అన్వేషించండి

Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన

తను కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో కోహ్లీ జోక్యం చేసుకునేవాడని, అతడి ఇష్టాన్ని బట్టే ప్లేయర్ల స్థానాలు డిసైడ్ అయ్యేవని మాజీ క్రికెటర్ ఆరోపణ. ఈ వివాదంలో ఇద్దరు తెలుగు వాళ్ల పేర్లు ఉండటం విశేషం.

3d Player News: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన ప్రశ్నల బాణాలను మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంధస్తూనే ఉన్నాడు. యువరాజ్ సింగ్ కెరీర్ అర్థాంతరంగా ముగియడానికి కారణం కోహ్లీనే అని తేల్చిన ఉతప్ప.. తాజాగా తెలుగు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడి గురించి కూడా చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో రాయుడు.. టీమిండియాలోకి ఎంపిక కాకపోవడానికి గల కారణం కోహ్లీనే అని కుండబద్దలు కొట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీకి నచ్చని వారికి టీమిండియాలో ఎంట్రీ క్లోజ్ అవుతుందని, అతని రాగద్వేషాలపైనే అప్పట్లో జట్టు ఎంపిక నడిచేదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ కు రాయుడు కచ్చితంగా ఎంపికవుతాడని అందరూ భావించారు. అయితే సడెన్ గా రాయుడు ప్లేస్ లో తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. అప్పట్లో ఈ ఘటన సెన్సెషన్ అయింది. తాజాగా ఈ ఘటన వెనకాల కారణంగా కోహ్లీనే అని ఉతప్ప ఆరోపిస్తున్నాడు. 

త్రీడీ ప్లేయర్ వివాదం.. 
నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ కు చీఫ్ సెలెక్టర్ గా తెలుగు ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ పని చేశాడు. అతని నాయకత్వంలోనే టీమిండియాను ఎంపిక చేశాడు. రాయుడుని కాకుండా విజయ్ శంకర్ ను ఎంపిక చేయడం, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో పనికొచ్చే త్రీడి ప్లేయర్ తను అని ఎమ్మెస్కే తన ఎంపికను సమర్థించుకున్నాడు. అప్పటి నుంచి విజయ్ శంకర్ కు త్రీడీ ప్లేయర్ అని పేరు స్థిరపడి పోయింది. ఆ సెలెక్షన్ పై ఫైరయిన రాయుడు.. వన్డే ప్రపంచకప్ చూడటానికి త్రీడి కళ్లద్దాలను ఇప్పుడే ఆర్డర్ చేశానని సోషల్ మీడియాలో వివాదస్పదమైంది. ఎమ్మెస్కేపై కోపంతోనే అతను ఇలా చేశాడని అందరూ భావించారు. దీనిపై అప్పట్లో వాడి వేడి చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ ఘటన వెనక ప్రధాన కారకుడు కోహ్లీయే అని ఉతప్ప బాంబ్ పేల్చడం కలకలం రేగింది. కోహ్లీ వ్యవహార శైలి వలనే అప్పటి భారత ప్లేయర్లు ఇబ్బంది పడ్డారని పలు ఉదాహరణలతో వివరిస్తున్నాడు. 

నొత్తి నోరు కొట్టుకున్న ఎమ్మేస్కే..
మరోవైపు రాయుడుని జట్టులోకి ఎంపిక చేయక పోవడానికి గల కారణం ఎమ్మేస్కే ప్రసాదేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక అటు రాయుడు, ఇటు ప్రసాద్ ఇద్దరు తెలుగువాళ్లే కావడంతో తెలుగు నాట కులచర్చ కూడా జరిగింది. కాపు కులస్తుడైన రాయుడుని, కమ్మ కులస్తుడైన ప్రసాద్ తొక్కేశాడని పలువురు ఫైరయ్యారు. తను జట్టులోకి ఎంపిక కాలేకపోవడానికి గల కారణం ప్రసాదేనని రాయుడు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై గతంలో ప్రసాద్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. రాయుడుlr ఎంపిక చేయకపోవడమనేది  కెప్టెన్ కోహ్లీతోపాటు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయమని నొత్తి నోరు కొట్టుకుని చెప్పాడు. అయితే అప్పట్లో ఈ వాదనను ఎవరూ అంగీకరించకపోయినా, ఉతప్ప తాజా స్టేట్మెంట్ తో ఈ వార్తల్లో నిజముందని తెలుస్తోంది. ఏదేమైనా తనపై రోజుకో ఆరోపణ చేస్తున్న ఉతప్పకు కోహ్లీ తగిన జవాబివ్వాలని అతని అభిమానులు భావిస్తున్నారు. తను కూడా సోషల్ మీడియాలోకొచ్చి తన వంతు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారు. 

Also Read: 300 In Odi's: రోహిత్ శర్మ వన్డే హయ్యెస్ట్ స్కోరు రికార్డు బద్దలు.. ట్రిపుల్ సెంచరీతో లేడీ క్రికెటర్ చెక్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget