాడు. దీంతో తులసి లోపలికి వెళ్లిపోతుంది. నందూ టిఫెన్ తినడానికి నిరాకరిస్తాడు. నేను అందరికీ లోకువ అంటూ బాధ పడతాడు. అనసూయ నందూకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఉంటే కాదు నువ్వు మారాలి అని పరందామయ్య నందూకి చెప్తాడు. జీవితంలో నా వళ్ల కష్టపడ్డవారే కాదు నేను బాధపడుతున్నాను అని నందూ ఏడుస్తాడు. మీ అందరితో కలిసి బతకాలి అని ఉంది కానీ తులసి నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు అని బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

ఇక డాక్టర్ వచ్చి దివ్య, కడుపులో బిడ్డ సేఫ్‌ అని చెప్తాడు. దీంతో ప్రియ హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. తన ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీలవుతుంది. ఇక ప్రియ దివ్యను చూడటానికి లోపలికి వెళ్తుంటే రాజ్యలక్ష్మి ఆపి తాను ఒక్కర్తే వెళ్తుంది. అత్త దివ్యతో ఏం మాట్లాడుతుందో అని ప్రియ బయట నుంచి తెగ టెన్షన్ పడుతుంది.

రాజ్యలక్ష్మి: చేయాల్సింది అంతా చేసి బుద్ధిమంతురాలిగా పరామర్శించడానికి వచ్చింది  ఏంటి అని ఆలోచిస్తున్నావా
దివ్య: వెళ్లిపో దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో
రాజ్యలక్ష్మి: నేను వెళ్లిపోవడం కాదు నిన్నే ఏకంగా పైకి పంపించేద్దాం అనుకున్నా జస్ట్ మిస్ అయ్యావు అంతే
దివ్య: ఇరిటేట్ చేయొద్ద.. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం
రాజ్యలక్ష్మి: ఇక మన మధ్య మాటలు లేవు. చేతలే.. వార్ వన్ సైడ్ అయిపోంది. 
దివ్య: వెళ్తావా వెళ్లవా.. 
రాజ్యలక్ష్మి:  ఎందుకు అంత ఆవేశపడతావు. నేనేంతో తెలిశాక కూడా.. నువ్వు ఏం చేయలేవు అని తెలిశాక కూడా ఎందుకు ఇంక ఎగిరెగిరి పడతావు. ఇప్పుడే బయటపడ్డాను ఇక నా జోలికి రాదు అని అనుకుంటున్నావేమో.. నా తాచుపాము పగ.  కాటు వేసే వరకు పగ తీరదు. ఏ నిమిషానికి ఏం చేస్తానో ఎటు నుంచి వస్తానో ఆ దేవుడికి కూడా తెలీదు. నా కొడుకు విషయంలో చేయిజారావు. నీ కడుపులోని బిడ్డ విషయంలో ఆశ వదులుకో. అనార్థం ఎటువైపు నుంచి అయినా రావొచ్చు. నేను ఇలా చేయనున్నానని నీ మొగుడుకి చెప్పినా వాడు  నమ్మడు. నేను ఏం ప్లాన్ చేస్తానో నీకు కూడా తెలీదు. రాసి పెట్టుకో కచ్చితంగా నీ బిడ్డ నీకు దక్కదు. ఇది ఫిక్స్ అంటూ బయటకు వచ్చేస్తుంది. ఇక అక్కడే వెయిట్ చేస్తున్న ప్రియకు తనతో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు నందూ ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు - కనకం షాకింగ్ ప్లాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget