Holi 2024: హోలీ రోజు నుంచి ఈ 4 రాశుల వారి జీవితంలో ఇంద్రధనస్సు వెల్లి విరుస్తుంది!
Lunar Eclipse on Holi 2024: ఈ రాశుల వారికి హోలీ నుంచి మంచి రోజులు మొదలుకానున్నాయి. చంద్రగ్రహణంతో పాటూ అరుదైన గ్రహాలు సంయోగం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి శుభ ఫలితాలున్నాయి.
Holi 2024 these 4 Zodiacs Will Be Blessed: ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు హోలీ దహన్ నిర్వహిస్తారు. ఇంద్ర ధనస్సు రంగుల్లో మునిగితేలుతారు. చిన్నా పెద్దా అందరూ తమ హోలీ ఆడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ ఏడాది ఫాల్గున మాసం పౌర్ణమి మార్చి మార్చి 24, 2024 ఉదయం ప్రారంభమై మర్నాడు మధ్యాహ్నం వరకూ ఉంది. అందుకే మార్చి 24 అర్థరాత్రి హోలీ దహన్ నిర్వహిస్తారు..మార్చి 25 ఉదయం రంగులు చల్లుకుని హోలీ ఆడుతారు. అయితే ఈ ఏడాది హోలీ రోజున గ్రహాల అద్భుత కలయిక జరుగుతోంది.
- హోలీ రోజు సూర్యుడు, బుధుడు , రాహువు మీన రాశిలో ఉంటారు
- శని, కుజుడు , శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తారు
- కన్యారాశిలో కేతువు సంచరిస్తాడు
- మేష రాశిలో ఉంటాడు బృహస్పతి
ఈ గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి మంచి ఫలితాలనిస్తున్నాయి...ముఖ్యంగా మేష రాశి, వృషభ రాశి, తులా రాశి, కుంభ రాశివారికి మంచి ప్రయోజనాలున్నాయి.
మేష రాశి
మేషరాశి వారికి హోలీ నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయి. కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆర్థిస ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది. వస్తు సౌఖ్యం ఉంటుంది
వృషభ రాశి
హోలీ రోజు నుంచి వృషభ రాశివారికి మంచి రోజులొచ్చినట్టే. ఆదాయం పెరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వృత్తికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు.
తులా రాశి
ఈ రాశివారికి హోలీ రోజు నుంచి లైఫ్ లో బ్యాడ్ డేస్ కి ఎండ్ పడినట్టే. కుటుంబంలో, వృత్తి, ఉద్యోగాల్లో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించి సమాచారం వింటారు. చేపట్టిన పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు.
Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!
కుంభ రాశి
చంద్రగ్రహణం, హోలీ రోజు నుంచి మీకు అదృష్టం మొదలవుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు చెక్ పడుతుంది. కెరీర్లో బాగా సక్సెస్ అవుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
( ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
(ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
(ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
(ఉగాది 2024 - 2025 క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)