Holi Celebration 2024: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!
Holi 2024 :ఆనందాన్ని రంగుల రూపంలో తీసుకొచ్చో హోలీని దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో, ఒక్కో పద్ధతిలో జరుపుకుంటారు. వారణాసిలో 5 రోజుల ముందుగానే వేడుక ప్రారంభమవుతుంది..ఎందుకో తెలుసా..
Varanasi Holi 2024: ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు. దీనినే హోలీ, కామదహనం, కానుని పున్నమి, డోలికోత్సవం అంటారు. దేశ వ్యాప్తంగా ఒక్కరోజు జరిగే ఈ వేడుకను పరమేశ్వరుడు కొలువైన కాశీలో మాత్రం ఐదురోజుల ముందుగా ఏకాదశి రోజు నుంచే మొదలవుతుంది. అయితే హోలీ వేడుకలు అంటే ఎక్కడైనా రంగులు, రంగు నీళ్లతో జరుపుకుంటే కాశీలో మాత్రం చితా భస్మంతో జరుపుకుంటారు. ఈ వినూత్న వేడుక చూసేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశీయులు సైతం బారులుతీరుతారు. దీనినే శ్మశాన హోలీ అంటారు.
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
శ్మశాన హోలీ ప్రత్యేకత
శ్మశాన హోలీ జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంటలు 24 గంటలు మండుతూనే ఉంటాయి. ఈ ఘాట్ లో ఏకాదశి రోజు చితాభస్మాన్ని చల్లుకోవడంతో హోలీ వేడుకలకు మొదలుపెడతారు. ఈ సమయంలో నాగ సాధువులు పాన్, బంగ్ అనే మత్తు కలిగించే పదార్థం తీసుకుంటారు. దీనినే పరమేశ్వరుడి మహాప్రసాదంగా భావిస్తారు. వేడుకకు ముందు చితికి మంగళహారతి ఇచ్చి ఢమరుకం మోగించి పంచాక్షరి మంత్రాన్ని దిక్కులు పిక్కటిల్లేలా జపిస్తారు. కేవలం మణికర్ణికా ఘాట్ లో మాత్రమే కాదు ఆ బూడిదను కాశీ విశ్వనాథుడి దేవాలయంలోకి కూడా తీసుకెళతారు.
విశ్వనాథుడు సతీ సమేతంగా కాశీలో అడుగుపెట్టిన రోజు
పురాణ కథనం ప్రకారం విశ్వనాథుడు పార్వతీదేవిని తీసుకుని కాశీనగరంలో అడుగుపెట్టిన సందర్భంగా రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారని చెబుతారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలపై రంగులు చల్లుతూ ఊరేగిస్తారు. ఈ సంప్రదాయ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రాతినిథ్యం వహిస్తారు.
Also Read: మొదటి 2 నెలలు మినహా క్రోధినామ సంవత్సరం ఈ రాశివారికి తిరుగులేదంతే!
ప్రతికూల శక్తుల నుంచి విముక్తి
సాధారణంగా చనిపోయిన వారికి శోక సంద్రంతో వీడ్కోలు పలుకుతారు. హరిశ్చంద్ర ఘాట్ మొత్తం అలాంటి వాతావరణమే ఉంటుంది. కానీ రంగభరి ఏకాదశి నాడు మాత్రం అందుకు భిన్నంగా.. శివ భక్తులు కాలుతున్న మంటలపై పాటలు పాడుతూ.. నాట్యం చేస్తూ భక్తిలో మునిగి తేలుతూ.. ఒకరిపై ఒకరు బూడిద జల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకుంటారు. విశ్వనాథుని సన్నిధిలో బూడిదతో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల దయ్యాలు, పిశాచాల బెడద తొలగిపోతుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ భిన్నమైన వేడుకలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
విశ్వ నాధాష్టకమ్
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||
Also Read: ఉగాది వరకూ ఈ రాశులవారికి ఆదాయం - ఆ 5 రాశులవారికి అసహనం!