Guppedantha Manasu Promo: ‘గుప్పెడంత మనసు’లోకి రిషి రి-ఎంట్రీ.. ఆటోవాలాగా మారిన రిషి సార్, గతం మరిచిపోయాడా?
Guppedantha Manasu Rishi Re Entry Video: గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్‌కి స్టార్ మా సర్‌ప్రైజ్ ఇచ్చింది. రిషి రీఎంట్రీకి సంబంధించి స్పెషల్ ప్రొమో తాజాగా రిలీజ్ చేసింది.
Guppedantha Manasu Rishi Re entry Promo Released: ‘గుప్పెడంత మనుసు’ సీరియల్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. రిషి సార్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా కొంతకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులు రిషి ఎంట్రీ అంటూ స్టార్ మా ఊరిస్తూ వస్తుంది. ఎట్టకేలకు రిషి రాక వచ్చేసింది. అయితే రీఎంట్రీ రిషి ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో రిషి రీఎంట్రీకి సంబంధించి స్టార్ మా తాజాగా చిన్న ప్రోమో వదిలింది. ఇందులో అతడు ఆటోవాలాకు కనిపించి షాకిచ్చాడు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. వసు.. రిషి ఊహల్లో ఉంటుంది. రిషినే తలుచుకుంటూ కాలేజీకి వెళుతున్న ఆమెను రిషి సార్ అక్కడ దర్శనం ఇస్తూ పలకిరిస్తుంటాడు. అలాగే రోడ్డుపై వెళుతుండగా సడెన్ ఆమెకు ఆటో ఎదురస్తుంది. ఆటోలో నుంచి రిషి దిగుతాడు. ఆటో డ్రైవర్‌గా ఉన్న రిషిని చూసి తన భ్రమ అనుకుని వసుధార వెళ్లిపోతుంటే హాలో! అంటూ చిటికవేసి పలకరిస్తాడు రిషి. వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూస్తుంటే రేపో మాపో రిషి ఎపిసోడ్ రాబోతుందని అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రిషి వసుని మర్చిపోయినట్టు తెలుస్తోంది ప్రొమో చూస్తుంటే.
View this post on Instagram
ఈ ప్రొమోలో అసలు వసు ఎవరో తెలియనట్టుగా పలకరించడం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే నేటి గుప్పెడంత మనసు ఎపోసిడ్‌లో శైలేంద్రా, దేవయానిలు మహేంద్ర ఇంటికి రిషి గురించి వసుని నిలదీస్తారు. మూడు నెలల క్రితం రిషి ఎక్కడ ఉన్న తీసుకువస్తా అన్నావు.. కదా రిషి ఎక్కడ అని దేవయాని వసుధారని ప్రశ్నిస్తుంది. తప్పుకుండ తీసుకువస్తానంటూ వసు చెప్పడంతో శైలేంద్ర వాడు అసలు బతికి ఉంటేనే కదా అని అనడంతో వసుధార సీరియస్ అవుతుంది. శైలేంద్ర కాలర్ పట్టుకుని రిషి సర్‌ని నువ్వే ఏదో చేశావు.. జగతి మేడం చావుకు కూడా నువ్వే కారణమనిపిస్తుందని కాలర్ పట్టుకునే కడిగేస్తుంది.
Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషి చనిపోయాడన్న శైలేంద్ర – శైలేంద్ర కాలర్ పట్టుకున్న వసు
అయితే ఈ ఎపిసోడ్‌లోని వసుధార చీర, తాజాగా రిలీజైన రిషీ రీఎంట్రీ ప్రోమో వసు ఒకటే చీరలో ఉంటుంది. దీంతో రిషీ రీఎంట్రీకి ఇంకా వెయిటింగ్ లేదని అర్థమైపోతుంది. మొత్తానికి రిషి ఎంట్రీ.. బుల్లితెర ఆడియన్స్ ఫుల్ ఖుషి చేస్తుంది. ఇకపై గుప్పెడంత మనసు సీరియల్ మరింత రసవత్తరంగా మారనుంది. అయితే రిషి రీఎంట్రీతో సీరియల్ ముగుస్తుందని ఆడియన్స్‌లో కొన్ని సందేహాల ఉండే ఉంటాయి. ఆటోవాలాకా రిషి సార్ ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా సీరియల్ ఉందని చెప్పకనే చెప్పింది టీం. ఇన్నాళ్లు రిషి ఎక్కడ ఉన్నాడు, అతడిని ఎవరూ కాపాడారు. నిజంగా రిషి గతం మర్చిపోయాడా? ఇలా పలు అంశాలతో ఈ సీరియల్ మరింత ఆసక్తిని పెంచనుందనిపిస్తుంది.