Today Horoscope in Telugu : మార్చి 27 రాశి ఫలాలు (27/03/2024) - ఈ రోజు ఈ రాశులవారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Horoscope Prediction 27th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Daily Horoscope for March 27th 2024
మేష రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వొద్దు..తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో రిస్క్ తీసుకోవద్దు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయించాలి. సమస్యలు ఏమైనా ఉంటే మీ భాగస్వామి లేదా తల్లిదండ్రులతో పంచుకుంటే పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశి
ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతమైన మనస్సుతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచండి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పనిలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథున రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మీ వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు.
కర్కాటక రాశి
కార్యాలయంలో చాలా పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి. కెరీర్‌లో పురోభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పనులు పూర్తి చేయడంలో ఎక్కువ ఆలస్యం చేయవద్దు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
సింహ రాశి
సహోద్యోగులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరికి పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కన్యా రాశి
ఈ రోజు మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పిల్లల వైపు నుంచి గుడ్ న్యూస్ వింటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
తులా రాశి
భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. చాలా కాలంగా రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఉద్యోగుల ప్రమోషన్‌కు సంబంధించి సమాచారం వింటారు. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, షేర్లు లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా వ్యాపార సంబంధిత నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండవచ్చు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారి జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకుల సంకేతాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. ఈరోజు వ్యాపారులకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
మకర రాశి
ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభ రాశి
వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కార్యాలయంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి
మీన రాశి
జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. తగిన విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో సవాళ్లను అధిగమించేందుకు సీనియర్ల సలహాలు తీసుకోవాలి. వ్యక్తిగత - వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి.