Holi Celebrations 2024: ఉత్తరాదిన అంబరాన్నంటే హోలీ సంబరం , కన్నయ్య పుట్టి పెరిగిన ప్రదేశాల్లో అంతకు మించి!
Holi Celebrations 2024: భిన్న సంస్కృతుల నిలయమైన మన దేశంలో పండుగలు జరుపుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. రంగుల పండుగ అని కామన్ గా పిలుచుకున్నా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుకుంటారు హోలీ..
Holi Celebrations in Different Places In India: హోలీ వేడుకలు దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ఇంకా బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రీ కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశాల్లో సంబరం అంబరాన్నంటుంతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకలు ఎలా జరుగుతాయో ఇక్కడ తెలుసుకోండి...
మథుర
శ్రీ కృష్ణుడి జన్మ స్థలం అయిన మథుర బృందావనంలో హోలీ వేడుకలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. హోలీ వేడుకలు 16 రోజుల పాటూ జరుపుకుంటారు..
బర్సాన
ఉత్తర ప్రదేశ్ బర్సానాలో హోలీ వేడుకలు చాలా చాలా ప్రత్యేకం. హోలీని లాఠ్ మార్ అని పిలుస్తారు. 'మార్' అంటే కొట్టు అని అర్థం. హోలీ రోజు స్త్రీలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. శ్రీకృష్ణుడు గోపికలు హోలీ ఇలాగే ఆడేవారని అదే సంప్రదాయం కొనసాగిస్తున్నామని చెబుతారు స్థానికులు. హోలీ రోజు బర్సానాలో ఉన్న రాధా కృష్ణుల ఆలయంలో సంప్రదాయ నృత్యాలు హోరెత్తిపోతాయి. ఉత్తర ప్రదేశ్ లో చాలా చోట్ల భాంగ్ హోలీ నిర్వహిస్తారు. భాంగ్ అంటే గంజాయితో తయారు చేసిన పేస్ట్...హోలీ రోజు తయారు చేసిన ఆహారాల్లో పానీయాల్లో దీన్ని వినియోగిస్తారు.
Also Read: హోలీ రోజు నుంచి ఈ 4 రాశుల వారి జీవితంలో ఇంద్రధనస్సు వెల్లి విరుస్తుంది!
గుజరాత్
గుజరాత్ లో హోలీ రోజు భారీగా మంటలు వేసి వాటి చుట్టూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తారు
మహారాష్ట్ర
మహారాష్ట్రలో హోళీ వేడుకకు వారం రోజుల ముందుగానే ఊరంతా తిరిగి పాత కలపను సేకరిస్తారు. హోలీ రోజు వాటిని మంటల్లో వేసి హోలికా దహనం నిర్వహిస్తారు. ఈ మంటలకు స్వీట్లను నైవేద్యంగా కూడా సమర్పిస్తారు
మణిపూర్
మణిపూర్ లో హోలీ రోజు ఆడపిల్లలకు మగపిల్లలు డబ్బులిస్తేనే రంగులు చల్లుతారు. ఇక్కడ కూడా హోలికా దహనం నిర్వహించి ఆటపాటల్లో మునిగితేలుతారు. ఇక్కడ వారం రోజుల పాటూ ఉత్సవాలు సంబరంగా నిర్వహించి ఆఖరి రోజు..కృష్ణుడి ఆలయం వరకూ పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు.
Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!
శాంతినికేతన్
పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్ లో రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీని ఆనందిస్తారు. ఆటపాటల మధ్య రాథాకృష్ణుల విగ్రహాలను ఊరేగిస్తారు.
ఉదైపూర్
రాజస్థాన్ ఉదైపూర్ లో హోలీ వేడుకలను డిఫరెంట్ గా జరుగుతాయి...ఎక్కడైనా హోలీ రోజు రంగులు చల్లుకోవడం కామన్ కానీ.. ఇక్కడ మాత్రం కర్రలను కలెక్ట్ చేసి ఊరి చివర పోగు పోసి హోలికా దహనం నిర్వహిస్తారు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి నాశనం అవుతుందని వారి విశ్వాసం..
అహ్మదాబాద్
అహ్మదాబాద్ లో హోలీ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే సంప్రదాయం పాటిస్తారు. అయితే ఇక్కడ ఉట్టెలో పెట్టిన కుండలో మజ్జిగ పోస్తారు. ఆ కుండను ఎవరైతే పగులకొడతారో వాళ్లో హోలీ రాజు అవుతారు.
Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!
ఇంఫాల్
మణిపూర్ రాజధానైనా ఇంఫాల్ లో కూడా హోలీ వేడులకు దాదాపు వారం పాటూ ఘనంగా జరుపుకుంటారు. జానపద నృత్యాలతో ఆనందిస్తారు.
జైపూర్
జైపూర్ లో ఏనుగులకు, ఒంటెలు, గుర్రాలపై హోలీ రంగులు కుమ్మరిస్తారు. ఆ తర్వాత వాటిని వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ సందర్భంగా చేసే సంప్రదాయ నృత్యాలు కలర్ ఫుల్ గా ఉంటాయి.
ఒడిశా
ఒడిశాలో పూరీ జగన్నాథ్ ఆలయం సహా స్థానికంగా ఉన్న జగన్నాథుడి ఆలయాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం హోలీ వేడుకలు వైభవంగా ప్రారంభమవుతాయి.
వారణాసి
వారణాసిలో మణికర్ణిక ఘాట్ దగ్గర శవాల బూడిదతో హోలీ సంబరాలు నిర్వహిస్తారు. శివపంచాక్షరి జపిస్తూ బూడిద పూసుకుని వీధుల్లో తిరుగుతారు.
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
ఏబీపీ దేశం తరపున మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు