అన్వేషించండి

Guppedantha Manasu october 26th : జగతి బాధ్యత తీసుకున్న అనుపమ, మహేంద్రకి షాకిచ్చిన రిషి!

Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు అక్టోబరు 26 ఎపిసోడ్

వసుధార ప్రశాంతంగా నిద్రపోతుంటే కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు రిషి. నిద్రలోంచి లేచి షాక్ అయిన వసు...ఏంటి సార్ ఇది అని అడుగుతుంది. 
రిషి: ఈ  ఏరియాలో ఈ కాఫీ చాలా స్పెషల్ అంట. ప్రత్యేకించి నీకోసమే చేయించాను 
వసు: నేను చాలా అదృష్టవంతురాలిని, భర్త చేతి కాఫీ తాగుతున్నాను 

శైలేంద్ర-దేవయాని-ధరణి
మరోవైపు రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక ఆవేశపడిపోతుంటాడు శైలేంద్ర. అదే విషయాన్ని తల్లితో చెప్తాడు. అంతలో అక్కడ ధరణి ఫోన్ కనిపిస్తుంది. ధరణిని పిలిచి చాలా ప్రేమగా మాట్లాడుతాడు శైలేంద్ర. మీకు ఏం కావాలి అని సూటిగా అడుగుతుంది ధరణి. తెలివైన దానివి, అర్థం చేసుకున్నావు అయినా ఇంత ఓపెన్ గా అడిగితే ఎలా అంటాడు శైలేంద్ర. ఓపెన్ గా మాట్లాడేదాన్ని అయితే మీ గురించి ఎప్పుడో అందరికీ చెప్పేసే దాన్ని అంటుంది ధరణి. అర్జెంటుగా ఒక మెయిల్ పంపించుకోవాలి నీ ఫోన్ లాక్ ఓపెన్ చెయ్యు అంటాడు . ధరణి లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది. ధరణి చాట్ చేస్తున్నట్టుగా వసుధారతో చాట్ చేస్తూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు శైలేంద్ర. చాట్ చేస్తున్నది ధరణి కాదు అని అర్థం చేసుకుంటుంది వసుధార. అక్కడ నేచర్ కి ఒక పిక్ తీసి పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆ పిక్ చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో గ్రహిస్తాడు శైలేంద్ర. ఫోన్ ధరణికి ఇస్తూ నువ్వు చెప్పకపోయినా  నేను ఎలా తెలుసుకున్నానో చూసావా అంటాడు. భర్తని తిట్టుకుంటూ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది  ధరణి.

Also Read: రిషికి మొత్తం చెప్పేసిన వసు - అనుపమ గురించి వసుధార ఎంక్వైరీ!
 
రిషి-మహేంద్ర
డాడ్ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అను అని కలవరిస్తున్నారు ఎవరు ఆవిడ? ఆవిడ గురించి తెలుసుకోవాలి  డాడ్ ని అడిగినా చెప్పడు. నిన్న ఆయన వెళ్లిన ప్లేస్ కి వెళ్తే ఏమైనా తెలియొచ్చు అనుకుని వసుధార దగ్గరికి వెళ్లి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. పక్క రూమ్ నుంచి ఆ మాటలు వింటాడు మహేంద్ర. నా మీద అనుమానం వచ్చిందా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుని రిషి ని ఫాలో అవుతాడు మహేంద్ర. 

శైలేంద్ర కుట్ర ప్లాన్
ఇంతలో ఒక వ్యక్తి రిషి ని అబ్జర్వ్ చేస్తూ శైలేంద్రకి కాల్ చేసి బయటకి వెళుతున్నాడని చెబుతాడు. తనని ఫాలో చెయ్యి వీలైతే చంపి అప్పుడు నాకు ఫోన్ చెయ్యు అంటాడు శైలేంద్ర. సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తుంటే  ఫాలో అవుతాడు మహేంద్ర. అయితే ఒక దగ్గర రిషి ని మిస్ అవుతాడు.

Also Read: గుప్పెడంతమనసులో 'ఆర్య' లవ్ స్టోరీ, అనుపమ ఎంట్రీతో ఇంట్రెస్టింగ్ గా మారిన కథ!
 
అనుపమ - రిషి
అనుపమ జగతి గురించి ఆలోచిస్తూ మహేంద్రని జగతి గురించి అడగాలి. రిసార్ట్ కి వెళ్తే బాగోదు నిన్న కలిసిన దగ్గరికి వస్తాడేమో, అక్కడికి వెళ్లాలి అనుకుని బయలుదేరుతుంది. వెళ్తున్న దారిలో ఆమె కారు ట్రబుల్ ఇస్తుంది. కార్ డ్రైవర్ ని బాగు చేయమని చెప్పి తను అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రిషి కూడా అటువైపే వస్తాడు. శైలేంద్ర అరేంజ్ చేసిన వ్యక్తి రిషి ని చంపటానికి రిషి మీదకి కారుపోనిద్దాం అనుకుంటూ స్పీడ్ గా వస్తాడు. అదంతా చూస్తున్న అనుపమ పరిగెత్తుకుంటూ వెళ్లి రిషి ని పక్కకి లాగేస్తుంది. రిషిని రిలాక్స్ అవమని చెప్పి తనని పరిచయం చేసుకుంటుంది. 
అను: నా పేరు అనుపమ..మీ పేరు
రిషి: పేరు చెప్పి తనది హైదరాబాద్ అని చెబుతాడు
అనుపమ: మిమ్మల్ని చూడగానే అనుకున్నాను.  నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా
రిషి: ఎందుకు అలా అడుగుతున్నారు 
అను: మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశాడు. ఇది ఆక్సిడెంటల్ గా జరిగింది కాదు,వాడు మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడు అనిపిస్తోంది. మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఇక్కడినుంచి వెళ్లిపోండి . 
సరే అని బయలుదేరబోతుంటే నా కారులో డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి రిషి ని ఒప్పించి తన కార్లో తీసుకువస్తుంది. 

మహేంద్ర షాక్
మహేంద్ర రిసార్ట్ కి వచ్చి అక్కడే కూర్చుండి పోతాడు. రిషి ఎక్కడికి వెళ్ళాడో అనే ఆలోచనలో పడతాడు. అక్కడికి వచ్చిన కారులోంచి రిషి, అనుపమ ఇద్దరూ దిగడం చూసి షాక్ అవుతాడు. కారు దిగిన రిషి అనుపమని లోపలికి రండి కాఫీ తాగుదురు గాని అంటాడు రిషి. వద్దు అని చెప్పిన అనుపమ మహేంద్ర ఉండేది కూడా ఇక్కడే కదా ఇతనికి తెలిసేమో అడుగుదాం అనుకుంటుంది. మళ్ళీ బాగోదేమో అని ఆలోచనలో పడుతుంది. అటు మహేంద్ర మాత్రం చాటుగా దాక్కుని టెన్షన్ గా చూస్తుంటాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Civil Servants Village : 5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు -  వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు - వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Embed widget