Guppedantha Manasu october 25th : రిషికి మొత్తం చెప్పేసిన వసు - అనుపమ గురించి వసుధార ఎంక్వైరీ!
Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు అక్టోబరు 25 ఎపిసోడ్
జగతి జ్ఞాపకాల్లో మునిగిపోయిన మహేంద్రకు ప్రాణ స్నేహితురాలు అనుపమ కనిపిస్తుంది. జగతి గురించి అడుగుతుంది. జగతి చనిపోయిన విషయం అనుపమ దగ్గర దాచిపెడతాడు మహేంద్ర. మళ్లీ కలిసినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెబుతానని అనుపమతో అంటాడు. వాళ్ల సంతోషం కోసం ఏదైనా చేస్తాని తన పెద్దమ్మకి మాటిస్తుంది అనుపమ. మళ్లీ మహేంద్రను కలిసి జగతి గురించి ఎంక్వైరీ చేయమని అనుపమతో అంటుంది పెద్దమ్మ. అయితే అపోహల కారణంగా విడిపోయిన వాళ్లు ఇంకా కలవలేదని..తానే వాళ్లిద్దరిని కలపాలని ఫిక్స్ అవుతుంది. జగతి గురించి వెంటనే తెలుసుకోవాలని మహేంద్ర ఉంటున్న హోటల్‌కు ఫోన్ చేస్తుంది. కానీ మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తుంది. అనుపమనే తనకు ఫోన్ చేసిందని మహేంద్ర ఊహిస్తాడు. జగతి చనిపోయిన విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతాడు. జీవితంలో నీకు ఎదురుపడకూడదని అనుకున్నా.. అందుకే ఇన్నాళ్లు మీరు వెతికినా కనపడనంత దూరంగా వెళ్లిపోయా అంటూ మహేంద్రను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది అనుపమ. నేను ఎందుకు నీకు దూరంగా వెళ్లిపోయానోనాకు మాత్రమే తెలుసు. కానీ నీ నుంచి దూరంగా వెళ్లిపోయి తప్పు చేశానని అనుపమ బాధపడుతుంది.
ఆలోచనలో వసుధార
రాయిపై జగతి, మహేంద్రతో పాటు అనుపమ పేర్లు ఉండటం వెనుక ఏదో స్టోరీ ఉందని వసుధార ఆలోచిస్తుంది. మహేంద్ర, జగతి గతంలోనే ఈ ప్లేస్‌కు వచ్చారని అర్థం చేసుకుంటుంది. మహేంద్రకు గతం ఉందని, ఆ గతం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రిషి కూడా తండ్రిలో మార్పు కనిపించకపోవడంతో భయపడిపోతాడు.నిద్రలో ఉన్న మహేంద్ర... జగతి, అను అంటూ కలవరిస్తాడు. తండ్రిని నిద్రలేపిన రిషి అను ఎవరు? అని అడుగుతాడు. ఏదైనా ఉంటే చెప్పమని అంటాడు. ఏం లేదని రిషితో అంటాడు మహేంద్ర. జగతి జ్ఞాపకాలు దహించివేస్తున్నాయని, ఇక్కడ ఉండలేనని, ఇంటికి వెళ్లిపోదామని బాధపడతాడు మహేంద్ర. ఆ జ్ఞాపకాల్ని భరిస్తూ తాను బతకలేనంటాడు. తండ్రి బాధ చూడలేక రిషి స్వయంగా మందు బాటిల్ తెచ్చి తండ్రికి ఇస్తాడు. తాగమని అంటాడు. తాను ఓ గ్లాస్ తీసుకొస్తాడు రిషి. అప్పుడే అక్కడకు వచ్చిన వసుధార రిషి చేతిలో నుంచి బాటిల్ లాగేసుకుంటుంది. మీరు తాగుడుకు బానిస అవుతున్నారని, ఇది కరెక్ట్ కాదని మహేంద్రతో అంటుంది. మీరు చూడాల్సిన జీవితం చాలా ఉందని, మా అందరికి మార్గదర్శిగా నిలవాలంటే తాగుడు మానేయాలని సలహా ఇస్తుంది. ఇలా విరక్తితో వైరాగ్యంతో బతికితే తాము చూడలేమని మహేంద్రను రిక్వెస్ట్ చేస్తుంది. జగతిని తీసుకొస్తే తాను మందు మానేస్తానని వసుధారతో అంటాడు మహేంద్ర. రిషి, వసుధారలను తన రూమ్ నుంచి వెళ్లిపొమ్మని పట్టుపడతాడు. తన గురించి ఎవరూ ఆలోచించవద్దని చెబుతాడు.
వసు-రిషి
రిషికి ఎస్ఐ ఫోన్ చేస్తాడు. జగతిని షూట్ చేసిన కిల్లర్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతాడు. తనపై శత్రువులు ఎటాక్ చేసిన ప్రతిసారి వసుధార వచ్చి కాపాడిన విషయాన్ని రిషి గుర్తుచేసుకుంటాడు. తన శత్రువులు ఆమెకు తప్పకుండా తెలిసి ఉంటుందని అనుకుంటాడు. తన తల్లి జగతి ప్రాణాలు తీసిన వాళ్లు ఎవరో చెప్పమని గట్టిగా అడుగుతాడు. శైలేంద్ర పేరు చెబితే రిషి నమ్మడని వసుధార అనుకుంటాడు. ఆమె ఆలోచనలు కనిపెట్టిన రిషి నువ్వు ఎవరి పేరు చెప్పినా తాను నమ్మి తీరుతానని చెబుతాడు.నీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉంటే చెప్పమని, వాడితో తన స్టైల్‌లోనే నిజం కక్కిస్తానని రిషి అంటాడు. అమ్మ దూరమైంది. తండ్రి తాగుడు బానిసగా మారిపోయాడని, కానీ తప్పు చేసిన వాడు మాత్రం సేఫ్ ఉన్నాడని, వాడికి శిక్ష పడాల్సిందేనని రిషి అంటాడు. వసుధార మాత్రం సమాధానం చెప్పకుండా సెలైంట్‌గా ఉంటుంది. నా శత్రువు ఎవరో నీకు తెలుసా అని వసుధారను గట్టిగా అడుగుతాడు రిషి. తెలుసు అని వసుధార ఆన్సర్ ఇస్తుంది.
మొత్తం చేసింది దేవయాని-శైలేంద్ర
ఎవడు వాడు అని రిషి అడగ్గా...మీ అన్నయ్య శైలేంద్ర అని అంటుంది. వసుధార చెప్పిన సమాధానం విని రిషి షాకవుతాడు. మా అన్నయ్య నన్ను ఎందుకు చంపాలని అనుకుంటాడు అని అంటాడు. ఎండీ సీట్ కోసం...డీబీఎస్‌టీ కాలేజీని తన సొంతం చేసుకోవాలనే శైలేంద్ర ఈ కుట్రలు చేస్తున్నాడని చెబుతుంది వసుధార. శైలేంద్ర చేస్తున్న కుట్రల గురించి మా పెద్దమ్మకు తెలుసా అని వసుధారను అడుగుతాడు రిషి. ఈ కుట్రలకు ప్లాన్ చేస్తున్నదే దేవయాని అని అంటుంది. మీరు పేరుప్రతిష్టలు సంపాదించుకోవడం, సొసైటీలో పాపులర్ అవ్వడం పెద్దమ్మ జీర్ణించుకోలేకపోయిందని, అందుకే ప్లాన్ చేసి మనపై చాలా సార్లు శైలేంద్ర ద్వారా ఎటాక్ చేయించిదని అంటుంది వసుధార, జగతికి ఈ విషయం తెలిసి శైలేంద్ర, దేవయానిలను నిలదీసిందని, కానీ మీ ప్రాణాలు తీస్తామని చెప్పి జగతిని బెదిరించారని నిజాలు మొత్తం రిషికి చెప్పేస్తుంది వసుధార. మీ ప్రాణాలను కాపాడటం కోసమే తాను, జగతి కలిసి మీపై తప్పుడు అభియోగం మోపాల్సివచ్చిందని వసుధార అంటుంది. మీరు మళ్లీ తిరిగి వస్తే ఎండీ సీట్ దక్కకుండా పోతుందనే మీ ప్రాణాలను తీయడానికి శైలేంద్ర ప్రయత్నించాడని, ఆ ప్రమాదంలో మిమ్మల్ని కాపాడి జగతి కన్నుమూసిందని అంటుంది. జగతి మరణానికి కారణం వాళ్లు అని నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని వసుధారను నిలదీస్తాడు రిషి. శైలేంద్ర, దేవయాని నేరస్తులు అని తెలిసినా తన దగ్గర ఆధారాలు లేకపోవడంతో ఇన్ని రోజులు చెప్పలేకపోయానని, ఆధారాలు లేకుండా చెబితే మీరు కూడా నమ్మరని బదులిస్తుంది వసుధార.
అంతా వసుధార కల
ఆధారాలు లేకుండా వాళ్లు నేరస్తులు అని ఎలా ఉంటున్నావని చెప్పి వసుధారకు షాకిస్తాడు రిషి. పెద్దమ్మ చాలా మంచిదని, తన మనసులో ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు ఉండవని అంటాడు. శైలేంద్రకు తాను ప్రాణమని, ఎండీ సీట్ కావాలని అన్నయ్య తనను అడిగితే కాదనకుండా ఇచ్చేవాడినని చెబుతాడు. నువ్వుదే పొరపడుతున్నావని వసుధారకు క్లాస్ ఇస్తాడు రిషి. ఇంకోసారి వారి గురించి తప్పుగా మాట్లాడితే బాగుందని వార్నింగ్ ఇస్తాడు. మీ పెద్దమ్మ, అన్నయ్య మీరు అనుకున్నంత మంచివాళ్లు కాదని, వాళ్లు నరరూప రాక్షసులని వసుధార అంటుంది. ఆ మాటతో కోపం తట్టుకోలేకపోయిన రిషి...వసుధారపై చేయిచేసుకుంటాడు. చెంపపై గట్టిగా కొడతాడు.రిషి పిలుపుతో ఒక్కసారిగా వసుధార కలలో నుంచి బయటకు వస్తుంది. నా శత్రువులు ఎవరో చెప్పమంటే ఎందుకు ఆలోచిస్తున్నావని వసుధారను అడుగుతాడు రిషి. తొందరలోనే మీ శత్రువులు ఎవరో మీకే తెలుస్తుంది అని రిషితో చెబుతుంది.