Guppedantha Manasu October 8th Update: జగతి విశ్వరూపం చూసి షాక్ అయిన వసు, రిషిలో ఇకనైనా మార్పు వస్తుందా!
Guppedantha Manasu October 8th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 8th Today Episode 576)
నాకు తెలియకుండా నా వీడియో ఎందుకు తీశారని వసు అడిగితే..నా క్యాబిన్ ని నేను వీడియో తీశాను క్యాబిన్లో నువ్వున్నాయ్ కాబట్టి నువ్వు పడ్డావ్ అంటాడు రిషి. నేనేం తప్పు మాట్లాడలేదని వసు అంటే..మీరు కూడా చాలాసార్లు నన్ను చాలా మాటలన్నారు అంటుంది. ఇద్దరూ కాసేపు సరదాగా వాదించుకుంటారు. ఈ మధ్య నీకు ధైర్యం ఎక్కువైందని రిషి అంటే ప్రేమకు మించిన ధైర్యం ఏముంది అంటుంది. ఎన్ని చెప్పినా నా మాట వినవు కదా అని రిషి అంటే అదే మాట నేను కూడా అడుగుతున్నా అనగానే వెళ్లిపోతాడు రిషి...
ధరణి వంటచేస్తుంటే జగతి వచ్చి పనింకా పూర్తికాలేదా హెల్ప్ చేస్తానంటుంది జగతి. ఇంకా వెళ్లలేదా అని దేవయాని ఎంట్రీ ఇస్తుంది.
దేవయాని: ధరణికి ఏమైనా చెప్పాల్సినవి ఉన్నాయా..నువ్వు అందరి జీవితాలను రిమోట్ లా తెలియకుండా ఏదైనా చేయగలవు జగతి..నేను చెప్పినదాంట్లో తప్పుందా ధరణి..మనిద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం..మనిద్దరం ఫ్రెండ్స్.. మనిద్దరి రిషి బావుండడం కావాలి...కానీ ఇక్కడ వసుధార ప్రాబ్లెమ్.. వసుతో రిషి జీవితాంతం ఆనందంగా ఉండలేడు..వసుకి ఆత్మవిశ్వాసం తెలివితేటలు అవసరం అయినదానికన్నా ఎక్కువిచ్చాడు.. వసు-రిషి జంట నాకు నచ్చలేదు..నువ్వు నేను కలసి రిషికి మనం మంచి జీవితాన్ని ఇవ్వాలి కదా..మంచి సంబంధం చూడాలి కదా అలా కావాలంటే నువ్వు నీ శిష్యురాలిని రిషికి దూరం చేయాలి ఏమంటావ్ జగతి..నువ్వు మంచి దానివి..నాకు తెలుసు..చెప్పినట్టు వింటావ్..మహేంద్రకి కూడా చెప్పాను. ఏం చేస్తావో తెలియదు రిషి జీవితంలోంచి వసుధార దూరంగా వెళ్లిపోవాలి
దేవయాని వెళ్లిన తర్వాత జగతి ఆలోచనలో ఉండిపోతుంది..భయపడుతున్న ధరణినిచూసి అక్కయ్య మాటలకు భయపడకు ఎవరు ఆనందంగా ఉన్నా చూసి ఓర్చుకోలేదు..ఇప్పుడు వసుపై విషం చిమ్ముతోంది.. రిషి వసుకి ఏం కావాలో వాళ్లకి తెలుసు వాళ్లిద్దరూ బావుంటారు బావుండాలి బావుండేలా చేస్తాను...వెళ్లొస్తాను ధరణి అనేసి జగతి వెళ్లిపోతుంది...
Guppedantha Manasu - Promo | 8th Oct 2022 | Mon-Sat at 7 pm Only on #StarMaa #StarMaaSerials #GuppedanthaManasu pic.twitter.com/CQvZE3RtYC
— starmaa (@StarMaa) October 8, 2022
Also Read: మరోసారి దీపను బుక్ చేసిన మోనిత, రాజ్యలక్ష్మి దగ్గరకు చేరిన కార్తీక్ పంచాయతీ!
మహేంద్ర: రిషి మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర..రిషి బాధనుచూడలేకపోతున్నాను ఏం చేయాలో ఎలా చేయాలో తెలియడం లేదు నీ గురుదక్షిణ ఒప్పందం వద్దు వసుధారా..అన్నీ మర్చిపోదాం..అన్నీ వదిలేద్దాం..వసుధార జరుగుతున్న పరిణామాలు చూస్తూ విసిగిపోయాను..నిన్ను ఏమీ అడగలేదు ఏమీ ఒప్పుకోలేదు.
వసు: అసలు ఎందుకుభయపడుతున్నారు..రిషి సార్ పై ఉన్న పుత్రవాత్సల్యం మిమ్మల్ని భయపెడుతోంది.. గురుదక్షిణ జగతి మేడంకి చెల్లించుకుంటాను
మహేంద్ర: నీకు పరిస్థితులు అర్థం కావడం లేదు..జరగరానిది ఏమైనా జరిగిదే ఏం చేస్తాం..అసలే రిషి పంతం గలవాడు.. ఈ కారణంగా మీరిద్దరూ దూరమైపోతారనే భయం
వసు: ఎట్టిపరిస్థితుల్లోనూ రిషి సార్ ని దూరం కానివ్వను..ఒకప్పటి రిషి సార్ కాదు.. నాకు కాలేజీలో అడ్మిషన్ ఇచ్చినప్పుడు నాకు కనిపించిన రిషిసార్ వేరు..కోపం చూడాల్సిన రిషి సార్ కళ్లలో ప్రేమ చూస్తున్నాను. జగతి మేడం విషయంలో చాలా మారారు..మార్పు ప్రకృతి సహజం..సార్ కచ్చితంగా మారుతారు..
మహేంద్ర: రిషిని తక్కువ అంచనా వేస్తున్నావ్
వసు: రిషి సార్ కన్నా నేను మొండిదాన్ని
మహేంద్ర: రిషి ఏమైపోతాడో అనే భయం ఉంది..
వసు: రిషిసార్ ప్రేమమాత్రమే కాదు తన బాధ్యతలు,బరువు కూడా పంచుకుంటాను.. తను నా జీవితం.. ఎట్టిపరిస్థితుల్లోనూ గురుదక్షిణ చెల్లించి తీరుతాను
మహేంద్ర: నీ సంకల్పం గొప్పది..నేను గురుదక్షిణ వద్దంటే నువ్వు సరే అంటావ్ అనుకున్నాను..నువ్వు గ్రేట్.. నన్ను నేను పరీక్షంచుకున్నాను నన్ను గెలిపించావ్..జగతిని కకూడా గెలిపిస్తావని ఆశిస్తున్నాను
Also Read: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి
అబ్బా తననొప్పి అని దేవయాని అనుకోగానే ధరణి వస్తుంది. తల మర్దనా చేయి అంటుంది
ధరణి: తలనొప్పి వచ్చినప్పుడు సంతోషించాలి..మనకు తల ఉందన్న విషయం తెలుస్తుంది కదా.. నేను ఇలాగే ఆలోచిస్తాను
దేవయాని: నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా... ఈఇంట్లో ఏం జరుగుతోంది చెప్పు
ధరణి: ఏం ఉంటుంది.. లేస్తాను..టిఫిన్లు, లంచ్..
దేవయాని: రిషి వసుధార గురించి ఏమనుకుంటున్నారు
ధరణి: వసు మంచి అమ్మాయి అంటూ గలగలా చెబుతుంది...
దేవయాని: జగతి మహేంద్రలు వసుధార గురించి ఏమనుకుంటున్నారని మళ్లీ అడుగుతుంది
ధరణి: వసు మంచిఅమ్మాయి,తెలివైన అమ్మాయి, లోక జ్ఞానం ఉంది అంటుంది
దేవయాని: వాళ్ల ప్లానింగ్ ఏంటి, ఐడియా ఏంటో చెప్పాలి..
ధరణి: ఇవన్నీ ఎందుకు..మీరంతా కలసి కూర్చుని ప్లాన్ చేయొచ్చుకదా..
దేవయాని: నువ్వు కాఫీలు ఇవ్వడానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావు వెళ్లు.. వేరేవాళ్ల లుక్కులో ఏముందో గ్రహించగలను కానీ నీ లుక్కులో ఏముందో అస్సలు గ్రహించలేను..
జగతి రూమ్ లో కూర్చుని రిషిగురించి ఆలోచిస్తుంటే వసు వచ్చి రిపోర్ట్ ఇస్తుంది...జగతి ఏదో చెప్పబోతుంటే వసుధార ఫీల్డ్ విజిట్ గురించి చెబుతుంటుంది...ఆవేశంగా లేచి నిలబడి క్లాస్ వేస్తుంది జగతి
జగతి: ఎంతకాలం ఓపిక పట్టాలి..అసలేం జరుగుతోంది మీ ఇద్దరి మధ్యా..
వసు: మేం బాగానే ఉన్నాం కదా
జగతి: ఏం బావున్నారు, ఎక్కడ బావున్నారు..నువ్వు మహేంద్ర కలసి గురుదక్షిణ ఒప్పందం చేసుకున్నారు కదా.. నేను ఇన్నాళ్లూ రిషి మనసుకి గాయం కాకూడదనే జాగ్రత్త పడ్డాను కానీ నా భయాన్ని నువ్వు నిజం చేస్తున్నావ్.. నువ్వు అసలు ఇక్కడకు రాకుండా ఉంటే బావుండేది..
వసు: మీరేకదా నన్ను ఇక్కడకు రికమండ్ చేసింది
జగతి: ఇద్దరూ కలిశారు విడిపోయారు..మళ్లీ కలిశారు..ఎందుకిలా చేస్తున్నావ్..
వసు: నేనేం చేశాను
జగతి: నీ మొండిపట్టు వదులు..రిషి నన్ను అమ్మా అని పిలవకపోతే తప్పేంటి..నువ్వు చేస్తోంది అంతకన్నా పెద్ద తప్పు..
మీ బంధంగురించి ఆలోచించు..నీకు రిషి కోపం గురించి తెలియదు.
వసు: కోపం కోపమే ప్రేమ ప్రేమే...
జగతి: స్టాపిట్..అని అరుస్తూ టేబుల్ పై ఉన్నవన్నీ విసిరికొడుతుంది.. దేవయాని మాటలు గుర్తుచేసుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు..జీవితాలు నాశనం అవుతాయి.. నీ మొండితనం తగ్గించుకో
ఏమైంది అంటూ మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు... ఎపిసోడ్ ముగిసింది...