శ్రీ క్రోధినామ సంవత్సర మేష రాశిఫలితాలు - 2024 ఎప్రిల్ to 2025 మార్చి

మేష రాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 8 , వ్యయం:14 , రాజపూజ్యం:4 , అవమానం:3

శ్రీ కోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి గురుడు ధనస్థానంలో , శని 11 వ స్థానంలో.....

రాహు కేతువులు ఆరోస్థానంలో ఉన్నందున ఆదాయం బావుంటుంది. చేపట్టిన పనులపట్ల విజయం సాధిస్తారు.

మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి.

హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయమవుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది

ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు చేసేస్తారు..చేతిలో డబ్బు నిలవదు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి

బంధువుల మరణవార్తలు వింటారు..ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

దీర్ఘంకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.

ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ ఏడాది కార్యరూపం దాల్చుతుంది.

Image Credit: Pixabay