(Source: ECI/ABP News/ABP Majha)
Guppedantha Manasu ఆగస్టు 30 ఎపిసోడ్: మనసు మాట్లాడమంటోంది షరతు వద్దంటోంది - ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
Guppedantha Manasu August 30 Episode 542: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఎట్టకేలకు రిషి- వసుధార ఒక్కటయ్యారు
గుప్పెడంతమనసు ఆగస్టు 30 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 30 Episode 542)
వసుధార ఊహల్లో ఉన్న రిషి..ఆమె కాఫీ తెచ్చిఇచ్చినట్టు ఊహించుకుంటాడు..ఆ తర్వాత కిందకు దిగివచ్చి సోఫాలో ఉన్నట్టు ఊహించుకుని ఏదేదో మాట్లాడతాడు. ఆ తర్వాత ఇదంతా ఊహేనా అనుకుని వసుధారకి కాల్ చేయాలని అనుకుంటాడు. అటు వసుధార కూడా రిషి గురించే ఆలోచిస్తూ సార్ కి కాల్ చేయాలా అని అనుకుంటుంది. కిచెన్లో పనిచేస్తున్న జగతి..రిషి ఏదో గ్రూప్ క్రియేట్ చేసినట్టున్నాడే..ఇందుల నన్ను కూడా యాడ్ చేశాడు అనుకుంటుంది జగతి. అది చూసిన వసుధార గుడ్ ఐడియా సార్ అని వసు రిప్లై ఇస్తుంది. అబ్బో వసు అప్పుడే గ్రూప్ లో మెసేజెస్ మొదలు పెట్టినట్టుంది అని నవ్వుకుంటుంది జగతి. అందరకీ వచ్చిన డౌట్స్ ఇందులో అడగొచ్చా అని వసు..ఎప్పుడైనా అడగొచ్చని రిషి రిప్లై ఇస్తాడు.
Also Read: అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!
జగతి-మహేంద్ర-గౌతమ్
ఇదంతా చూసిన జగతి..ఈ మెసెజ్ కచ్చితంగా వసుకి మాత్రమే..గ్రూప్ లో ఇద్దరూ ఎవ్వరికీ తెలియకుండా చాటింగ్ చేసుకుంటున్నారా అని నవ్వుకుంటుంది. ఈ గ్రూప్ క్రియేట్ చేయడం మంచి ఆలోచన..మీరిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా ఇలా చాటింగ్ చేయడం సూపర్ రిషి అనుకుంటుంది జగతి. మరొకవైపు గౌతమ్,మహేంద్ర,జగతిలు కలసి వసు-రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్లెప్పుడు కలుస్తారో అని ఆందోళన చెందుతుంటారు. వీళ్లు మాట్లాడుకోవడం లేదు..ఫోన్లు కూడా మాట్లాడుకోవడం లేదు..ఇలా అయితే కలిసేదెలా అనుకుంటారు. అప్పుడు జగతి..గ్రూప్ లో మెసేజెస్ చూపిస్తుంది..అవి చూసి మహేంద్ర,గౌతమ్ ఇద్దరు ఆనందపడతారు.
అప్పుడు వసుధార గ్రూపులో కరెంటు పోయిందని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చదివిన మహేంద్ర ఇప్పుడు మన పుత్ర రత్నం కారు వేసుకుని వెళ్తాడు అంటాడు..ఇలా అనుకోగానే రిషి కారు తీసుకుని వెళ్లడంతో జగతి-గౌతమ్ ఇద్దరూ షాక్ అవుతారు. మరోవైపు వసుధార కరెంటు పోయినందుకు టార్చ్ లైట్ వేసుకుని...బుక్స్ తీసుకుని బయటికి వెళ్లి ఒంటరిగా కూర్చుని చందమామ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి అక్కడికి వస్తాడు.అప్పుడు వసు చదువుకుంటూ రిషి వసు వైపు చూస్తూ ఉండగా ఇంతలో గాలి రావడంతో పేపర్లో అన్నీ ఎగిరిపోతుంటే రిషి సహాయం చేస్తాడు. అప్పుడు రిషి,వసు కోసం టీ తీసుకుని వస్తాడు. ఇంతలోనే కరెంటు రావడంతో వసు బుక్స్ తీసుకొని రూమ్ కి వెళ్తు రిషి కోసం పేపర్లో ఒకటి రాసి అక్కడ పెట్టి వెళ్తుంది.ఆ పేపర్లో థ్యాంక్స్ ఫర్ టీ అని రాసి ఉంటుంది. అది చూసి రిషి సంతోషపడతాడు.
Also Read: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!
తెల్లారగానే కాలేజీకి వచ్చిన రిషి..వసుకోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు వసుధార స్టూడెంట్స్ కోసం టిప్స్ చెబుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి స్టూడెంట్స్ ని బాగా చదువుకోమని చెప్పి వసు బ్యాగులో ఒక పెన్ పెట్టి, ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసు తన బ్యాగులో పెన్ చూసి ఆనంద పడుతూ ఉండగా రిషి కూడా అది చూసి ఆనందంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వసుధార రిషి ని జెంటిల్మెన్ అని తలుచుకుని ఆనందపడుతూ ఉంటుంది.