అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 4th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషి చనిపోయాడన్న శైలేంద్ర – శైలేంద్ర కాలర్ పట్టుకున్న వసు

Guppedanta Manasu Today Episode: రిసి ఇక లేడు తిరిగిరాడు అని శైలేంద్ర అనడంతో వసుధార కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకుని రిషి సార్ ను ఏం చేశావని అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: మహేంద్ర ఇంటికి వచ్చిన దేవయాని మనును ప్రశ్నిస్తుంది. నీకు మీ అమ్మకు ఉన్న గొడవేంటో ప్రపంచం మొత్తం తెలుసు నువ్వింకా దీన్ని పర్సనల్‌ గొడవ అంటావేంటి? అనడంతో మను షాక్‌ అవుతాడు. నువ్వు బతికినన్ని రోజులు ఇలా తండ్రి ఎవరో తెలియకుండా బతకాల్సిందేనా? అంటూ వెటకారంగా మాట్లాడగానే మహేంద్ర నేను మను తండ్రి ఎవరో తీసుకొచ్చి మను ముందు నిలబెడతాను అనగానే

దేవయాని: అసలు నీకేం అవసరం మహేంద్ర తన తల్లి చెప్పకుండా మౌనంగా ఉంది. నువ్వేమో ఇలా అంటున్నావు.

మహేంద్ర: వదిన గారు దీన్నే మంచివాళ్లకు సాయం చేయడం అంటారు.

దేవయాని: అది కాదు మహేంద్ర ఇందులో నీకెందుకు ఇంత కంన్సర్న్‌ అసలు మనును ఒక్కమాట కూడా పడనివ్వను. కాలేజీలో నువ్వే తన కన్నతండ్రివి అని అనౌన్స్‌ చేశావు. ఇంతకీ నీ మనసులో ఏముంది. చెప్పు మహేంద్ర. ఒక్కమాట అడుగుతాను నాతో గొడవ పడి ఈ ఇంటికి వచ్చావా? లేకపోతే అనుపమ ఇక్కడకు వస్తుందని ముందే తెలిసి వచ్చావా?

మహేంద్ర: వదినగారు ( కోపంగా) వదిన అన్న ఒక్కపదం నన్ను ఆపేస్తుంది.

అనుపమ: అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా?

దేవయాని: వావ్‌ సూపర్‌ వండర్‌ఫుల్‌ ఫెంటాస్టిక్‌ డైలాగ్‌ మిమ్మల్ని అర్థం చేసుకోవాలా? ఏం అర్థం చేసుకోవాలి? మీకు పెళ్లి కాలేదు కానీ కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి తండ్రి ఎవరో చెప్పవు? కన్న కొడుకుని దూరం పెడతావు. వేరే వాళ్ల ఇంట్లో ఉంటావు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి.

మహేంద్ర: వదినగారు రిషిని వారం రోజుల్లో తీసుకొస్తానని వసు చెప్తుంది. ఇక మను తండ్రి ఎవరో నేను కనుక్కుంటానని చెప్పాను ఓకేనా ఇక మీరు బయలుదేరితే మంచిది.

దేవయాని: బయలుదేరుతాం ఇదిగో ఈ ప్రసాదం ఇచ్చి బయలుదేరుతాం… వసుధార ఈ ప్రసాదం తీసుకో..

శైలేంద్ర: మమ్మీ ఇప్పటి దాకా నువ్వు ఆడుకున్నావు కదా ఒక్కచాన్స్‌ నాకివ్వు… వసుధార ఈ వారం రోజుల్లో నువ్వు రిషిని తీసుకురాకపోతే కచ్చితంగా నువ్వు వెళ్లిపోతావు కదా

 అని శైలేంద్ర అడగ్గానే కచ్చితంగా వెళ్లిపోతానని వసుధార చెప్తూనే కానీ మీ భ్రమ నేను రిషి సార్‌ను తీసుకొస్తాను అంటుంది. నువ్వు తీసుకురావడానికి వాడు ఉంటే కదా అని శైలేంద్ర అనగానే వసు కోపంగా శైలేంద్ర కాలర్‌ పట్టుకుంటుంది. రిషి సార్‌ను ఏం చేశావు అని నిలదీస్తుంది. జగతి మేడంను కూడా మీరే ఏదో చేశారని వసు డౌట్‌ క్రియేట్‌ చేయగానే కొంపదీసి జ్యూస్‌లో మేమే విషం కలిపి పిన్నికి ఇచ్చి చంపాము అనుకుంటున్నారా? అని శైలేంద్ర అనడంతో అందరూ షాక్‌ అవుతారు.

వసు: అలా మేము అనలేదు. అంటే మీరే అలా చేశారా?

శైలేంద్ర: వసుధార నేనెందుకు అలా చేస్తాను.

మహేంద్ర: ఓరేయ్‌ శైలేంద్ర అదే కనక నిజం అయితే నీ ప్రాణాలు తీస్తాను. మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఇక నుంచి జగతి చావుకు కారణాలు తెలుసుకుంటాను.

 అని మహేంద్ర కోపంగా చెప్పగానే శైలేంద్ర, దేవయాని వెళ్లిపోతారు. తర్వాత ఇద్దరూ కలిసి వసుధార రిషిని తీసుకురాదు. దీంతో వసుధార కూడా ఇకడి నుంచి వెళ్లిపోతుంది. అలాగే మహేంద్ర మనుగాడి తండ్రిని తీసుకొచ్చినా మను గాడు వాడి తండ్రిని చంపి జైల్లో ఉంటాడు అని ఎటూ ఆలోచించినా మనకే గెలుపు అనుకుంటారు. మరోవైపు మహేంద్ర, అనుపమ, వసుధార, మను ఎవరికి వాళ్లే దేవయాని మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటారు. ఎలాగైనా శైలేంద్ర, దేవయానిలకు బుద్ది చెప్పాలని ఆలోచిస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  'ఢీ' నుంచి బాపు బొమ్మ అవుట్ - జడ్జి సీటులోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఎవరంటే?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Best 5G Smartphones Under 25000: రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Best 5G Smartphones Under 25000: రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
UP: చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Crime News: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget