అన్వేషించండి

Guppedantha Manasu March 26th Episode: నీ తండ్రిని అంటూ మనుకి షాకిచ్చిన మహేంద్ర - శైలేంద్రని లాగిపెట్టి కొట్టిన దేవయాని , గుప్పెడంత మనసు మార్చి 26 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 26th ఎపిసోడ్)

మను తండ్రి ఎవరని ఎంక్వైరీ మొదలుపెడుతుంది దేవయాని.. సూటి పోటి మాటలతో అనుపమను ఇబ్బంది పెడుతుంది. కుంతీ పుత్రుడా ఏంటి? నీ భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? నీ కొడుక్కి అయినా తండ్రి గురించి తెలుసా లేదా? నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాల్ అనుకున్నాను కానీ నీలోకూడా చీకటి కోణం ఉందని అనుకోలేదు? 
అనుపమ: ఈ టాపిక్ వదిలేయండి
దేవయాని: నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా..నీ భర్త పేరు చెప్పడం ఇష్టంలేకపోతే చిన్న క్లూ అయినా ఇవ్వు అని అనుపమని ఇబ్బంది పెడుతుంటుంది...
ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది
వసు: అనుపమ గారిని ఏదో అడుగుతున్నట్టున్నారు..
దేవయాని: మామూలుగా మాట్లాడుతున్నాను
వసు: ఏదో గుచ్చిగుచ్చి అడుగుతున్నట్టున్నారు
దేవయాని: మను తన కొడుకు అని తెలిసింది కదా..ఇప్పటి వరకూ అనుపమ ఒంటరిది అనుకున్నా కానీ తనకీ ఓ కుటుంబం ఉందని అర్థమైంది.. మను తన కొడుకు అన్నారు కదా తన తండ్రి ఎవరని అడుగుతున్నాను
వసు: ఎవరైతే మీకేంటి...
దేవయాని: వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలిచి చీర పెట్టి పంపిద్దామని
వసు: పాపాలు చేసే చేత్తో చీర పెట్టడం ఎందుకు...
ఇంతలో ఏంజెల్ వచ్చి కాఫీ ఇస్తుంది... చెప్పినట్టుగానే పెద్ద కప్పులో తీసుకొచ్చాను..
దేవయాని: మీ అత్తయ్యకి కూడా ఇవ్వలేకపోయావా...
ఏంజెల్: మా అత్తయ్య కాఫీ తాగకూడదు లెండి...
దేవయాని: మీ అత్తయ్య నేను మాట్లాడుతుంటే మాట్లాడడం లేదు..మీ మావయ్య గురించి సైలెంట్ గా ఉంటోంది..మీ మావయ్య గురించి నీకైనా చెప్పిందా?
ఏంజెల్ మౌనంగా ఉండిపోతుంది..
ఏంటి అనుపమా ఇంత సీక్రెట్ మెంటైనే చేస్తున్నావ్ అంటూ మాటలతో హింసిస్తుంది...
ఏంజెల్: అత్తయ్యకి చెప్పడం ఇష్టంలేదు..మీరెందుకు అలా అడుగుతున్నారు..
దేవయాని: ఏదో రోజు నిజం బయటపడాల్సిందే కదా...సరే నాకు కాకపోయినా నీకైనా చెప్పాలి కదా..
వసు: అవి చెప్పేదిచెప్తుంది..మేం చూసుకుంటాం మీరు మా విషయంలో కంగారు పడకండి..ఇందులో మీకు జోక్యం అనవసరం.. చెప్పాలి అనుకుంటే చెబుతారు, వద్దనుకుంటే మానేస్తారు..పరామర్శకు వచ్చినవారు ప్రశ్నలు వేసి వెళ్లిపోవాలి... వచ్చామా, పలకరించామా , వెళ్లామా అన్నట్టుండాలి
దేవయాని: అనుపమ చెప్పకపోతే తెలుసుకోలేమా ఏంటి..మను గురించి తెలిసినట్టే తన భర్త గురించి తెలుస్తుంది..
వసు: మీకు అవసరం లేని విషయం గురించి ఆరాలు తీయకండి..మీ ఆరోగ్యానికి మంచిది కాదు..

Also Read: మనుపై అనుపమకి కోపం అందుకేనా - ఈ ఫజిల్ సాల్వ్ చేసేది వసుధారేనా , గుప్పెడంత మనసు మార్చి 23 ఎపిసోడ్!

శైలేంద్ర చిరాగ్గా వచ్చి కూర్చుంటాడు... ధరణి వచ్చి కాఫీ కావాలా అని అడుగుతుంది. వద్దు అని చెప్పినా కానీ విసిగిస్తుంది. ఫైర్ అయిన శైలేంద్రతో...కాఫీ ఇవ్వకపోతే బెల్టుతో కొట్టుకుంటారా ఏంటి అంటుంది. మమ్మీ ఏదని అడిగితే..ఇంకా రాలేదని చెబుతుంది ధరణి... చాలా సేపైంది ఇంకా రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తాడు శైలేంద్ర.  ఇంతలో దేవయాని రాగానే...అనుపమని కలిశావా అనుకున్నది జరిగిందా అని అడుగుతాడు..కోపంగా ఒక్కటి కొడుతుంది... అదేంటి నన్ను కొట్టావ్ అంటే.. వసుధారకి పడాల్సిన దెబ్బ నీకు పడిందని చెబుతుంది. 
దేవయాని:  మను అనుపమ మధ్య మాటలు లేకపోవడానికి ఏదో కారణం ఉంది అది నువ్వు కనిపెట్టు
శైలేంద్ర: నువ్వెళ్లిందికి అందుకేనా
దేవయాని: ఎన్ని అడిగినా తను మౌనంగానే ఉంది..నాకు డౌట్ ఉంది అది కన్ఫామ్ చేసుకుని నీకు చెబుతా..కొంచెం టైమ్ కావాలి అని చెప్పేసి వెళ్లిపోతుంది..

Also Read:  శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!

వసు-ఏంజెల్
మా అత్తయ్య జీవితంలో ఏం జరిగిఉంటుంది..ఎందుకు తను అలా ఉంటోంది అని ఏంజెల్ అంటే..అదే అర్థం కావడం లేదు అంటుంది వసుధార. 
వసు: తన గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? తన గతం గురించి కచ్చితంగా ఎవరికైనా తెలిసి ఉంటుంది
ఏంజెల్: మా అత్తయ్య విషయాలు మాక్కూడా తెలియదు, ఫ్రెండ్స్ అంటే మహేంద్ర సరే..సర్ కి తెలియదు అంటే అలాంటప్పుడు ఇంకెవరికి తెలిసి ఉంటుంది . మనుని మా అత్తయ్యని చూస్తే గతంలో నిన్ను-రిషిని చూసినట్టే ఉంది.. అప్పుడు నేను ఎన్నిసార్లు అడిగినా మీ బంధం బయటపెట్టలేదు...
వసు: మేం ఉన్న పరిస్థితి అలాంటిది
ఏంజెల్: వీళ్ల మధ్య కూడా ఏదో జరిగింది..ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది
వసు: ఆ కారణం తెలియడం లేదు...
ఏంజెల్: మనసులో అంత బాధ పెట్టుకుని ఎందుకలా ఉంటారో అర్థంకావడం లేదు. నాకు పెళ్లిచేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ ఆ విషయం చెప్పింది నీకే. అప్పటికే మీకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది...అప్పుడు కూడా నిజం చెప్పలేదు..నిన్నుకూడా చాలాసార్లు అడిగినా చెప్పలేదు.. ఇప్పుడు కూడా అత్తయ్య మీలానే ప్రవర్తిస్తోంది
వసు: చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతారులే...

Also Read: ఈ రాశివారికి శని ప్రభావం తగ్గి గురుబలం పెరుగుతుంది - మీపై ఈర్ష్య, అసూయ ఎక్కువే - శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు!

మహేంద్ర - మను
ఎన్నిసార్లు అడిగినా మను కూడా నిజం చెప్పడు. నేను నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నా అనుకో అంటాడు మహేంద్ర...నా దగ్గర నీకెందుకు దాపరికం చెప్పొచ్చు కదా అంటాడు. షాక్ అయిన మను... కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది అని తప్పించుకుంటాడు.
మహేంద్ర: నీ మనసులో బాధ మన అనుకున్నవారికి చెప్పుకుంటే బాధ పోతుంది
మను: మీరు విషయం తెలియక అలా అంటున్నారు
మహేంద్ర: ఆ విషయం ఏంటో చెప్పు..నువ్వు తనకోసం తను నీకోసం బాధపడడం ఎందుకు చెప్పు..మీ మధ్య సమస్య సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా
మను: అందరిలానే నాక్కూడా పేరెంట్స్ తో కలసి ఉండాలని ఉంది..కన్నవాళ్లకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఉంది కానీ అది నా కల ఈ జీవితంలో నాకు అలాంటి రోజులు లేవు..ఇకపై ఉండవేమో
మహేంద్ర: నేను చెబుతున్నాను కదా... సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది
మను: జీవితాంతం మా మధ్య సమస్య సమస్యగానే ఉండిపోతుంది...
గుప్పెడంత మనసు మార్చి 26 ఎపిసోడ్ ముగిసింది...

గుప్పెడంత మనసు మార్చి 27 ఎపిసోడ్ లో మను తన గతం గురించి మహేంద్రకి చెబుతాడేమో చూడాలి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget