Guppedantha Manasu March 27th Episode: రిషిని మించిన ఈగో చూపిస్తోన్న అనుపమ - అప్పుడు జగతి ఇప్పుడు మను బాధితులు , గుప్పెడంత మనసు మార్చి 27 ఎపిసోడ్!
Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు మార్చి 27th ఎపిసోడ్)
ఒకరి కోసం మరొకరు బాధపడడం కన్నా మీ సమస్యను సాల్వ్ చేసుకుని సంతోషంగా ఉండొచ్చుకదా అంటాడు మహేంద్ర... నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నా అంటాడు
మను: కన్నవాళ్లకు ఏ కష్టం రాకుండా కంటికిరెప్పలా చూసుకోవాలని నాకు ఉంది. కానీ అది నా కల. మా మధ్య సమస్య సమస్యగానే ఉండిపోతుంది.
నా జీవితంలో అలాంటి రోజులు ఉండవేమో...
మహేంద్ర: అనుపమ నా స్నేహితురాలు..తన కొడుకువి అని తెలియకముందే నీ వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డాను. మీరిద్దరు ఎదుటివాళ్ల మంచే కోరుకుంటారు. అలాంటి మీరూ దూరంగా ఉండటం బాగాలేదు. అసలు అమ్మ అని పిలవద్దని అనుపమ నీతో ఎందుకు ఒట్టు వేయించుకుంది. కన్నతల్లి అలా ఎలా చేస్తుంది...అలా చేసిందంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు...మీ మధ్య దూరం చూస్తుంటే నాకు భారంగా ఉంది...అసలు మీ మధ్య ఏం జరిగింది
మను: మా మధ్య దూరం పెరగడానికి ఒక్క ప్రశ్న కారణం. పాతికేళ్లుగా బాధ, వేదన భరిస్తున్నది ఆ ఒక్క ప్రశ్న వల్లే. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. నా బాధకు విముక్తి కలగదంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
మహేంద్ర: ఆ ప్రశ్న ఏంటి?
మను: నా అనే వాళ్లు ఉన్నారో లేదో అనే సందిగ్ధంలో బతకాల్సిందే...ఇంతకు మించి ఏమీ చెప్పలేను..మీరు కూడా నన్ను ఏమీ అడగకండి.. అర్థం చేసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతాడు...
అనుపమ బెడ్‌పై లేచి వాకింగ్ చేస్తుంటుంది. అది చూసి వసుధార, ఏంజెల్ కంగారు పడతారు. మహేంద్ర రాలేదా అని వసుధారను అడుగుతుంది అనుపమ. మను రాలేదా అని మీరు అడుతారని అనుకున్నానని వసుధార అంటుంది. మను ఇక్కడికి ఎందుకొస్తాడు. రావాల్సిన అవసరం ఏముంటుంది అని అనుపమ బదులిస్తుంది.
వసు: మిమ్మల్ని చూడటానికి మను రాకూడదా...హక్కు లేదా ..మీరు మాటల్లో రావద్దని మనుతో చెప్పినా...మీ మనసు మాత్రం మను రావాలని కోరుకుంటోంది
అనుపమ: మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు సంతోషంగా ఫీలవ్వడం, దూరమైతే బాధపడటం ఇవన్నీ దాటుకునే వచ్చాను
వసు: ఒక్కసారి బంధం అంటూ ఏర్పడితే ప్రాణం పోయే వరకు మీ వెంటే వస్తుంది. దూరమైన, భారమైనా ఆ బంధం మిమ్మల్ని వదిలిపెట్టదు.
ఆ బంధం వల్లే మను ప్రాణాలకు మీ ప్రాణాలను అడ్డువేశారు. నిజంగా మీరు అన్ని వదిలేసి ఉంటే అలా చేసుండేవారు కాదు
వసుధార, ఏంజెల్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా కానీ మీ మాట వినాల్సిన అవసరం లేదని కఠినంగా చెప్పేస్తుంది అనుపమ...
పాతికేళ్లు అయినా నా తండ్రి ఎవరో తెలియదు!
అనుపమ ఫొటోను చూస్తూ నేను ఏం పాపం చేశాను. నీ కొడుకుగా పుట్టడమే నేను చేసిన నేరమా. నాకే ఎందుకు ఈ శిక్ష అని ఎమోషనల్ అవుతాడు. ప్రతి ఒక్కరికి తండ్రి వేలుపట్టుకుని నడక నేర్పిస్తుంటాడు. భుజాలపై ప్రపంచాన్ని చూపిస్తుంటాడు. నాకు ఆ అదృష్టం లేదు. పాతికేళ్లు అయినా ఇంకా నాకు నా తండ్రి ఎవరన్నది తెలియదు. తన పేరు కూడా తెలియదు. నా తండ్రిని చూడాలని, తనతో మనసు విప్పి మాట్లాడాలని నాకు ఉంటుంది కదా అని మను మనసులో అనుకుంటాడు. నీ తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగిన ప్రతిసారి నా గుండె ముక్కలైపోతోంది. అసలు ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెబుతావా...లేదంటే అడ్రస్ లేనివాడిలా జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
మహేంద్ర ఫైర్
ఆవేశంగా ఇంటికొచ్చిన మహేంద్ర..వచ్చిరావడంతోనే అనుపమపై విరుచుకుపడతాడు. కన్నకొడుకుపై నీకు ఎందుకు అంత పంతం. మనును అలా చూడటం నాకే బాధగా ఉంది. కన్నతల్లివైనా నీ మనసు కరగడం లేదా. ఇలా ఉండి నువ్వు ఏం సాధిస్తావు. నిజాన్ని మీ మధ్య ఇలా సమాధి చేసుకుంటే పరిష్కారం ఎలా దొరుకుతుంది . మనుకు నీకు మధ్య దూరం పెంచిన ఆ ఒక్క ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏంటో నేను చెప్పనా...తన తండ్రి ఎవరని మను నిన్ను అడిగి ఉంటాడు. అంతే కదా ...ఈ ప్రశ్నే కదా మీ ఇద్దరి మధ్య గొడవకు కారణమని అనుపమతో చెబుతాడు మహేంద్ర. నిన్ను నిలదీసినందుకు మనుకు ఇలాంటి శిక్ష వేయడంలో న్యాయం లేదంచాడు మహేంద్ర. నా జీవితంలో సంతోషానికి కారణమైన మను బాధపడకూడదు. అతడిని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. మను తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం చెప్పేవరకు నేను ఇక్కడి నుంచి కదలనని చెబుతాడు.
Also Read: మార్చి 27 రాశి ఫలాలు (27/03/2024) - ఈ రోజు ఈ రాశులవారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
వసు - ఏంజెల్
అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార...అనుపమను ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మహేంద్రతో చెబుతుంది. దేవయాని కూడా ఇంత వరకు మను తండ్రి ఎవరు అనే ప్రశ్నలతో అనుపమను బాధపెట్టిందని, ఇప్పుడు మీరు కూడా అవే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారని మహేంద్రతో అంటుంది వసుధార. ఆ మాటలతో మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది
గుప్పెడంత మనసు మార్చి 28 గురువారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో చూడాలి...