Guppedantha Manasu March 23rd Episode: మనుపై అనుపమకి కోపం అందుకేనా - ఈ ఫజిల్ సాల్వ్ చేసేది వసుధారేనా , గుప్పెడంత మనసు మార్చి 23 ఎపిసోడ్!
Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు మార్చి 23rd ఎపిసోడ్)
కార్లో ఉన్న మెడిసిన్ తీసుకొచ్చేందుకు ఏంజెల్ వెళుతుంటే ఆపేస్తుంది వసుధార... మను వెళ్లి తీసుకొచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తాడని చెప్పి... ఎంజెల్ ని తీసుకుని కిచెన్లోకి వెళ్లిపోతుంది. మరోవైపు రూమ్ సర్దే పని మహేంద్రకి అప్పగిస్తుంది. మను-అనుపమ మాట్లాడుకునేందుకు ఇలా చేస్తుంది వసు. ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చిన మను..నేను వెళతాను ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి అంటాడు. అవసరం రాదేమో అనేస్తుంది అనుపమ.. కోపంగా వెళ్లిపోతాడు మను. ఆపేందుకు వసుధార ప్రయత్నించినా ఆగడు...
కార్లో వెళుతూ..అటాక్ గురించి గుర్తుచేసుకుంటాడు..నా ప్రాణం కాపాడేందుకు రక్తం దారపోసింది..ఇప్పుడు తను గాయపడితే పక్కనైనా ఉండే అదృష్టం లేకపోయింది..మా అమ్మతో కలసి సంతోషంగా ఉండే రోజు రాదా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందంటారు కదా? సమాధానం దొరకనప్పుడు ప్రశ్నకు విలువేం ఉంటుంది? నా బతుక్కి అర్థం ఏం ఉంటుంది? అనుకుంటాడు...
Also Read: మను తండ్రి ఎవరన్న ఎంక్వైరీ మొదలు - శైలేంద్రకి కొత్త బాధ్యతలు , గుప్పెడంత మనసు మార్చి 22 ఎపిసోడ్!
మహేంద్ర రూమ్ సర్దిన తర్వాత...వసు-ఏంజెల్ ఇద్దరూ అనుపమని తీసుకెళ్తారు...మను ఏడి అని మహేంద్ర అడిగితే..వెళ్లిపోయాడు అని చెబుతుంది
మహేంద్ర: కనీసం నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు
అనుపమ: తనే వెళ్లిపోయాడు
మహేంద్ర: తను వెళతానంటే పంపించేయడమేనా?ఇన్నాళ్లూ తనెవరో తెలియదు అందుకే ఏమీ మాట్లాడలేకపోయాం...నువ్వు తనని ఎంత బాధ పెడుతున్నావో తెలుసా..
ఏంజెల్: అత్తయ్య కూడా చాలా బాధపడుతోంది
మహేంద్ర: తను బాధ పడతూ మనుని కూడా బాధపెట్టడం ఎందుకు.. జగతి-రిషి కూడా ఇదే పెయిన్ అనుభవించారు.. అందరి ముందూ బానే ఉన్నా లోలోపల కుమిలిపోయేది, తల్లి కొడుకులు పరిచయం లేనివాళ్లలా ఉంటున్నారంటే మీ మధ్య ఏదో జరిగి ఉంటుంది? అనుపమ కుటుంబం అన్నా గొడవలు పంతాలు ఉంటాయి...కొడుకు విషయంలో ఇలా ఎలా ఉంటున్నావ్... నువ్వు మను విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నావ్.. కన్న కొడుకుతో ఏ తల్లీ ఇలా ప్రవర్తించదు... మీ ఇద్దరి మధ్యా ఏం జరిగిందని వరుస ప్రశ్నలు సంధిస్తాడు
అనుపమ: తన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు
మహేంద్ర: సమాధానం లేని ప్రశ్నలు ఉండవు..కానీ నువ్వు చెప్పాలి అనుకోవడం లేదు
వసు: మను తప్పు చేస్తే సర్దిచెప్పాలి కానీ ఇలా దూరంగా ఉండడం ఏంటి...అందరి విషయంలో సాప్ట్ గా ఉండేమీరు మను విషయంలో మొండిగా ప్రవర్తిస్తున్నారు
అనుపమ: నేను ఏమీ చెప్పలేను...మా మధ్య బంధం, దూరం అంతా విధి నాటకం
మహేంద్ర: తెలివిగా మాట్లాడకు..కన్నబిడ్డను వేధించాలి అనుకుంటున్నావా?
ఏంజెల్: అత్తయ్య అలా అనుకోరు..
మహేంద్ర: మరి ఇలా ఎందుకుచేస్తోంది...కారణం ఏంటో చెబితే ఏమవుతుంది..అమ్మా అని పిలవొద్దని నువ్వే మాట తీసుకున్నావట కదా? ఏ తల్లి అయినా కొడుకు దగ్గర అలా ఒట్టు వేయించుకుంటుందా? నీకు ఇచ్చిన మాట తప్పానని మను ఎంత బాధపడ్డాడో తెలుసా? అమ్మా అనే పిలుపు కోసం స్త్రీ ఆరాటపడుతుంది...నువ్వు పిలవొద్దని అనడం ఏంటో నాకు అర్థం లేదు..నీకు మను అంటే ప్రాణం అని అర్థమవుతోంది అందుకే తన ప్రాణానికి నీ ప్రాణం అడ్డుపెట్టావ్...కానీ ఇంత జరిగాక కూడా నువ్వు కొడుకులా ట్రీట్ చేయడం లేదు ఎందుకు?
Also Read: ఉత్తరాదిన అంబరాన్నంటే హోలీ సంబరం , కన్నయ్య పుట్టి పెరిగిన ప్రదేశాల్లో అంతకు మించి!
కాలేజీకి వెళ్లాలి మావయ్య రండి..ఏంజెల్ అనుపమ మేడంని చూసుకుంటుంది అని చెబుతుంది వసుధార. నువ్వెళ్లు నాకు పని ఉంది చూసుకుని వస్తాను అంటాడు. అనుపమ నువ్వు ఈ రోజు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అనుకుంటాడు...
శైలేంద్ర-రాజీవ్
మనం లవర్స్ కలిసినట్టు కలుస్తున్నాం దేనికి పిలిచావ్ అని రాజీవ్ అడిగితే... శుక్రవారం ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అని డిస్కస్ చేద్దాం అని పిలిచానని సెటైర్ వేస్తాడు. మనుపై అటాక్ చేయలేకపోయాం, అనుపమ అయినా పోయి ఉండే బావుండేది అది బతికింది...ఇప్పుడది నోరు విప్పితే మనం దొరికిపోతాం..అందుకే ప్రస్తుతానికి మన ప్రయత్నాలు పక్కనపెట్టేసి కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండే బావుంటుంది అంటాడు. నువ్వు సైలెంట్ గా ఊరుకో నా ప్రయత్నాలు నేను చేస్తాను అంటాడు రాజీవ్. మొన్న చేశావ్ కదా పోస్టర్స్ విషయంలో అని దెప్పిపొడుస్తాడు శైలేంద్ర. అందుకే ఇకనుంచి డైరెక్ట్ అటాక్ చేస్తాను అంటాడు రాజీవ్. వీడెవడురా బాబూ జాగ్ర్తతగా ఉండమని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అనుకుంటాడు..
కాలేజీలో వసుధార వర్క్ చేసుకుంటుంది..ఇంతలో కాల్ వస్తుంది..శాలరీస్ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత అనుపమ... పోస్టర్స్ విషయంలో మనుపై ఫైర్ అయిన విషయం గుర్తుచేసుకుంటుంది. అసలు మను గారి తప్పులేకపోయినా అపార్థం చేసుకున్నాను, అందరి విషయంలో కరెక్టుగా ఉండేనేను మను విషయంలో తప్పుగానే ఆలోచిస్తున్నాను..ఒక్కసారి తనతో మాట్లాడాలి అనుకుంటూ తన క్యాబిన్ కి వెళుతుంది కానీ క్లోజ్ చేసి ఉండడం చూసి...అటెండర్ ని పిలిచి అడుగుతుంది. సర్ కాలేజీకి రాలేదు మేడం అని చెబుతాడు. అప్పుడు వసుధార కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు.
Also Read: నేటి రాశి ఫలాలు (23/03/2024) , ఈ రాశి ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు!
అనుపమకి సేవలు చేస్తుంటాడు మహేంద్ర.. మళ్లీ అనుపమ గతం గురించి మొదలుపెడతాడు..ఆమె సైలెంట్ గా ఉండిపోతుంది. మాకు సంబంధించిన అన్నీ తెలుసుకున్నావ్...మరి నీ గురించి చెప్పమంటే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు, నీకు బాధ కలిగించే విషయమే అయి ఉండొచ్చు కానీ నువ్వు మాకు చెప్పలేదంటే నన్ను పరాయివాడిలా చూసినట్టే కదా అంటాడు. నువ్వు జగతి విషయం నా దగ్గర దాచావ్ మొదట్లో ..అంటే నన్ను కూడా పరాదాన్ని చేశావ్ కదా అని పంచ్ వేస్తుంది. నా గురించి నీకు అన్నీ తెలియాలని లేదు అనేస్తుంది. నువ్వు మను తల్లివి అయితే...తండ్రి ఎవరు అని క్వశ్చన్ చేస్తాడు మహేంద్ర...
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది....